Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?: హరీశ్ రావు
Harish Rao | ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా? అని హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
Harish Rao | త్రినేత్ర.న్యూస్: వఆ వాహనాలు తనిఖీ చేస్తుండగా భూపాలపల్లి జిల్లా రవాణా అధికారి (DTO) వెంకన్నను లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన దవాఖానకు తరలించేలోపే మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా? అని ప్రశ్నించారు. భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. డీటీఓ వెంకన్న మరణం వెనుక ఉన్న వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు. సమగ్ర విచారణ జరిపి దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఇసుక, బొగ్గు మాఫియాలకు అడ్డొస్తే లారీలతో తొక్కించి చంపిస్తారా?
భూపాలపల్లి డీటీఓ వెంకన్న ప్రమాదం వెనుక దాగిన నిజాన్ని వెలికితీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
అధికారులను బెదిరిస్తూ అక్రమ దందాలు సాగిస్తున్న ఇసుక మాఫియా, బొగ్గు మాఫియా వివరాలను బయటపెట్టాలి.
డీటీఓ వెంకన్న మరణం… pic.twitter.com/Hx2ILl9sVj
— Harish Rao Thanneeru (@BRSHarish) June 22, 2026
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులోని జిల్లా రవాణా కార్యాలయం ఎదుట డీటీవో వెంకన్న తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈక్రమంలో అటుగా వచ్చిన ఓ లారీని ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ అలాగే వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాడు. దీంతో లారీ వెంకన్నపై నుంచి దూసుకెళ్లింది. తీవ్ర గాయపడిన ఆయనను తోటి సిబ్బంది స్థానిక దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మరణించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, డీటీవో వెంకన్న 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లి జిల్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతి..
భూపాలపల్లి జరిగిన రోడ్డు ప్రమాదంలో విధినిర్వహణ లో ఉన్న మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ (MVI) వెంకన్న మృతి
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భూపాలపల్లి రవాణా శాఖ కార్యాలయం వద్ద వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో టిప్పర్ ఢీకొనడంతో వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారన్నారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించామని తెలిపారు. వెంకన్న మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. విధినిర్వహణలో మృతి చెందిన వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు.
తాజావార్తలు
- ●సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- ●Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య
- ●Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి
- ●Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?
- ●NSG | ఉగ్రవాదంపై సమరానికి మహిళా కమాండోలు..!
- ●Graduates' MLC Elections | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరి.. రాకేశ్‌రెడ్డి వర్సెస్ గడల శ్రీనివాస్, పీవీ శ్రీనివాస్‌రావు!

సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ పైలట్ ప్రాజెక్ట్: బెల్లంపల్లి డిప్సైడ్లో సన్నాహాలు – కార్మికులు తెలుసుకోవాల్సిన వాస్తవాలు

Srishailam Suicides | శ్రీశైలం సత్రంలో తీవ్ర విషాదం.. కబోర్డు, బాత్రూం డోర్లకు ఉరేసుకొని ఐదుగురి ఆత్మహత్య

Fee Bakayi – BJP Ladayi | తక్షణం రూ.15వేలకోట్ల బకాయిలు విడుదల చేయాలి

Mahesh Babu | సందీప్ వంగా కాదు.. వారణాసి తర్వాత మహేష్‌బాబు నెక్స్ట్ మూవీ డైరెక్టర్ ఎవరంటే?






