త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TSPJA | ఒక్క ఫోటో.. వెయ్యి భావాలు.. తరతరాలకు నిలిచే చరిత్ర!

TSPJA | హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫోటో జర్నలిస్ట్స్ అవార్డ్స్ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

S

Telangana | Published On Nov 21, 2026, 7.17 pm IST

TSPJA | ఒక్క ఫోటో.. వెయ్యి భావాలు.. తరతరాలకు నిలిచే చరిత్ర!
Advertisement

TSPJA | త్రినేత్ర న్యూస్ : హైదరాబాద్ బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫోటో జర్నలిస్ట్స్ అవార్డ్స్ కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీక‌ర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఒక వార్తను వందల పదాలతో వివరించవచ్చని, కానీ ఒక్క ఫోటో క్షణాల్లోనే వేల భావాలను ప్రజల హృదయాలకు చేరవేస్తుందని అన్నారు. చరిత్రలోని ఎన్నో కీలక ఘట్టాలను భవిష్యత్ తరాలకు అందించే గొప్ప బాధ్యత ఫోటో జర్నలిస్టులదని కొనియాడారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఫోటో జర్నలిస్టులు నూతన నైపుణ్యాలను అలవర్చుకోవాలని, వారి సంక్షేమం, హక్కుల పరిరక్షణకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

అనంతరం రాష్ట్ర స్థాయి ఉత్తమ ఫోటోగ్రఫీ పోటీల్లో విజేతలుగా నిలిచిన ఫోటో జర్నలిస్టులకు అవార్డులు, నగదు బహుమతులు అందించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు, ఫోటో జర్నలిస్టులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement