Iran-US Peace Talks | “శాంతి”కి వేళాయె..
Iran-US Peace Talks | ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దానిని శాశ్వతంగా ముగించేందుకు పాకిస్థాన్ వేదికగా శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది.
International | Published On Apr 11, 2026, 4.36 pm IST
- చర్చల కోసం ఇస్లామాబాద్ చేరుకున్న అమెరికా-ఇరాన్ ప్రతినిధి బృందాలు
- 39 విమానాలను కోల్పోయిన అమెరికా
Iran-US Peace Talks | ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో పశ్చిమాసియాలో యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. దానిని శాశ్వతంగా ముగించేందుకు పాకిస్థాన్ వేదికగా శాంతి చర్చలకు రంగం సిద్ధమైంది. ఇరు దేశాలకు చెందిన ప్రతినిధుల బృందం ఇవాళ ఇస్లామాబాద్‌కు చేరుకుంది. తొలుత రెండు బృందాలతో పాక్ ప్రధాని విడివిడిగా చర్చలు జరపనున్నారు. ఈ దౌత్యం ఫలిస్తే మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగిసినట్లే. దీంతో ప్రపంచం మొత్తం ఈ చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
శాంతి చర్చల కోసం ఇరాన్ 71 మందితో భారీ ప్రతినిధుల బృందాన్ని పంపించింది. ఆ బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ నాయకత్వం వహిస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం ఇస్లామాబాద్ చేరుకుంది. ఉదయం 11:15 గంటల సమయంలో వాన్స్ బృందం ఫ్లైట్ దిగింది. పాక్‌కు బయల్దేరే ముందు వాన్స్ మాట్లాడుతూ.. శాంతి చర్చల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఈ చర్చలు సానుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
అమెరికాకు టెహ్రాన్ డిమాండ్లు..
చర్చల ప్రారంభానికి ముందే టెహ్రాన్ రెండు డిమాండ్లను అమెరికా ముందుంచింది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు తక్షణమే ఆగాలని, స్తంభింపజేసిన తమ ఆస్తులను వెంటనే విడుదల చేయాలని స్పష్టం చేసింది. ఈ డిమాండ్లకు అగ్రరాజ్యం అంగీకారం తెలిపినట్లు ఇరాన్ అధికారులు తెలిపారు. అయితే, అమెరికా మాత్రం ఇరాన్ అధికారుల ప్రకటనను ఖండించింది.
ట్రంప్ హెచ్చరికలు
శాంతి చర్చలు విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒప్పందం కుదరకపోతే శక్తిమంతమైన ఆయుధాలతో దాడి చేస్తామన్నారు.
యుద్ధంలో 39 యూఎస్ విమానాలు ధ్వంసం
ఇరాన్ చేపట్టిన ఆపరేషన్ ఎపిక్ ప్యూరీలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. దాదాపు 39 రోజులు కొనసాగిన ఈ యుద్ధంలో అగ్రరాజ్యానికి చెందిన 39 విమానాలను ఇరాన్ ధ్వంసం చేసినట్లు సమాచారం.
సీమైన్స్‌ను గుర్తించలేకపోతున్న ఇరాన్..
కాల్పుల విరమణకు అంగీకరించినా ఇంధన రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని తెరవడం ఇరాన్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. శత్రు దేశాలను అడ్డుకునేందుకు హడావుడిగా సీమైన్స్‌ను అమర్చిన ఇరాన్.. ఇప్పుడు వాటిని గుర్తించలేకపోతోందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక నివేదించింది.
మినాబ్ మృతుల కోసం విమానంలో ఒక్కోసీటు..
శాంతి చర్చలకు వెళ్లే ముందు ప్రపంచానికి ఇరాన్ ఓ కీలక సందేశం పంపింది. మినాబ్ పాఠశాలపై అమెరికా దాడిలో మరణించిన 160 మంది చిన్నారులకు ప్రత్యేకంగా నివాళులర్పించింది. పాక్‌కు వెళ్లే విమానంలో మినాబ్ మృతుల కోసం ఒక్కో సీటును కేటాయించింది. ప్రతీ సీటులోనూ చిన్నారుల ఫొటోలను ఉంచి, వారి బూట్లు, రక్తంతో తడిసిన బ్యాగులు ఉంచారు. వాటివద్ద తెల్లటి పుష్పాలు ఉంచి నివాళులర్పించారు.
Also Read..
ఢిల్లీలో ఇక పెట్రోల్ టూవీలర్లు, త్రీవీలర్లపై నిషేధం.. ఈవీలపై 100 శాతం పన్ను మినహాయింపు..
యూపీఐ పదేళ్ల ప్రస్థానం.. ప్రపంచ లావాదేవీల్లో 49 శాతం వాటాతో భారత్‌దే అగ్రస్థానం
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



