Android Auto | ఎలక్ట్రిక్ కార్ల కోసం గూగుల్ మ్యాప్స్‌లో ప్రత్యేక ఫీచర్లు.. ఇక చార్జింగ్ అయిపోతుందన్న బెంగ ఉండదు..
Android Auto | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం AI ఆధారిత కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. Android Auto ద్వారా ఈ ఫీచర్లు పనిచేస్తాయి. ప్రయాణ ప్రణాళిక, చార్జింగ్ గైడ్ లైన్స్ ను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ ఫీచర్లను ప్రవేశపెట్టింది.
Technology | Published On Apr 1, 2026, 10.22 am IST
Android Auto | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (EV) కోసం AI ఆధారిత కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. Android Auto ద్వారా ఈ ఫీచర్లు పనిచేస్తాయి. ప్రయాణ ప్రణాళిక, చార్జింగ్ గైడ్ లైన్స్ ను మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా ఈ ఫీచర్లను ప్రవేశపెట్టింది. బ్యాటరీ లెవల్స్, చార్జింగ్ స్టాప్ సూచనలు, ETA వివరాలు వంటి సౌకర్యాలను ఈ అప్‌డేట్ లో అందిస్తోంది. ప్రస్తుతం ఈ సేవలు అమెరికాలో 350కిపైగా EV మోడళ్లకు అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా వాహనదారులకు ఉండే రేంజ్ ఆంగ్జైటీని తగ్గించడమే ఈ ఫీచర్ల ప్రధాన ఉద్దేశమని గూగుల్ తెలిపింది.
ఎంత బ్యాటరీ ఉంటుందో అంచనా వేస్తుంది..
గూగుల్ మ్యాప్స్‌లోని AI మోడళ్ల ద్వారా EV బ్యాటరీ వినియోగాన్ని ముందుగానే అంచనా వేయగలుగుతుంది. ఇందులో వాహనానికి సంబంధించిన అంశాలు, బ్యాటరీ సామర్థ్యం, బరువు, అలాగే ట్రాఫిక్ పరిస్థితులు, రహదారి ఎత్తుపల్లాలు, వాతావరణ పరిస్థితులు వంటి రియల్ టైమ్ డేటాను పరిగణనలోకి తీసుకుంటుంది. దీంతో ప్రయాణంలో వివిధ దశల్లో బ్యాటరీ ఎంత మిగిలి ఉంటుందో కచ్చితంగా అంచనా వేయడం సాధ్యమవుతుంది. గూగుల్ మ్యాప్స్‌లో EV వివరాలు నమోదు చేసిన తర్వాత వినియోగదారులు తమ వాహన ప్రస్తుత బ్యాటరీ స్థాయి, గమ్యస్థానాన్ని ఎంటర్ చేస్తే సిస్టమ్ సహాయం చేస్తుంది. ముందుగా మార్గమధ్యంలో అవసరమైన చార్జింగ్ స్టాప్‌లను సూచిస్తుంది. గమ్యస్థానానికి చేరుకునే సమయానికి మిగిలే బ్యాటరీ స్థాయిని అంచనా వేస్తుంది. చార్జింగ్ సమయాన్ని పరిగణనలోకి తీసుకుని ETAను అప్డేట్ చేస్తుంది. ప్రత్యేక యాప్‌ల అవసరాన్ని తగ్గిస్తుంది. ప్రయాణ పరిస్థితులు మారిన కొద్దీ ఈ సూచనలు ఆటోమేటిగ్గా మారుతాయి.
Android Auto లో పొందవచ్చు..
ఈ ఫీచర్లను Android Autoలో ఇంటిగ్రేట్ చేసి అందిస్తున్నారు. దీంతో డ్రైవర్లు వాహనంలోని స్క్రీన్ నుంచే EV-సంబంధిత నావిగేషన్‌ను నేరుగా ఉపయోగించవచ్చు. Google Mapsలో తమ EV ప్రొఫైల్ ను క్రియేట్ చేయడం ద్వారా వాహన డిస్‌ప్లే నుంచే నావిగేషన్ ను ఉపయోగించుకోవచ్చు. ఎంచుకున్న మార్గానికి సంబంధించిన బ్యాటరీ వినియోగ అంచనాలను అది చూపిస్తుంది. అలాగే రియల్ టైమ్ చార్జింగ్ స్టాప్ సూచనలు ఇస్తుంది. ఈ AI ఆధారిత బ్యాటరీ అంచనా వ్యవస్థ ప్రస్తుతం అమెరికాలో 15కిపైగా బ్రాండ్లకు చెందిన వందలాది EV మోడళ్లకు అందుబాటులో ఉంది. వాహనాల ప్రత్యేక డేటాను రియల్ టైమ్ నావిగేషన్ సమాచారంతో కలిపి గూగుల్ కచ్చితమైన అంచనాలను అందిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని వాహనాలు, దేశాలకు ఈ ఫీచర్లను విస్తరిస్తామని గూగుల్ ప్రకటించింది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Nagarjuna | అక్కినేని హీరోల మల్టీస్టారర్‌కు బ్రేక్ - బంగార్రాజు 2 ఆగిపోయిందా? ఆపేశారా?
- ●RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..
- ●Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!
- ●Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి
- ●MLC Venkatarami Reddy | మా అబ్బాయి డ్రగ్స్ తీసుకోలే.. ఆ వార్తలు నిరాధారం.. అరెస్ట్ కూడా కాలేదు..
- ●Hydrogen Train | దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలు.. విశేషాలు ఇవే..

Nagarjuna | అక్కినేని హీరోల మల్టీస్టారర్‌కు బ్రేక్ - బంగార్రాజు 2 ఆగిపోయిందా? ఆపేశారా?

RBI | బ్యాంకులకు ఆర్బీఐ కొత్త డేటా రూల్స్.. డేటా గవర్నెన్స్ కమిటీ తప్పనిసరి..

Boats Capsized | మయన్మార్ తీరంలో 500 మంది జలసమాధి..!

Ramdas Athawale | ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులు కచ్చితంగా ఆమోదం పొందుతాయి : కేంద్ర మంత్రి






