GHMC summer training camp | క్రమశిక్షణతో యువత క్రీడలను కొనసాగించాలి: గోల్కొండ జోనల్ కమిషనర్ ఉదయ్‌కుమార్
GHMC summer training camp | యువత క్రమశిక్షణతో క్రీడలను కొనసాగించాలని గోల్కొండ జోనల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ సూచించారు. క్రీడలతో మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. అనంతరం ప్రపంచ పర్యావరణ వేడుకల్లో భాగంగా అక్కడే ఉన్న ఆట స్థలంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు.
GHMC summer training camp | త్రినేత్ర.న్యూస్: యువత క్రమశిక్షణతో క్రీడలను కొనసాగించాలని గోల్కొండ జోనల్ కమిషనర్ ఉదయ్‌కుమార్ సూచించారు. జీహెచ్‌ఎంసీ వేసవి శిక్షణా శిబిరాల ముగింపు వేడుకలను శుక్రవారం విక్టరీ ప్లే గ్రౌండ్ (వీపీజీ)లో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. క్రీడలతో మెరుగైన భవిష్యత్తు ఉంటుందన్నారు. ఆటలు శారీరక, మానసికోల్లాసానికి దోహదపడతాయన్నారు.






కోచ్‌లకు అభినందన..
గత కొన్నేళ్లుగా ఈ వేసవి శిక్షణా శిబిరాల నుంచి అనేకమంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఎదిగారన్నారు. నగరం, రాష్ట్రం, దేశానికే కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టారని కొనియాడారు. అంకితభావంతో, క్రమశిక్షణతో క్రీడలను కొనసాగించాలని యువతకు సూచించారు. అనంతరం యువ ప్రతిభను గుర్తించి, శిక్షణ ఇవ్వడంలో నిరంతరం కృషి చేస్తున్న కోచ్‌లను అభినందించారు.

ఆట స్థలంలో మొక్కలు నాటిన ఉదయ్‌కుమార్..
అనంతరం ప్రపంచ పర్యావరణ వేడుకల్లో భాగంగా అక్కడే ఉన్న ఆట స్థలంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనం ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేశారు. పరిశుభ్రత, ప్రజారోగ్య పరిరక్షణకు అంకితభావంతో సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికులను ఆయన సత్కరించారు. ఈ కార్యక్రమంలో గోషామహల్ డీసీ ఉమాప్రకాష్, క్రీడల డైరెక్టర్ ఎండీకే మొయిజుద్దీన్, విద్యార్థులు, కోచ్‌లు, తల్లిదండ్రులు, క్రీడా అధికారులు, ప్రముఖులు పాల్గొన్నారు.


ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ponnam Prabhakar | వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
జూన్ 5, 2026

Ponnam Prabhakar | నీటిని ఆదా చేయండి.. భవిష్యత్తులో వర్షాలు రాకుండా ఉండే పరిస్థితి వస్తుంది: మంత్రి పొన్నం ప్రభాకర్
జూన్ 5, 2026

Ebola | హైదరాబాద్‌లో రెండుకు చేరిన ఎబోలా అనుమానితులు.. గాంధీ దవాఖానలో చికిత్స
జూన్ 5, 2026
తాజావార్తలు
- ●Donald Trump | మోదీ నాకు గుడ్ ఫ్రెండ్.. భారత్‌తో త్వరలోనే బిగ్ డీల్ : ట్రంప్
- ●Annamalai | జాతీయ పార్టీలపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
- ●Doctors Strike | వైద్యుల సమ్మె.. ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిన ఓపీ సేవలు
- ●Ponnam Prabhakar | వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు
- ●Rajesh Exports | రూ.15 లక్షల కోట్ల మిస్టరీ.. రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ ఆదాయం పజిల్.. సెబీ దర్యాప్తుతో గుట్టు రట్టు..
- ●Student Suicide | శ్రీచైతన్య కాలేజీ హాస్టల్లో ఇంటర్ సెకండియర్ విద్యార్థి ఆత్మహత్య.. తల్లిదండ్రులు రాకముందే..

Donald Trump | మోదీ నాకు గుడ్ ఫ్రెండ్.. భారత్‌తో త్వరలోనే బిగ్ డీల్ : ట్రంప్

Annamalai | జాతీయ పార్టీలపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు

Doctors Strike | వైద్యుల సమ్మె.. ప్రభుత్వ దవాఖానల్లో నిలిచిన ఓపీ సేవలు

Ponnam Prabhakar | వాతావరణ మార్పులను తట్టుకునే నగరాన్ని నిర్మిద్దాం: మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు



