Benjamin Netanyahu | నెతన్యాహు కార్యాలయంపై క్షిపణి దాడి : ఇరాన్ కీలక ప్రకటన
Benjamin Netanyahu | ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)ను ఇరాన్ (Iran) టార్గెట్ చేసింది. టెల్ అవీవ్ (Tel Aviv)లోని నెతన్యాహు కార్యాలయం, ఐడీఎఫ్‌కు చెందిన వైమానిక దళ కమాండర్ ప్రధాన కార్యాలయం (Netanyahu Office Targeted)పై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ( Islamic Revolutionary Guards Corps) క్షిపణి దాడులు చేసింది.
International | Published On Mar 2, 2026, 4.25 pm IST
Benjamin Netanyahu | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. తమ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. గల్ఫ్ దేశాలపై విరుచుకుపడుతోంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు (Benjamin Netanyahu)ను ఇరాన్ (Iran) టార్గెట్ చేసింది.
టెల్ అవీవ్ (Tel Aviv)లోని నెతన్యాహు కార్యాలయం, ఐడీఎఫ్‌కు చెందిన వైమానిక దళ కమాండర్ ప్రధాన కార్యాలయం (Netanyahu Office Targeted)పై ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ( Islamic Revolutionary Guards Corps) క్షిపణి దాడులు చేసింది. తాము ప్రయోగించిన ఖైబర్ క్షిపణులు (Kheibar missiles) ఆ రెండు ప్రాంతాలను కచ్చితత్వంతో తాకినట్లు ఐఆర్‌జీసీ (IRGC)ఓ ప్రకటనలో తెలిపింది. ఇది అనూహ్యంగా చేపట్టిన దాడిగా పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధాని నెతన్యాహును జియోనిస్ట్ పాలన యొక్క నేరస్థుడిగా అభివర్ణించింది. తమ దాడుల్లో ఆ ప్రాంతాల్లో తీవ్ర నష్టం వాటిల్లినట్లు తెలిపింది. అయితే, ఆ సమయంలో కార్యాలయంలో నెతన్యాహు ఉన్నారా..? లేదా..? అన్నది తెలియరాలేదు. తమ దాడిలో అక్కడ తీవ్ర నష్టం వాటిల్లిందని ఐఆర్‌జీసీ తన ప్రకటనలో వెల్లడించింది. అయితే దీనిపై ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇప్పటివరకూ స్పందించలేదు.
Also Read..
ఉపాధి కోసం వచ్చాం.. బంకర్ల కోసం వెతుక్కోవాల్సి వస్తోంది : గల్ఫ్ దేశాల్లో భారతీయుల ఆవేదన
పశ్చిమాసియాలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి : ప్రధాని మోదీ
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Iran Shuts Hormuz Again | హర్మూజ్ మళ్లీ క్లోజ్.. ఇరాన్ సంచలన నిర్ణయం
ఏప్రిల్ 18, 2026

Donald Trump | చైనా ప్రెసిడెంట్ నన్ను చూడగానే పరుగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంటాడు : ట్రంప్
ఏప్రిల్ 15, 2026

West Asia War | పశ్చిమాసియా యుద్ధం వల్ల భారత్‌లో భారీగా పెరగనున్న పేదరికం.. యూఎన్డీపీ అంచనా..
ఏప్రిల్ 14, 2026
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



