త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?

CM Revanth Reddy | "సహనానికి ఓ హద్దు ఉంటుంది. మీకేదైనా సమస్య ఉంటే నాతో వచ్చి మాట్లాడండి. అంతేకానీ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కొంతమంది బహిరంగ సభల్లో నాపై నోరు పారేసుకుంటున్నారు. నన్నే కమాండ్ చేస్తున్నారు. వాళ్లు పని చేయరు. నన్ను పనిచేయనివ్వరు. నేను పనిచేస్తే ఓరుస్తలేరు. ఏది చేయాలో ఏది చేయకూడదో ముఖ్యమంత్రిగా నాకో స్పష్టత ఉంటుంది కదా. ఎవరు పడితే వాళ్లు నన్ను తిట్టి.. పార్టీ పరువు బజారుకీడిస్తే మనం వచ్చే ఎన్నికల్లో ఎట్లా గెలుస్తాం. కలిసుందామా? కొట్టుకుందామా? మీరే చెప్పండి" అంటూ పార్టీ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు.

S

Telangana | Published On Nov 22, 2026, 6.54 pm IST

CM Revanth Reddy | నన్నే కమాండ్ చేస్తరా? కలిసుందామా? కొట్టుకుందామా?
Advertisement

మీరు పని చేయరు
నేను పనిచేస్తే ఓర్వలేరు
పై నుంచి నాకే సలహాలు ఇస్తారా?
ఏం చేయాలో చేయకూడదో నాకు తెల్వదా?
మీ సమస్య ఏదైనా ఉంటే
నాకే వచ్చి చెప్పుకోవచ్చు కదా
నన్ను తిట్టడానికి కంకణం కట్టుకున్నారా?
ఇట్లా పార్టీ పరువు తీస్తే.. నెక్ట్స్ గెలిచేదెట్లా
పార్టీ వ్యవహారాల కమిటీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy | త్రినేత్ర న్యూస్ : "సహనానికి ఓ హద్దు ఉంటుంది. మీకేదైనా సమస్య ఉంటే నాతో వచ్చి మాట్లాడండి. అంతేకానీ నన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నట్టు కొంతమంది బహిరంగ సభల్లో నాపై నోరు పారేసుకుంటున్నారు. నన్నే కమాండ్ చేస్తున్నారు. వాళ్లు పని చేయరు. నన్ను పనిచేయనివ్వరు. నేను పనిచేస్తే ఓరుస్తలేరు. ఏది చేయాలో ఏది చేయకూడదో ముఖ్యమంత్రిగా నాకో స్పష్టత ఉంటుంది కదా. ఎవరు పడితే వాళ్లు నన్ను తిట్టి.. పార్టీ పరువు బజారుకీడిస్తే మనం వచ్చే ఎన్నికల్లో ఎట్లా గెలుస్తాం. కలిసుందామా? కొట్టుకుందామా? మీరే చెప్పండి" అంటూ పార్టీ వ్యవహారాల కమిటీ భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్తగా నియమితులైన ఇన్ చార్జి సందీప్‌కు ఆయన ఘనస్వాగతం పలికి.. పార్టీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు.

అధిష్టానానికి వదిలేద్దాం

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇటీవల బహిరంగ వేదికలపై చేసిన సంచనల వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. పార్టీ క్రమశిక్షణకు భంగం కలిగించకుండా ఉండాలని ఆయన సూచించారు. "క్షేత్రస్థాయిలో ఎంతమంది సీరియస్‌గా పనిచేస్తున్నారు. పార్టీ ఇచ్చిన టాస్క్‌లను ఎంతమంది గ్రౌండ్‌లో పూర్తి చేస్తున్నారు. సర్ ప్రక్రియలో లోటుపాట్లను సరిదిద్దేందుకు.. ఓటర్ల ఓట్లు కోల్పోకుండా మనం తీసుకున్న టాస్క్ కోసం ఎన్నిసార్లు మీటింగ్ పెట్టాల్సి వచ్చిందో మీరే చూశారు. పార్టీ కంటే వ్యక్తిగత పనులపైనే శ్రద్ధ ఉన్నవాళ్లు కూడా.. మేమే సీనియర్లమంటూ నన్ను తిట్టే పని పెట్టుకున్నారు. పైగా నాకే సలహాలు ఇస్తున్నారు. దీన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి? అధిష్టానం ఆ ఇద్దరిపై ఎటువంటి చర్యలు తీసుకుంటుందో నాకు తెలియదు. కానీ నా ఉద్దేశంలో అయితే ఈ సారికి వాళ్లిద్దరినీ వదిలేస్తేనే బావుంటుంది. ఇక ముందు ఇలాంటివి జరగకుండా చూసుకుందాం. కలిసుందామా? కొట్టుకుందామా? మీరే నిర్ణయించుకోండి. పార్టీ వచ్చేసారి ఎన్నికల్లో గెలవాలంటే.. మనమందరం సమిష్టిగా ఏకమవ్వాల్సిందే. చిన్న చిన్న అభ్యంతరాలు ఉన్నంత మాత్రాన వాటిని ప్రజలకు భూతద్దంలో చూపిస్తే ఎట్లా? చెడును చెవిలో చెప్పండి. మంచిని మైకులో చెప్పండి" అని దిశానిర్దేశం చేశారు.

Advertisement
Advertisement