Nobel Peace Prize | శాంతి చర్చల వేళ.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు నోబెల్ శాంతి ఇవ్వాలంటూ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం
Nobel Peace Prize | ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. అయితే, ఈ శాంతి ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
International | Published On Apr 10, 2026, 11.20 am IST
Nobel Peace Prize | ఇరాన్, అమెరికా మధ్య రెండు వారాల పాటు కాల్పుల విరమణ (Ceasefire) కుదిరిన విషయం తెలిసిందే. అయితే, ఈ శాంతి ఒప్పందంలో పాకిస్థాన్ మధ్యవర్తిగా వ్యవహరించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. నేడు ఇస్లామాబాద్ వేదికగా.. ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌లోని పంజాబ్ అసెంబ్లీ (Pak Punjab Assembly) ముందుకు ఓ కీలక తీర్మానం వచ్చింది.
పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif), ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్‌లకు నోబెల్ శాంతి బహుతి (Nobel Peace Prize) ఇవ్వాలని సిఫార్సు చేస్తూ పంజాబ్ అసెంబ్లీలో తీర్మానం దాఖలైంది. ఈ తీర్మానాన్ని పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్ చీఫ్ విప్ రాణా మహమ్మద్ అర్షద్ ప్రవేశపెట్టారు. దేశాభివృద్ధికి, శాంతి స్థాపనకు వారు చేసిన కృషిని గుర్తిస్తూ ఈ గౌరవం దక్కాలని తీర్మానంలో పేర్కొన్నారు.
ఇస్లామాబాద్‌లో భద్రత కట్టుదిట్టం..
మరోవైపు పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు పాకిస్థాన్ వేదికగా నేటి నుంచి ప్రత్యక్ష చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చలకు అమెరికా-ఇరాన్ ప్రతినిధుల బృందం ఇప్పటికే ఇస్లామాబాద్ చేరుకుంది. ఇక ఈ శాంతి చర్చల వేళ ఇస్లామాబాద్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. పాక్ రాజధాని మొత్తం రెడ్‌జోన్‌లోకి వెళ్లిపోయింది. చర్చల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం రెండు రోజుల పాటూ ప్రభుత్వ సెలవు ప్రకటించింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు మూతపడ్డాయి.
Also Read..
అబద్ధాలకు నేటితో ముగింపు పలకాలి.. ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై మెలానియా ట్రంప్
భారీ లాభాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. తగ్గిన చమురు ధరలు, బలపడ్డ డాలర్..
సంబంధిత వార్తలు

commercial shipping | వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపండి.. ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు
జులై 14, 2026

Donald Trump | ఇరాన్ పని అయిపోయింది.. మొజ్తబా ఖమేనీ 90 శాతం చనిపోయినట్లే : డొనాల్డ్ ట్రంప్
జులై 14, 2026

Strait of Hormuz | హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ దాడి.. భారతీయుడు మృతి
జులై 14, 2026
తాజావార్తలు
- ●Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ
- ●V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?
- ●Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ
- ●Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు
- ●Harish Rao | 22ఏ భూముల వ్యవహారంలో ఏ1 రేవంత్‌రెడ్డి, ఏ2 పొంగులేటి
- ●TGSRTC | హైదరాబాదీలకు ఆర్టీసీ గుడ్‌న్యూస్.. రాత్రిపూట నడవనున్న బస్సులు

Caste Census | కులగణనలో ఓపెన్ ఎండెడ్ విధానం వద్దు.. ప్రధానికి రాహుల్, ఖర్గే లేఖ

V Srinivas Goud | ఇండెంట్ పెట్టకుండ ఉత్తమ్ ఏం చేస్తున్నడు?

Bandla Ganesh | ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల బరిలో బండ్ల గణేష్ - అధ్యక్ష పదవికి పోటీ

Mumbai Local Train Viral Video | ముంబై లోకల్ ట్రైన్ షాకింగ్ వీడియో: ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బయట వేలాడుతున్న మహిళలు



