Gold And Silver Prices Today | నష్టాల్లో ఈక్విటీ మార్కెట్లు.. బంగారం, వెండి ధరలపైనా ప్రభావం..
అమెరికా-ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతోపాటు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఏర్పడడంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు గత 3 సెషన్ల నుంచి నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే ప్రభావం బులియన్ మార్కెట్‌లపైనా పడింది. బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి.
Gold And Silver Prices Today | అమెరికా-ఇరాన్‌ల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతోపాటు ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఏర్పడడంపై సందేహాలు నెలకొన్న నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు గత 3 సెషన్ల నుంచి నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇదే ప్రభావం బులియన్ మార్కెట్‌లపైనా పడింది. బంగారం, వెండి ధరల్లో స్వల్ప హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లలో వీటి ధరలు శుక్రవారం స్వల్పంగా తగ్గాయి. ఔన్స్ బంగారం ధర 0.63 శాతం మేర తగ్గి 4,446 డాలర్ల వద్ద ఉండగా, వెండి ధర 1.92 శాతం తగ్గి 72.49 డాలర్ల వద్ద ఉంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 1500 పాయింట్లకు పైగా పతనమై 1,57,990 వద్ద కొనసాగుతుండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 5,300 పాయింట్లు తగ్గి 2,59,450 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లోనూ బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల చోటు చేసుకుంది.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,573 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24, 584 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,730 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,57,300 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.3800 తగ్గింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,275 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,14,200గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,750 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,27,500గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.3500 తగ్గింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,680 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,440గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,800 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,68,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.2,800 తగ్గింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి కిలోకు రూ.5వేలు తగ్గింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,80,000 ఉండగా, తులం ధర రూ.2,800 గా ఉంది.
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
ఆగస్టు 20, 2026

Gold Prices | ఆగస్టులో మళ్లీ పుంజుకున్న బంగారం ధరలు.. ఇంకా పెరుగుతాయా, తగ్గుతాయా..?
ఆగస్టు 19, 2026

Gold And Silver Prices Today | ముడి చమురు ధరల ఎఫెక్ట్.. బులియన్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం..
ఆగస్టు 19, 2026
తాజావార్తలు
- ●Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ
- ●Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్
- ●Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?
- ●Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు
- ●DK Shivakumar | 1971 జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టాలి : డీకే శివకుమార్
- ●Hollywood | రిలీజ్‌కు రెండు రోజుల ముందు హాలీవుడ్ హీరో మూవీ లీక్ - ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై ట్రోల్స్

Panduga Sayanna | అధికారికంగా పండుగ సాయన్న జయంతి, వర్ధంతి నిర్వహణ

Gongidi Sunitha | రేవంత్ రెడ్డి సీఎంగా, హోం, ఎడ్యుకేషన్ మినిస్టర్‌గా ఫెయిల్

Vande Mataram Controversy | వందేమాతరం వివాదం: కాంగ్రెస్ ఆ రెండు చరణాలే ఎందుకు పాడుతుంది? మిగతా వాటిల్లో ఏముంది?

Ramachander Rao | కాంగ్రెస్ పార్టీకి దేశభక్తి అర్థం కాదు



