త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI | యూపీఐ ప‌దేళ్ల ప్ర‌స్థానం.. ప్రపంచ లావాదేవీల్లో 49 శాతం వాటాతో భార‌త్‌దే అగ్ర‌స్థానం

UPI | భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రుగుతున్న రియ‌ల్ టైమ్ డిజిట‌ల్ చెల్లింపుల లావాదేవీల్లో 49 శాతం వాటాతో భార‌త్ అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం తెలిపింది.

D

Business | Published On Apr 11, 2026, 4.00 pm IST

UPI | యూపీఐ ప‌దేళ్ల ప్ర‌స్థానం.. ప్రపంచ లావాదేవీల్లో 49 శాతం వాటాతో భార‌త్‌దే అగ్ర‌స్థానం
Advertisement

UPI | భారత డిజిటల్ చెల్లింపుల (Digital Payments) వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఇవాళ్టితో పదేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌రుగుతున్న రియ‌ల్ టైమ్ డిజిట‌ల్ చెల్లింపుల లావాదేవీల్లో 49 శాతం వాటాతో భార‌త్ అగ్ర‌స్థానంలో నిలిచింద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌భుత్వం తెలిపింది. ఆర్థిక స‌మ్మిళితం (financial inclusion) కోసం ఒక సాధనంగా ప్రారంభమై.. ప్రస్తుతం రియల్ టైమ్ చెల్లింపుల్లో ప్రపంచ స్థాయిలో అగ్ర‌గామిగా ఎదిగిన యూపీఐని (UPI) ప్రభుత్వం ఒక "స్వదేశీ వ్యవస్థ"గా అభివర్ణించింది. "క్యూ లైన్ల నుంచి క్యూఆర్ కోడ్‌ల వరకూ సాగిన భారతదేశ ప్రయాణం.. సమగ్ర ఆవిష్కరణ శక్తిని ప్రతిబింబిస్తుంది" అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ప్ర‌భుత్వం వెల్ల‌డించిన గ‌ణాంకాల ప్ర‌కారం.. కేవ‌లం 2026 జ‌న‌వ‌రి నెల‌లోనే యూపీఐ ద్వారా 21.70 బిలియన్ల లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.28.33 ల‌క్ష‌ల కోట్లు. భార‌త్‌లోని మొత్తం రిటైల్ డిజిట‌ల్ లావాదేవీల్లో ప్ర‌స్తుతం యూపీఐ వాటా 81 శాతంగా ఉంది. కేవ‌లం ద‌శాబ్ద కాలంలోనే ఇంత‌టి స్థాయిలో విస్త‌రించిన యూపీఐని అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ సైతం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్-టైమ్ చెల్లింపుల వ్యవస్థగా అభివర్ణించింది. ప్రారంభమైన నాటి నుంచి యూపీఐ లావాదేవీల పరిమాణంలో 12,000 రెట్లు, విలువలో 4,000 రెట్లకు పైగా వృద్ధిని నమోదు చేసింది. కేవలం లావాదేవీల సంఖ్యకే పరిమితం కాకుండా యూపీఐ సామాన్యుడి జీవితంలో కూడా భాగమైంది.

రూ.230 ల‌క్ష‌ల కోట్లు..

కాగా, దేశంలో డిజిటిల్ చెల్లింపులు (UPI transactions) చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఫ‌లితంగా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీలు స‌రికొత్త రికార్డుల‌ను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవ‌త్స‌రం డిసెంబ‌ర్ వ‌ర‌కూ యూపీఐ ద్వారా జ‌రిగిన లావాదేవీలు రికార్డు స్థాయిలో రూ.230 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరిన‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే ప్ర‌క‌టించింది. 2022-23లో జ‌రిగిన మొత్తం రూ.139 ల‌క్ష‌ల కోట్ల లావాదేవీల‌తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ.

ఎనిమిది దేశాల్లో..

భార‌త్ వెలుప‌లా యూపీఐ వినియోగం పెరుగుతోంది. ప్ర‌స్తుతం ఎనిమిది దేశాల్లో యూపీఐ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. భూటాన్‌, ఫ్రాన్స్, మారిష‌స్‌, నేపాల్‌, ఖ‌తార్‌, సింగ‌పూర్‌, శ్రీ‌లంక‌, యూఏఈల్లో యూపీఐ సేవ‌లు అందుబాటులో ఉన్నాయి. యూపీఐని అంత‌ర్జాతీయంగా విస్త‌రించేందుకు ప్ర‌భుత్వం, రిజ‌ర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ప్ర‌త్యేక చ‌ర్య‌లు తీసుకుంటోంది.

Also Read..

మాజీ భార్యకు 550 కోట్ల ఆస్తి గిఫ్ట్‌గా ఇచ్చిన హాలీవుడ్ హీరో

SECL లో ఉద్యోగాల జాత‌ర‌.. 1055 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్.. అర్హ‌త‌లు ఇవే..!

చొర‌బాటుదారులు త‌మ ల‌గేజ్‌ని స‌ర్దుకోవాలి.. బెంగాల్ ఎన్నిక‌ల ర్యాలీలో ప్ర‌ధాని మోదీ

Advertisement
Advertisement