Pakistani man | ఇరాన్‌తో కలిసి ట్రంప్ హత్యకు కుట్ర.. దోషిగా తేలిన పాకిస్థానీ
Pakistani man | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా ఇతర రాజకీయ నేతల హత్యలకు కుట్ర పన్నిన కేసులో పాకిస్థాన్‌కు చెందిన (Pakistani man) ఆసిఫ్ మర్చంట్ (47)ను న్యూయార్క్ ఫెడరల్ కోర్టు దోషిగా నిర్ధారించింది.
International | Published On Mar 7, 2026, 12.11 pm IST
Pakistani man | అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సహా ఇతర రాజకీయ నేతల హత్యలకు కుట్ర పన్నిన కేసులో పాకిస్థాన్‌కు చెందిన (Pakistani man) ఆసిఫ్ మర్చంట్ (47)ను న్యూయార్క్ ఫెడరల్ కోర్టు దోషిగా నిర్ధారించింది. 2020లో మరణించిన ఇరాన్ ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఖాసిం సులేమానీ మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి.. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ఆదేశాల మేరకు ఆసిఫ్ ఈ కుట్రకు పాల్పడినట్లు ఫెడరల్ జ్యూరీ తేల్చింది. ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కుట్ర కేసులో ఆసిఫ్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది.
అమెరికా న్యాయ శాఖ (DOJ) ప్రకటన ప్రకారం.. మర్చంట్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) వద్ద శిక్షణ పొందిన ఏజెంట్. అయితే, రాజకీయ నాయకుల హత్య కోసం ఐఆర్‌జీసీ తనను 2024లో అమెరికాకు పంపినట్లు అతడు విచారణలో అంగీకరించాడు. ఇరాన్ ఆదేశాలతోనే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, మాజీ అధ్యక్షుడు బైడెన్, నిక్కీ హేలీ సహా పలువురు రాజకీయ నేతలను టార్గెట్ చేసినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకోవాలని తనకు స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు అతను తెలిపాడు.
ఐఆర్‌జీసీ ఆదేశాలతో మర్చంట్ ఏప్రిల్ 2024లో అమెరికాకు చేరుకున్నాడు. అక్కడ తన ప్లాన్ కోసం కొందరిని సంప్రదించాడు. అయితే, మర్చంట్ కలిసిన వారు మారువేషంలో ఉన్న అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు. దీంతో అతడి ప్లాన్ వర్కవుట్ కాలేదు. ఇక జూలై 2024లో అతను దేశం విడిచి వెళ్లే క్రమంలో అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. న్యూయార్క్ సిటీ కోర్టులో ఈ కేసుపై గత వారం రోజులుగా వాదనలు జరుగుతున్నాయి. టెహ్రాన్‌లో ఉన్న తన ఫ్యామిలీని కాపాడుకోవాలన్న భయంతో ఆ పనిచేసినట్లు మర్చంట్ తెలిపాడు.
Also Read..
Gaddar Awards | డిప్యూటీ సీఎం భట్టి చేతికి గద్దర్ అవార్డుల విజేతల వివరాలు..
Dera Baba | జర్నలిస్ట్ హత్య కేసు.. డేరా బాబాను నిర్దోషిగా ప్రకటించిన కోర్టు
Gold And Silver Rates Today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. యుద్ధం ఎఫెక్ట్ మొదలైందా..?
తాజావార్తలు
- ●Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు
- ●CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Pradeep Rawat | టాలీవుడ్ విలన్ ప్రదీప్ రావత్ కన్నుమూత - రాజమౌళి సినిమాతో ఫేమస్ - ఐదు భాషల్లో సినిమాలు

CM Revanth Reddy | పోలీస్ ఉద్యోగ నియామకాలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం






