Prakash Raj | నాలుగు రాష్ట్రాల్లో ఓటుహక్కు.. ప్రకాశ్‌రాజ్‌పై నాన్‌బెయిలబుల్ వారెంట్
Prakash Raj | సామాజిక అంశాలపై స్పందిస్తూ అతన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించే ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు (Voter ID Cards) కలిగి ఉన్నారంటూ దాఖలైన కేసులో ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్ (Non Bailable Warrant) జారీ అయింది.
Prakash Raj | త్రినేత్ర.న్యూస్: సామాజిక అంశాలపై స్పందిస్తూ అతన అభిప్రాయాలను నిక్కచ్చిగా వెల్లడించే ప్రకాశ్‌రాజ్ (Prakash Raj) న్యాయ వివాదంలో చిక్కుకున్నారు. నాలుగు రాష్ట్రాల్లో ఓటరు గుర్తింపు కార్డులు (Voter ID Cards) కలిగి ఉన్నారంటూ దాఖలైన కేసులో ఆయనకు నాన్‌బెయిలబుల్ వారెంట్ (Non Bailable Warrant) జారీ అయింది. బెంగళూరులోని 48వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ మేరకు ఉత్తర్వులను జారీ చేసింది.
ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం.. దేశంలోని ఏ పౌరుడైనా కేవలం ఒకే ఒక్క ఓటర్ ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఒకటి కంటే ఎక్కువ నియోజకవర్గాల్లో లేదా రాష్ట్రాల్లో ఓటు హక్కు కలిగి ఉండటం ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం నేరం. అయితే ప్రకాశ్‌రాజ్ కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఓటు హక్కు కలిగి ఉన్నారని, ఆయన పేరుపై వేర్వేరు ఓటర్ ఐడీలను కలిగి ఉన్నారంటూ దిలీప్ కుమార్ అనే న్యాయవాది బెంగళూరులో హలసూరు గేట్ పోలీస్‌స్టేషన్‌లో 2019లో ఫిర్యాదు చేశారు. అనంతరం బీబీఎంపీ అధికారులు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా స్పందించకపోవడంతో మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో పూర్తి ఆధారాలు సమర్పించడంతో విచారణకు స్వీకరించింది.
ఈ క్రమంలో గతంలో కోర్డు ఆయనకు రెండుసార్లు అధికారిక సమన్లు జారీచేసింది. అయినప్పటికీ విచారణకు హాజరుకాలేదు. దీంతో రెండుసార్లు నాన్-బెయిలబుల్ వారెంట్లు ఇచ్చింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా మూడోసారి నాన్-బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.
సంబంధిత వార్తలు

Prakash Raj | మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి.. నాగబాబు ట్వీట్‌కు ప్రకాశ్‌రాజ్ కౌంటర్
జూన్ 6, 2026

Bandla Ganesh | నీ ఊరేది.. నీ కథేంటి..? ప్రకాశ్ రాజ్‌పై బండ్ల గణేశ్ ఫైర్
జూన్ 4, 2026

Prakash Raj | “రండి దొరా.. రండి.. పొత్తుతో వస్తున్నారా..?” ప్రకాశ్ రాజ్ ఆసక్తికర కామెంట్స్.. పవన్‌ను ఉద్దేశించేనా..?
జూన్ 4, 2026
తాజావార్తలు
- ●Iran vs Belgium | బెల్జియాన్ని నిలువరించిన ఇరాన్..
- ●Uruguay Vs Cape Verde | ఉరుగ్వేకు షాక్.. నాకౌట్‌పై కన్నేసిన కేప్ వెర్డే
- ●Stock Markets | సెన్సెక్స్, నిఫ్టీ జోష్.. రిలయన్స్‌తో మార్కెట్లకు భారీ ఊరట..
- ●Arun Sai Reddy | అమెరికాలో మహబూబ్‌నగర్ విద్యార్థి మృతి..
- ●Egypt vs New Zealand | 92 ఏళ్ల నిరీక్షణకు తెర.. ప్రపంచకప్‌లో ఈజిప్ట్‌కు తొలి విజయం
- ●Mallikarjun Kharge | యూజ్లెస్ ఫెలోస్.. కాంగ్రెస్ కార్యకర్తలపై ఖర్గే ఆగ్రహం

Iran vs Belgium | బెల్జియాన్ని నిలువరించిన ఇరాన్..

Uruguay Vs Cape Verde | ఉరుగ్వేకు షాక్.. నాకౌట్‌పై కన్నేసిన కేప్ వెర్డే

Stock Markets | సెన్సెక్స్, నిఫ్టీ జోష్.. రిలయన్స్‌తో మార్కెట్లకు భారీ ఊరట..

Arun Sai Reddy | అమెరికాలో మహబూబ్‌నగర్ విద్యార్థి మృతి..



