Keethy Suresh | అందుకే సినిమా ప్రమోషన్స్‌లో కనిపించడు – భర్తపై కీర్తి సురేష్ కామెంట్స్
రెండేళ్ల క్రితం ప్రియుడు ఆంటోనీ థాటిల్‌లో ఏడడుగులు వేసింది కీర్తి సురేష్. పెళ్లికి ముందు పదిహేనేళ్ల పాటు వీరిద్దరు ప్రేమలో ఉన్నారు. తమ సీక్రెట్ లవ్‌స్టోరీని ఎక్కడ బయటపడకుండా జాగ్రత్తపడ్డారు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌లో ఆంటోనీ థాటిల్ ఒక్కసారి కూడా కనిపించడం ఆసక్తికరంగా మారింది.అందుకు గల కారణాలను కీర్తి సురేష్ వెల్లడించింది.
Naresh N
Entertainment | Published On Nov 21, 2026, 7.44 pm IST

కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించిన సత్యవాన్ సావిత్రి శుక్రవారం తెలుగు, తమిళ భాషల్లో రిలీజైంది. కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ లాయర్‌గా నటించింది.

సత్యవాన్ సావిత్రి ప్రమోషన్స్‌లో తన భర్త గురించి కీర్తి సురేష్ ఆసక్తికర కామెంట్లు చేసింది. పెళ్లికి ముందు తనపై వచ్చిన డేటింగ్ రూమర్లపై కూడా రియాక్ట్ అయ్యింది.

భర్త ఆంటోనీ థాటిల్‌కు సినిమా ప్రమోషన్స్ అంటే ఇష్టం ఉండవని చెప్పింది. అందుకే తన సినిమాల వేడుకల్లో కూడా కనిపించడని అన్నది.

తోడుగా తీసుకొచ్చి ఇబ్బంది పెట్టడం ఎందుకని తాను కూడా భర్తను ప్రీమియర్స్, ప్రమోషన్లకు రమ్మని ఎప్పుడూ అడగనని కీర్తి సురేష్ చెప్పింది.

కెరీర్ ఆరంభంలో తోటి నటులతో సంబంధాలు ఉన్నాయంటూ తన గురించి చాలా రూమర్లు వచ్చాయని అన్నది. అవన్నీ చాలా బాధను కలిగించాయని కీర్తి సురేష్ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇప్పటివరకు తాను ఒక్కరితోనే ప్రేమలో పడ్డానని, అది తన భర్త ఆంటోనీ థాటిల్‌తోనే అని మహానటి పేర్కొన్నది.

డేటింగ్ రూమర్ల గురించి ఆంటోనీ థాటిల్ తనను ఎప్పుడూ ఒక్క ప్రశ్న కూడా అడగలేదని కీర్తి సురేష్ అన్నది.

ప్రస్తుతం తెలుగులో రౌడీ జనార్ధనతో పాటు జనవరి 12 విడుదల సినిమాలు చేస్తోంది.

హిందీలో రాఫ్తార్‌లో హీరోయిన్‌గా నటిస్తోంది కీర్తి సురేష్.


తాజావార్తలు
- ●Kavya and Anirudh's wedding reception | కావ్య.. అనిరుధ్ ల రిసెప్షన్ కు సీఎం రేవంత్, కవిత
- ●Telangana Congress | అసమ్మతి జ్వాలలు ఆగేనా?
- ●Bandi Sanjay | బీజేపీ గెలిస్తే కుల సంఘాలకు శాశ్వత భవనాలు
- ●Harish Rao Paddy Procurement Telangana | తుఫాన్ ముప్పు పొంచి ఉన్నా వడ్లు కొనరా?
- ●TSPJA | ఒక్క ఫోటో.. వెయ్యి భావాలు.. తరతరాలకు నిలిచే చరిత్ర!
- ●Ponguleti Srinivas Reddy | మా ఆట బాగుంది.. వచ్చే ఎన్నికల్లో మళ్లా గోల్ మాదే

Kavya and Anirudh's wedding reception | కావ్య.. అనిరుధ్ ల రిసెప్షన్ కు సీఎం రేవంత్, కవిత

Telangana Congress | అసమ్మతి జ్వాలలు ఆగేనా?

Bandi Sanjay | బీజేపీ గెలిస్తే కుల సంఘాలకు శాశ్వత భవనాలు

Harish Rao Paddy Procurement Telangana | తుఫాన్ ముప్పు పొంచి ఉన్నా వడ్లు కొనరా?


