F-35 Fighter Jet | అమెరికా ఎఫ్-35 ఫైటర్ జెట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. తామే దాడిచేశామన్న ఐఆర్జీసీ
ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్గా పేరుపొందిన అమెరికా ఎఫ్-35 లైట్నింగ్-2 యుద్ధ విమానం (F-35 Fighter Jet) ఎమర్జెన్సీ లాండింగ్ (Emergency Landing) కలకలం సృష్టించింది. ఇరాన్పై సైనిక చర్యల్లో పాలుపంచుకున్న ఆ యుద్ధ విమానం అకస్మాత్తుగా వెనుదిరిగి సమీపంలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా దిగిపోయింది.
International | Published On Mar 20, 2026, 9.36 am IST
F-35 Fighter Jet | త్రినేత్ర.న్యూస్: ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా (US) యుద్ధం 21వ రోజుకు చేరింది. ఇరు పక్షాల పరస్పర దాడులతో పశ్చిమాసియాలో (Middle East) తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్ (Iran) చమురు క్షేత్రాలపై దాడులను నిలిపివేస్తామన్న ఇజ్రాయెల్.. ఆ దేశ రాజధానిపై క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. టెహ్రాన్పై మెరుపు దాడులు చేస్తున్నది. అగ్రనాయకత్వాన్ని కోల్పోయినా ఇరాన్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్లన్ డ్రోన్లు, క్షిపణులతో ఎదుర్కొంటున్నాది.
కాగా, ప్రపంచంలోనే అత్యాధునిక ఫైటర్ జెట్గా పేరుపొందిన అమెరికా ఎఫ్-35 లైట్నింగ్-2 యుద్ధ విమానం (F-35 Fighter Jet) ఎమర్జెన్సీ లాండింగ్ (Emergency Landing) కలకలం సృష్టించింది. ఇరాన్పై సైనిక చర్యల్లో పాలుపంచుకున్న ఆ యుద్ధ విమానం అకస్మాత్తుగా వెనుదిరిగి సమీపంలోని అమెరికా సైనిక స్థావరంలో అత్యవసరంగా దిగిపోయింది. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ (US Central Command) కూడా ధ్రువీకరించింది. ఎఫ్-35 విమానం సురక్షితంగా లాండ్ అయ్యిందని, పైలట్ సేఫ్గా ఉన్నారని వెల్లడించింది. ఇరాన్ క్షిపణి ఢీకొనడంతోనే ఇలా జరిగి ఉండవచ్చని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
అయితే యూఎస్ ఎఫ్-35 యుద్ధ విమానంపై తాము దాడి చేశామని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
https://x.com/MarioNawfal/status/2034666850458702143
ఇరాన్తో యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికాకు చెందిన 16 యుద్ధ విమానాలు కుప్పకూలాయి. వీటిలో 10 MQ-9 రీపర్ డ్రోన్లను శత్రు దళాలు కూల్చగా.. మరికొన్ని యుద్ధంలో దాడికి గురయినట్లు సమాచారం. మూడు ఎఫ్-15 యుద్ధ విమానాలను కువైట్ సైన్యం పొరపాటున కూల్చివేసింది. ఇక ఇరాక్లో అమెరికా వాయుసేనకు చెందిన రీఫ్యూయలింగ్ విమానం కేసీ-135 కుప్పకూలిన సంగతి తెలిసిందే. సౌదీ అరేబియాలో ఓ వైమానిక స్థావరంపై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో ఐదు కేసీ-135 రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతిన్నాయి.
తాజావార్తలు
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
- ●Anant Nag | అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Disha Patani | గాగ్రాలో గ్లామరస్గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

Anant Nag | అనంత్ నాగ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం

BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు






