Mojtaba Khamenei | స్పృహలో లేని మొజ్తాబా ఖమేనీ..? కండిషన్ సీరియస్.. ఖోమ్‌లో చికిత్స
Mojtaba Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) స్పృహలో లేరట (Mojtaba Khamenei is Unconscious). ఆయనకు ఇరాన్‌లోని ఖోమ్ (Qom) నగరంలో చికిత్స జరుగుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది.
International | Published On Apr 7, 2026, 11.05 am IST
Mojtaba Khamenei | ఇరాన్ సుప్రీం లీడర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్యంపై గత కొన్నిరోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరి 28 ఇజ్రాయెల్, అమెరికా దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన కోమాలో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే, ఆయన ఆరోగ్యంపై వస్తున్న వార్తలను ఇరాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సుప్రీం లీడర్ ఆరోగ్యం గురించి మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం స్పృహలో లేరట (Mojtaba Khamenei is Unconscious).
ప్రస్తుతం ఆయనకు ఇరాన్‌లోని ఖోమ్ (Qom) నగరంలో చికిత్స జరుగుతున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలను ఉటంకిస్తూ 'ది టైమ్స్' పత్రిక వెల్లడించింది. "మొజ్తబా ఖమేనీ అపస్మారక స్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఇరాన్ పవిత్ర నగరమైన ఖోమ్‌లో తీవ్రమైన పరిస్థితిలో చికిత్స పొందుతున్నారు. పాలన పరమైన ఎటువంటి నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఆయన లేరు. ప్రభుత్వ నిర్ణయాల్లో ఆయన పాలుపంచుకోవడం లేదు" అని సదరు పత్రిక తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్ గూఢచారి సంస్థలు (US - Israeli spy agencies) సేకరించిన ఈ సమాచారాన్ని గల్ఫ్ దేశాలతో పంచుకున్నట్లు తెలుస్తోంది. మొజ్తాబా ఖమేనీ ఎక్కడున్నారన్న విషయం కొంతకాలం కిందటే వారికి తెలిసినప్పటికీ దాన్ని బహిర్గతం చేయలేదని సదరు పత్రిక నివేదించింది.
ఫిబ్రవరి 28వ తేదీన జరిగిన దాడిలో అయతుల్లా అలీ ఖమేనీ సహా పలువురు కుటుంబ సభ్యులు హతమైన విషయం తెలిసిందే. ఆ దాడిలోనే మొజ్తాబా కూడా గాయపడ్డారు. అప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించలేదు. సుప్రీం లీడర్‌గా ఎన్నుకున్నా కూడా ఆయన ప్రజల ముందుకు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అదే సమయంలో శత్రు దేశాల దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారని, కాలు కూడా కోల్పోయినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి. టెహ్రాన్‌లో చికిత్స పొందుతున్నట్లు కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన ఉన్న లొకేషన్ కచ్చితంగా బహిర్గతం కాలేదు. ఈ క్రమంలోనే ఆయన ఖోమ్ నగరంలో ఉన్నట్లు మొదటిసారి సంకేతాలు అందాయి. టెహ్రాన్‌కు దక్షిణంగా 87 మైళ్ల (సుమారు 140 కిలోమీటర్లు) దూరంలో ఉన్న ఖోమ్ నగరం షియా ఇస్లాంలో అత్యంత పవిత్రమైనదిగా, ఇరాన్ మతపరమైన రాజధానిగా పరిగణిస్తారు. ఖమేనీ తండ్రి, మునుపటి సుప్రీంనేత అలీ ఖమేనీ అంతిమ సంస్కారాలను కూడా ఖోమ్ సిటీలో నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.
Also Read..
వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై కాల్స్ మరింత స్పష్టంగా వినిపిస్తాయి..
ఎయిర్ ఇండియాలో కుదుపు.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా!
ఓటీటీలోకి లేటెస్ట్ హారర్ కామెడీ మూవీ రాకాస - స్ట్రీమింగ్ ఎందులో...ఎప్పుడంటే?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






