Whatsapp | వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై కాల్స్ మరింత స్పష్టంగా వినిపిస్తాయి..
Whatsapp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇటీవలే త్వరలో అందులో రానున్న కొత్త ఫీచర్లపై ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వాటిల్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఒకటి. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.
Technology | Published On Apr 7, 2026, 10.38 am IST
Whatsapp | ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ ఇటీవలే త్వరలో అందులో రానున్న కొత్త ఫీచర్లపై ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. వాటిల్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ కూడా ఒకటి. అయితే ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. అందువల్ల త్వరలోనే పూర్తి స్థాయిలో సాధారణ యూజర్లందరికీ ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తారని భావిస్తున్నారు. నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వల్ల యూజర్లు వాట్సాప్‌లో వాయిస్ లేదా వీడియో కాల్స్ చేసే సమయంలో బ్యాక్ గ్రౌండ్‌లో వచ్చే అనవసర శబ్దాలను చాలా వరకు తగ్గించవచ్చు. ఫోన్‌లో డిఫాల్ట్‌గా నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది కానీ అది సాధారణ కాల్స్‌కు మాత్రమే పనిచేస్తుంది. అందువల్ల వాట్సాప్ ఈ ఫీచర్‌ను తన ప్లాట్‌ఫామ్‌లో ప్రవేశపెట్టనుంది.
రియల్‌టైమ్ లో పనిచేస్తుంది..
నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వల్ల వాట్సాప్‌లో కాల్స్ చేసుకునే సమయంలో అనవసర శబ్దాలు తగ్గి కాల్ స్పష్టత పెరుగుతుంది. కాల్స్ క్వాలిటీగా ఉంటాయి. స్పీకర్ వాయిస్‌ను ఇది ప్రభావితం చేయదు. రియల్‌టైమ్‌లో పనిచేస్తుంది. ఈ ఫీచర్ వల్ల ఎల్లప్పుడూ ప్రయాణాలు చేసేవారు, బయటనే ఎక్కువగా గడిపే వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది. వాట్సాప్ ఫీచర్లను ట్రాక్ చేసే WABetaInfo ఈ వివరాలను వెల్లడించింది. వాయిస్, వీడియో కాల్స్ కోసం నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్‌ను ప్రస్తుతం బీటా యూజర్లకు ఆ సంస్థ దశలవారీగా అందిస్తోంది. ప్రస్తుతం వాట్సాప్‌కు చెందిన ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.26.14.1 ను ఉపయోగిస్తున్న యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ సహాయంతో గాలి, ట్రాఫిక్ వంటి శబ్దాలను రియల్‌టైమ్‌లో ఫిల్టర్ చేయవచ్చు. దీంతో కాల్స్ మరింత స్పష్టంగా వినిపిస్తాయి.
డిఫాల్ట్‌గా ఆన్ లోనే..
నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ వాయిస్ లేదా వీడియో కాల్స్ చేసే సమయంలో ఆప్షన్ కాలింగ్ మెనూలో కనిపిస్తుంది. ఈ మేరకు WABetaInfo ఒక స్క్రీన్ షాట్‌ను కూడా షేర్ చేసింది. అందులో ఇచ్చిన ప్రకారం అయితే ఈ ఫీచర్ వాట్సాప్‌లో డిఫాల్ట్‌గా ఆన్ లోనే ఉంటుంది. అందువల్ల యూజర్లు దీన్ని ప్రత్యేకంగా ఆన్ చేయాల్సిన పనిలేదు. కాల్ ను ప్రారంభించిన వెంటనే ఈ ఫీచర్ పనిచేయడం మొదలుపెడుతుంది. అయితే అవతలి వ్యక్తికి వాయిస్ స్పష్టంగా వినిపించకపోయినా, మరేదైనా సాంకేతిక సమస్య ఏర్పడినా ఈ ఫీచర్‌ను ఆఫ్ చేసుకునే విధంగా కూడా వెసులు బాటు కల్పించారు. కాల్‌లో పాల్గొనే ఇద్దరిలో ఒకరు మాత్రమే ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే వారి వాయిస్ మాత్రమే అవతలి వ్యక్తికి స్పష్టంగా వినిపిస్తుంది. అదే ఇద్దరూ ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే ఇద్దరికీ కాల్స్ స్పష్టంగా వినిపిస్తాయి. అతిత్వరలోనే ఈ ఫీచర్‌ను యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు వాట్సాప్ యత్నిస్తోంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






