త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vinod Kumar | కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ల‌క్ష కోట్లు ఖ‌ర్చు కానే కాలేదు : మాజీ ఎంపీ వినోద్

Vinod Kumar | కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ల‌క్ష కోట్లు ఖ‌ర్చు కానే కాలేద‌ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తేల్చిచెప్పారు.

S

Telangana | Published On Apr 1, 2026, 5.08 pm IST

Vinod Kumar | కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ల‌క్ష కోట్లు ఖ‌ర్చు కానే కాలేదు : మాజీ ఎంపీ వినోద్
Advertisement

Vinod Kumar | త్రినేత్ర‌.న్యూస్ : కేసీఆర్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు ల‌క్ష కోట్లు ఖ‌ర్చు కానే కాలేద‌ని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తేల్చిచెప్పారు. తెలంగాణ‌లో ఇరిగేష‌న్ ప్రాజెక్టుల ద్వారా రెండింత‌లు వ్య‌వ‌సాయం పెరిగింద‌ని చెప్తూనే.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు క‌ట్ట‌డం ద్వారా ల‌క్ష కోట్లు నీళ్ల‌ల్లో క‌లిసిపోయాయ‌ని బాధ్య‌త గ‌ల కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడొచ్చా అని వినోద్ కుమార్ నిల‌దీశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో వినోద్ కుమార్ బుధ‌వారం మీడియాతో మాట్లాడారు.

సీఆర్ పాటిల్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని అనేక సార్లు బీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఆర్ పాటిల్ మాట్లాడుతూ రాజ్యసభను తప్పుదోవ పట్టించారు. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనం ఏంటో మా నాయకుడు హరీష్ రావు అనేక సార్లు వివరాలతో సహా చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన అన్ని కొట్టుకొని పోయాయా..! అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్లు ఖర్చు కాలేదు. సీఆర్ పాటిల్ వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ ఎంపీలు లేఖ రాయ‌డం జ‌రిగింది. రాజ్యసభ హుందాతనం కాపాడాలి అంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఆర్ పాటిల్ వ్యాఖ్యలపై సమాధానం చెప్పాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

గడ్డిమందును 70 దేశాలు నిషేధించాయి, కేంద్ర ప్రభుత్వం గడ్డి మందు నిషేధంపై చొరవ తీసుకోవాలి. ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న చ‌ట్టానికి తూట్లు పొడిచి తెలంగాణలో ఉన్న 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపారు. రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా విభజన చట్టంలో సవరణ జరిగింది. ఎమ్మెల్సీల కోసం విభజన చట్టాన్ని మరొకసారి మార్చారు. చంద్ర బాబు నాయుడు ఏది చెప్తే కేంద్రం అది చేస్తుంది. తెలంగాణలో ఎంపీల సంఖ్య పెరగడం కోసం విభజన చట్టంలో సవరణ చేయాల‌ని అనేక సార్లు డిమాండ్ చేశాం. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన 7 మండలాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నామ‌ని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.

Advertisement
Advertisement