త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Raakaasa OTT | ఓటీటీలోకి లేటెస్ట్ హార‌ర్ కామెడీ మూవీ రాకాస – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?

మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మించిన హార‌ర్ కామెడీ మూవీ రాక‌స ఫ‌స్ట్ వీకెండ్‌లోనే ప‌దిహేను కోట్ల క‌లెక్ష‌న్స్‌తో అద‌ర‌గొట్టింది. సంగీత్ శోభ‌న్ హీరోగా న‌టించిన ఈ హార‌ర్ కామెడీ మూవీ ఓటీటీ హ‌క్కుల‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. రాక‌స‌ ఎప్పుడు ఓటీటీలోకి రానుందంటే?

N

Entertainment | Published On Apr 7, 2026, 7.45 am IST

Raakaasa OTT | ఓటీటీలోకి లేటెస్ట్ హార‌ర్ కామెడీ మూవీ రాకాస – స్ట్రీమింగ్ ఎందులో…ఎప్పుడంటే?
Advertisement

Raakaasa OTT |  మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల నిర్మించిన లేటెస్ట్ హార‌ర్ కామెడీ మూవీ రాకాస బాక్సాఫీస్ వ‌ద్ద అద‌ర‌గొడుతోంది. సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక జంట‌గా న‌టించిన ఈ మూవీ ఫ‌స్ట్ వీకెండ్‌లోనే 15 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. రాకాస సినిమాతో మాన‌స శ‌ర్మ డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గెట‌ప్ శీను, వెన్నెల‌కిషోర్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

కామెడీ విత్ హార‌ర్‌...

హార‌ర్ ఫాంట‌సీ క‌థ‌కు కామెడీని జోడించి ద‌ర్శ‌కురాలు మాన‌స శ‌ర్మ ఈ సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్‌తో పాటు సంగీత్ శోభ‌న్‌, గెట‌ప్ శీను, వెన్నెల‌కిషోర్ కామెడీ బాగుందంటూ ఆడియెన్స్ నుంచి కామెంట్స్ వ‌స్తున్నాయి.

నెట్‌ఫ్లిక్స్‌...

థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే రాకాస ఓటీటీ హ‌క్కులు అమ్ముడుపోయాయి. ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. దాదాపు ప‌ది కోట్ల‌కు ఈ డీల్ ముగిసిన‌ట్లు స‌మాచారం. థియేట‌ర్ల‌లో రిలీజైన నాలుగు నుంచి ఐదు వారాల త‌ర్వాత రాకాస ఓటీటీలోకి రానున్న‌ట్లు చెబుతున్నారు. మే 8 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ హార‌ర్ కామెడీ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.
ప్రొడ్యూస‌ర్‌గా నిహారిక కొణిదెల‌కు ఇది సెకండ్ మూవీ. మ‌రోవైపు మ్యాడ్‌, మ్యాడ్ స్క్వేర్ త‌ర్వాత రాకాస‌తో హీరోగా సంగీత్ శోభ‌న్ హ్యాట్రిక్ హిట్‌ను అందుకున్నాడు.

వీర‌బాబు క‌థ‌...

రాక‌వ‌రం ఊరికి చెందిన‌ ఈర‌బాబు అలియాస్ వీర (సంగీత్ శోభ‌న్‌) తాను ప్రేమించిన అమ్మాయి కోసం రాక‌వ‌రం వ‌స్తాడు. కానీ ఆ అమ్మాయి వీర‌ను మోసం చేస్తుంది. ఆ బ్రేక‌ప్ బాధ నుంచి సుబ్బ‌ల‌క్ష్మితో (న‌య‌న్ సారిక‌) పాటు స్నేహితులు బాల‌రాజు (గెట‌ప్ శీను) స‌హాయంతో బ‌య‌ట‌ప‌డ‌తాడు. ఆ ఊరి బ‌య‌ట ఉన్న కోట‌లో రాక్ష‌సుడు ఉంటాడు. అత‌డికి న‌ర‌బ‌లి ఇవ్వాల‌నే ఆచారం త‌ర‌త‌రాలుగా కొన‌సాగుతుంటుంది. రాక్ష‌సుడికి బ‌లి కోసం వీర స్నేహితుడు బాల‌రాజు పేరును ఊరు ప్ర‌జ‌లు ఖ‌రారు చేస్తారు. బాల‌రాజు బ‌దులు వీర కోట లోప‌లికి ఎందుకు వెళ్లాల్సివ‌చ్చింది? ఆ కోట‌లో నిజంగానే రాక్ష‌సుడు ఉన్నాడా? కోట‌లో వీర‌కు ఎదురైన సోము ఎవ‌రు? వీర‌ను ప్రేమించిన సుబ్బ‌ల‌క్ష్మి...బాల‌రాజుతో క‌లిసి కోట‌లోకి ఎలా వ‌చ్చింది? ఈ న‌లుగురు కోట నుంచి ప్రాణాల‌తో ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

 

Advertisement
Advertisement