Nashik Astrologer Ashok Kharat Arrested | రహస్య కెమెరాలు.. 58 మంది మహిళలు: కీచక జ్యోతిష్యుడి చీకటి బాగోతం!
మహారాష్ట్రలోని నాసిక్‌లో కళ్లు బైర్లుకమ్మే దారుణం వెలుగుచూసింది. పూజలు, దోష నివారణల పేరుతో మహిళలను మభ్యపెట్టి ఓ కీచక జ్యోతిష్యుడు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తన ఆఫీసులో రహస్య కెమెరాలు అమర్చి ఏకంగా 58 మంది మహిళల అసభ్యకర వీడియోలు రికార్డ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Nashik Astrologer Ashok Kharat Arrested | ఆధ్యాత్మికత ముసుగులో, జ్యోతిష్యం పేరుతో ఓ కీచకుడు చేసిన దారుణాలు మహారాష్ట్రలోని నాసిక్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కరిస్తానని నమ్మించి, మహిళలను తన ఆశ్రమానికి పిలిపించుకుని వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్న 67 ఏళ్ల అశోక్ ఖారత్ అనే ప్రముఖ జ్యోతిష్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పూజల నెపంతో ఒక 35 ఏళ్ల మహిళకు మత్తుమందు ఇచ్చి, హిప్నటైజ్ చేసి పదే పదే అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే, పోలీసుల దర్యాప్తులో కేవలం ఒక్క మహిళ మాత్రమే కాకుండా ఎంతో మంది అతడి బాధితులుగా ఉన్నట్లు తేలింది.
నేరాల తీరు.. భయపెట్టి లొంగదీసుకుని
రిటైర్డ్ మర్చంట్ నేవీ అధికారి అయిన అశోక్ ఖారత్ తనను తాను 'కెప్టెన్' అని పిలుచుకుంటాడు. పోలీసుల ఎఫ్ఐఆర్ ప్రకారం.. సమస్యలతో తన దగ్గరకు వచ్చే మహిళలకు మాయమాటలు చెప్పి ఆఫీసుకు పిలిపించుకునేవాడు. అక్కడ వారికి మత్తుమందు ఇచ్చి హిప్నటైజ్ చేసేవాడు. అనంతరం, వాళ్ల మాట వినకపోతే వారి భర్తలు చనిపోతారని, చేతబడి చేస్తానని భయభ్రాంతులకు గురిచేసి వారిపై లైంగిక దాడికి పాల్పడేవాడు.
రహస్య కెమెరాలు.. 58 మంది బాధితులు
దర్యాప్తులో పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. అశోక్ ఖారత్ తన ఆఫీసులో రహస్యంగా సీసీటీవీ (CCTV) కెమెరాలు అమర్చాడు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఒక పెన్ డ్రైవ్‌లో ఏకంగా 58 మంది వేర్వేరు మహిళలతో అతను జరిపిన అశ్లీల, లైంగిక దాడుల వీడియో క్లిప్‌లు లభ్యమయ్యాయి. నాసిక్‌లోని కెనడా కార్నర్ అనే ఖరీదైన ప్రాంతంలో 'ఓకస్ ప్రాపర్టీ డీలర్స్ అండ్ డెవలపర్స్' (Oakus Property Dealers and Developers) పేరిట అతను ఓ ఆఫీసును నడుపుతున్నాడు. అయితే అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కంటే కూడా ఈ చీకటి దందాయే ఎక్కువగా సాగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
రాజకీయ నాయకులు, వీఐపీలతో పరిచయాలు
సమాజంలో అతీత శక్తులు ఉన్న గొప్ప జ్యోతిష్యుడిగా అశోక్ ఖారత్ చలామణి అయ్యాడు. ఢిల్లీ నుంచి మహారాష్ట్రలోని అధికార పీఠాల వరకు అతనికి రాజకీయ పరిచయాలు ఉన్నాయని ప్రచారం ఉంది. మిర్గావ్‌లో అతనికి ఇశాన్యేశ్వర్ ఆలయం, ఒక విలాసవంతమైన ఆశ్రమం ఉన్నాయి. నాసిక్‌లోని సిన్నార్‌లో ఉన్న శ్రీ ఇశాన్యేశ్వర్ టెంపుల్ ట్రస్ట్‌కు ఛైర్మన్‌గా ఉన్న ఖారత్ వద్దకు.. ప్రముఖ రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తరచూ ఆశీస్సుల కోసం వస్తుండేవారు.

సినిమాను తలపించేలా అరెస్ట్
నిందితుడి అరెస్టు విషయం ఎక్కడా లీక్ కాకుండా ఉండేందుకు పోలీసులు అత్యంత రహస్యంగా ఆపరేషన్ నిర్వహించారు. చీకటి పడ్డాక అతని ఫామ్‌హౌస్ బయట "దొంగ.. దొంగ.." అంటూ పోలీసులు గట్టిగా అరుస్తూ గందరగోళం సృష్టించారు. ఆ గొడవ ఏంటో తెలుసుకునేలోపే, పోలీసులు నేరుగా ఇంట్లోకి ప్రవేశించి అతడిని బెడ్‌రూమ్‌లోనే పట్టుకున్నారు.
ఈ దాడుల్లో అతని ఫామ్‌హౌస్ నుంచి ఒక పిస్టల్, లైవ్ బుల్లెట్లు, వాడిన బుల్లెట్ల కవచాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిర్గావ్‌లోని ఆలయం, ఆశ్రమంలో జరిపిన సోదాల్లో పలు అనుమానాస్పద పత్రాలు లభించాయి. మహారాష్ట్ర వ్యాప్తంగా అతనికి ఉన్న ఆస్తులపైనా పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు.
ఈ కేసును విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐపీఎస్ అధికారిణి తేజస్విని సత్పుటే నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. నాసిక్ క్రైమ్ బ్రాంచ్ యూనిట్ వన్ ఈ వీడియోలు, డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
రాజకీయ దుమారం
ఈ కేసు ఇప్పుడు మహారాష్ట్రలో రాజకీయ దుమారానికి దారితీసింది. గతంలో ఎంతో మంది నాయకులు ఈ జ్యోతిష్యుడిని కలవడం చర్చనీయాంశంగా మారింది. "మహిళలను శారీరకంగా వాడుకునే ఇలాంటి వ్యక్తుల పాదాలు కడగాలా? ఉపముఖ్యమంత్రి ఈ దారుణాన్ని సీరియస్‌గా తీసుకోవాలి" అని ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన నాయకురాలు సుష్మా అంధారే డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం
- ●Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!
- ●Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం
- ●BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు
- ●Gold Mine Collapse | కుప్పకూలిన బంగారు గని.. 60 మంది మృతి
- ●Fact Check | ఫ్యాక్ట్ చెక్.. 9 ప్రభుత్వ బ్యాంకుల విలీనంపై గెజిట్.. కేంద్రం క్లారిటీ..

Harish Rao | నిషేధిత భూములపై బీఆర్ఎస్ ఆరోపణలు అక్షర సత్యం

Disha Patani | గాగ్రాలో గ్లామరస్‌గా దిశా పటానీ.. అంబానీ గణేశ్ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్!

Anant Nag | అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానానికి గౌరవం

BRS MLC Naveen Kumar Lands | అసలు నాకు సిద్దిపేట జిల్లాలో భూమే లేదు



