త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nizamabad | త‌ల్లి మంద‌లించింద‌ని.. సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 14 ఏండ్ల బాలుడు

Nizamabad | త‌ల్లి మంద‌లించింద‌ని అలిగిన 14 ఏండ్ల బాలుడు.. సైకిల్‌తో ఇంటి నుంచి పారిపోయాడు. పంతానికి పోయి సైకిల్‌పై 50 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాడు.

G

Telangana | Published On Apr 9, 2026, 10.11 am IST

Nizamabad | త‌ల్లి మంద‌లించింద‌ని.. సైకిల్‌పై నిజామాబాద్ నుంచి కామారెడ్డికి 14 ఏండ్ల బాలుడు
Advertisement

Nizamabad | త్రినేత్ర‌.న్యూస్‌: త‌ల్లి మంద‌లించింద‌ని అలిగిన 14 ఏండ్ల బాలుడు.. సైకిల్‌తో ఇంటి నుంచి పారిపోయాడు. పంతానికి పోయి సైకిల్‌పై 50 కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించాడు. తీరా అర్ధ‌రాత్రి స‌మ‌యంలో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని చూసిన పోలీసులు అస‌లు విష‌యం తెలుసుకుని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించారు.

నిజామాబాద్‌లోని (Nizamabad) వినాయక్‌నగర్‌కు చెందిన 14 ఏండ్ల‌ బాలుడిని త‌న‌ తల్లి మందలించింది. దీంతో అలిగిన అత‌డు సైకిల్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మంగళవారం మధ్యాహ్నం నిజామాబాద్ నుంచి బ‌య‌ల్దేద‌రిన అత‌డు.. సుమారు 50 కిలోమీటర్ల మేర ప్రయాణించి అర్ధరాత్రి 11 గంటల సమయంలో కామారెడ్డి సమీపంలోని టేక్రియాల్‌ జంక్షన్‌కు చేరుకున్నాడు. అదే సమయంలో అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసుల కంట‌ప‌డ్డాడు. చీకట్లో ఒంటరిగా వెళ్తుండ‌టంతో అత‌డిని ఆపి వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం బాలుడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు బుధవారం తెల్లవారుజామున 3 గంటలకు దేవునిప‌ల్లి పోలీస్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. బాలుడికి కౌన్సెలింగ్ అనంత‌రం త‌ల్లిదండ్రుల‌కు అప్ప‌గించారు. దీంతో వారు పోలీసుల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

ట్యాగ్స్:

Advertisement
Advertisement