త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mega Job Mela | హైద‌రాబాద్‌లో ఏప్రిల్ 16న మెగా జాబ్ మేళా

Mega Job Mela | నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఏప్రిల్ 16వ తేదీన మెగా జాబ్ మేళాకు హైద‌రాబాద్ న‌గ‌రం వేదిక కానుంది. ఈ మెగా జాబ్ మేళాను మెహిదీప‌ట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్ల‌ర్ నంబ‌ర్ 67 వ‌ద్ద ఉన్న కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వ‌హించ‌నున్నారు.

S

Hyderabad | Published On Apr 11, 2026, 4.31 pm IST

Mega Job Mela | హైద‌రాబాద్‌లో ఏప్రిల్ 16న మెగా జాబ్ మేళా
Advertisement

Mega Job Mela | త్రినేత్ర‌.న్యూస్ : నిరుద్యోగుల‌కు శుభ‌వార్త‌. ఏప్రిల్ 16వ తేదీన మెగా జాబ్ మేళాకు హైద‌రాబాద్ న‌గ‌రం వేదిక కానుంది. ఈ మెగా జాబ్ మేళాను మెహిదీప‌ట్నంలోని పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే పిల్ల‌ర్ నంబ‌ర్ 67 వ‌ద్ద ఉన్న కింగ్స్ ప్యాలెస్‌లో నిర్వ‌హించ‌నున్నారు. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.30 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

ఈ సంద‌ర్భంగా మెగా జాబ్ మేళా నిర్వాహ‌కులు మ‌న్నాన్ ఖాన్ మాట్లాడుతూ.. ఫార్మా, హెల్త్ కేర్, ఐటీ, ఐటీఈఎస్, ఎడ్యుకేష‌న్, బ్యాంకింగ్‌తో పాటు ప‌లు రంగాల‌కు చెందిన కంపెనీలు.. అర్హులైన అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకుంటార‌ని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం ఆఫ‌ర్ కూడా ఇస్తున్నాయ‌న్నారు.

మెగా జాబ్ మేళాకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు త‌ప్ప‌నిస‌రిగా ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త సాధించి ఉండాలి. వారికే ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించి ఎంపిక చేయ‌నున్నారు. ఇక జాబ్ మేళాకు ఎలాంటి రుసుం లేకుండానే హాజరు కావొచ్చు. త‌దిత‌ర వివ‌రాల కోసం 8374315052 నంబ‌ర్‌ను సంప్ర‌దించొచ్చు.

Advertisement
Advertisement