EHS | నిమ్స్‌లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం కౌంటర్స్ ఎత్తేసిన సర్కార్
EHS | రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించే నిమ్స్ ఆస్పత్రిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్( EHS )కు సంబంధించిన కౌంటర్లను ఎత్తేశారు.
EHS | త్రినేత్ర.న్యూస్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ ఝలక్ ఇచ్చింది. అత్యుత్తమ నాణ్యమైన వైద్య సేవలు అందించే నిమ్స్ ఆస్పత్రిలో ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్( EHS )కు సంబంధించిన కౌంటర్లను ఎత్తేశారు. ఇప్పటి వరకు ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌కు సంబంధించిన కౌంటర్లు మొత్తం 10 ఉండేవి. ఇప్పుడు ఆ కౌంటర్లు లేకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. తమ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు కౌంటర్స్ ఎత్తివేయడం ప్రభుత్వానిది సరైన విధానం కాదు అని ప్రభుత్వ ఉద్యోగులు నిప్పులు చెరుగుతున్నారు.
ఇటీవలే అందుబాటులోకి నగదు రహిత చికిత్స సదుపాయం
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకున్న ప్రభుత్వం.. కొత్త ఈహెచ్ఎస్ పథకం అమలుకు చర్యలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఆగస్టు 22 నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
ఆగస్టు 22న సచివాలయంలో ట్రస్ట్ బోర్డు కన్వీనర్, ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ (EHCT) సీఈఓ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీజీ-జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్‌తో సహా ఉద్యోగుల ఆరోగ్య పథకం బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ స్టేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ (TSHA) అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, అలాగే అపోలో హాస్పిటల్స్, కాంటినెంటల్ హాస్పిటల్స్, యశోద హాస్పిటల్స్, కిమ్స్ హాస్పిటల్స్ వంటి ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రుల ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
చర్చల అనంతరం, టీఎస్‌హెచ్ఏతో పాటు ఆసుపత్రుల బృందాలు ఏకగ్రీవంగా న్యూ ఈహెచ్ఎస్ పథకాన్ని ఆ రోజు నుంచే తక్షణం అమలు చేయాలని అంగీకరించాయి. తద్వారా అర్హులైన లబ్ధిదారులకు నగదు రహిత చికిత్స సదుపాయాలు నేటి నుండి అందుబాటులోకి వచ్చాయి. సమావేశంలో న్యూ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. ఇవి ఆసుపత్రుల ఎంపానెల్‌మెంట్, చికిత్స ప్రోటోకాల్స్, క్లెయిమ్ సెటిల్‌మెంట్ విధానాలకు సంబంధించిన సవరించిన విధివిధానాలను నిర్దేశిస్తాయి.
ఈ కొత్త పథకానికి ఆసుపత్రుల వర్గం సహకరించిన తీరుపై ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించే దిశగా ఇది ఒక సానుకూల ముందడుగుగా అభివర్ణించారు. లబ్ధిదారులకు సకాలంలో, ఇబ్బంది లేకుండా చికిత్స లభించేలా న్యూ ఈహెచ్ఎస్ మార్గదర్శకాలను అక్షరాలా, స్ఫూర్తితో అమలు చేయడంలో పూర్తి సహకారం అందించాలని ఎంపానెల్డ్ ఆసుపత్రులందరికీ ట్రస్ట్ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు
- ●Konda Murali | ఢిల్లీకి రామ్మ అంటే గూడా సురేఖమ్మ పోతలేదు
- ●NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు
- ●CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్
- ●RGV on Artificial Intelligence | జేబులో చిల్లిగవ్వ లేనప్పుడు ఎదురుగా నగదుతో నిండిన పెద్ద లాకర్ ఉంటే దాన్ని తెరవకుండా ఎంతసేపు ఉండగలరు?
- ●TG Weather | మరో మూడురోజులు తెలంగాణలో భారీ వర్షాలు.. ఐఎండీ వార్నింగ్..!

Transgenders extortion Hyderabad BMW | లగ్జరీ కారు కొన్న పాపానికి రూ.2 లక్షలు ఇవ్వాలా? హైదరాబాద్‌లో BMW డెలివరీ వేళ ట్రాన్స్జెండర్ల బెదిరింపులు

Konda Murali | ఢిల్లీకి రామ్మ అంటే గూడా సురేఖమ్మ పోతలేదు

NIMS | చిన్నారులకు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు

CM Revanth Reddy | రోశయ్య దూర దృష్టి వల్లే తెలంగాణకు మిగులు బడ్డెట్





