Jagadeesh Reddy | తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?
Jagadeesh Reddy | తెలంగాణ జలహక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడుతోందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నాగార్జునసాగర్‌లో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పనులను వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పనులను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు.
- నాగార్జునసాగర్‌లో ఏపీ పనులను వెంటనే అడ్డుకోవాలి
- 128 టీఎంసీల వినియోగంపై ప్రాజెక్టుల వారీగా లెక్కలు చెప్పాలి
- రైతులకు నీళ్లివ్వకుండా ఆరుతడి పంటలు వేయాలంటే ఎలా?
- కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి తీవ్ర విమర్శలు
Jagadeesh Reddy | తెలంగాణ జలహక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం నేరపూరిత నిర్లక్ష్యానికి పాల్పడుతోందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. నాగార్జునసాగర్‌లో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పనులను వెంటనే అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. ఆ పనులను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను కాపాడే బాధ్యతను విస్మరిస్తోందని ఆరోపించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి లేఖలు రాశామని చెబుతున్నారని, అయితే వాటి వివరాలను బయటపెట్టాలని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గారు లేఖలు రాశామని చెబుతున్నారు. ఏ రోజు రాశారు? ఆ లేఖల డీఓ నంబర్లు ఏమిటి? లేఖలను బయటపెట్టండి. గాలి మాటలు కాదు, స్పష్టమైన ఆధారాలు చూపించండి’’ అని సవాల్ విసిరారు. కొత్త పథకాల విషయంలో పొరుగు రాష్ట్రానికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు.
చెన్నై తాగునీటి అవసరాల పేరుతో శ్రీశైలం నుంచి నీటి తరలింపు మొదలైందని, ఆ తర్వాత అది భారీ స్థాయికి చేరిందని ఆరోపించారు. ‘‘వేలు పెట్టనిస్తే కాలు పెట్టినట్టుగా సాగర్‌లోనూ అదే పరిస్థితి రాకూడదు’’ అని హెచ్చరించారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఆంధ్రప్రదేశ్ తనవైపు కొత్త పనులు చేపడుతోందని చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు. తెలంగాణ ఎంత నీటిని వినియోగించుకుందనే విషయంలో ప్రాజెక్టుల వారీగా పూర్తి వివరాలు వెల్లడించాలని జగదీశ్‌రెడ్డి కోరారు. ‘‘ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు తీసుకున్నారు? నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద, లో లెవల్, హై లెవల్ కాలువల కింద ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారు? మహబూబ్‌నగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ఎంత నీరు అందించారు? సంవత్సరాల వారీగా లెక్క చెప్పండి’’ అని నిలదీశారు. ‘‘128 టీఎంసీలు వాడాం’’ అని చెప్పడం మాత్రమే సరిపోదని, ఆ నీటిని ఏయే ప్రాజెక్టుల ద్వారా ఎంత వినియోగించారో స్పష్టంగా వివరించాలని డిమాండ్ చేశారు.
రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోందని, అయితే వాటికి అవసరమైన నీటిని ఎక్కడి నుంచి అందిస్తారో చెప్పాలని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘నీటి తడి లేకుండా ఏ గింజా మొలకెత్తదు. కూరగాయలు పండించుకోమంటున్నారు. అవి మొలవాలన్నా నీళ్లు కావాలి కదా! ఏ పంటకు ఎన్ని నీళ్లు ఇస్తారో చెప్పండి’’ అని నిలదీశారు. డీ-25, డీ-37, డీ-39, డీ-40 పరిధిలోని రైతులు కనీసం చెరువులకైనా నీళ్లు ఇవ్వాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు. ప్రజల నీటి హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం మౌనంగా ఉండటానికి వీల్లేదని జగదీశ్‌రెడ్డి అన్నారు. నాగార్జునసాగర్‌లో ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న పనులను తక్షణమే నిలిపివేయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలకు కావాల్సిన జలాలను రక్షించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●HYDRAA | సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ.. 4 ఎకరాల మేర ఆక్రమణలు తొలగింపు
- ●Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా ... నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది - చంద్రబోస్ కామెంట్స్
- ●Maternity Leave For Third Child | మూడో బిడ్డకూ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే!
- ●Lok Adalat | 3 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..
- ●ACB Rides | లంచం తీసుకురా.. లేదంటే లక్ష జరిమానా పడ్తది.. విద్యుత్ సబ్ ఇంజినీర్ ఏసీబీకి ఎలా చిక్కాడంటే!
- ●Shooting in Canada | కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

HYDRAA | సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ.. 4 ఎకరాల మేర ఆక్రమణలు తొలగింపు

Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా ... నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది - చంద్రబోస్ కామెంట్స్

Maternity Leave For Third Child | మూడో బిడ్డకూ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే!

Lok Adalat | 3 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..



