YouTube | యూజర్లకు షాకిచ్చిన యూట్యూబ్.. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు పెంపు..
YouTube | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు షాకిచ్చింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను మరోసారి పెంచింది. స్ట్రీమింగ్ రంగంలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలోనే గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Technology | Published On Apr 11, 2026, 11.24 am IST
YouTube | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ ప్రీమియం వినియోగదారులకు షాకిచ్చింది. ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను మరోసారి పెంచింది. స్ట్రీమింగ్ రంగంలో పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలోనే గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ నెలవారీ వ్యక్తిగత ప్లాన్‌ను 13.99 డాలర్లకు పెంచారు. ఇది 2 డాలర్ల మేర పెరిగింది. అలాగే ఫ్యామిలీ ప్లాన్ ఛార్జీలు నెలకు 22.99 డాలర్లకు చేరుకున్నాయి. ఈ ప్లాన్‌పై 5 డాలర్లను పెంచారు. పెంచిన ఛార్జీలు కొత్త వినియోగదారులకే కాకుండా ఇప్పటికే యూట్యూబ్‌ను వాడుతున్న ప్రీమియం వినియోగదారులకు కూడా వర్తిస్తాయని గూగుల్ తెలిపింది. ఈ ఛార్జీలను తక్షణమే అమలు చేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది.
పెరుగుతున్న ఖర్చుల వల్లే..
యూట్యూబ్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇటీవలి కాలంలో ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని చూస్తోంది. అందులో భాగంగానే స్ట్రీమింగ్ రంగంలో ప్లాట్‌ఫామ్ ఖర్చులు పెరుగుతున్నందున వాటిని సమతుల్యం చేసేందుకు గూగుల్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రీమియం యూజర్లకు సబ్‌స్క్రిప్షన్ ఫీచర్లను మరింత విస్తరింనుంది. కేవలం యాడ్స్‌పై మాత్రమే ఆధారపడకుండా, యాడ్-ఫ్రీ వ్యూయింగ్, బ్యాక్ గ్రౌండ్ ప్లే బ్యాక్, ఆఫ్‌లైన్ డౌన్ లోడ్స్ వంటి ఫీచర్లతో ప్రీమియం సేవను ముఖ్య ఆదాయ వనరుగా మరింత అభివృద్ధి చేయడానికి యూట్యూబ్ ప్రయత్నిస్తోంది. ఇక అదనపు మానెటైజేషన్ విధానాలపై వస్తున్న ఊహాగాలను ఆ సంస్థ ఖండించింది. టీవీ వినియోగదారుల కోసం 90 సెకన్ల స్కిప్ చేయలేని యాడ్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు వచ్చిన వార్తలను తోసిపుచ్చింది. ప్రస్తుతం అలాంటి మార్పులు ఏవీ అమలు చేయడం లేదని స్పష్టం చేసింది.
ప్రీమియం లైట్ పేరిట..
యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ నెలవారీ చార్జిలను పెంచినప్పటికీ ప్రీమియం లైట్ అనే మరో కొత్త సబ్‌స్క్రిప్షన్ ను అమెరికా యూజర్లకు ప్రవేశపెట్టనుంది. ఇందులో భాగంగా యూజర్లు వీడియోలను వీక్షిస్తున్న సమయంలో యాడ్స్ రావు. కానీ సాధారణ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లో ఉన్న మాదిరిగా బ్యాక్ గ్రౌండ్ ప్లే, మ్యూజిక్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. అలాగే ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్ నెలవారీ ఛార్జీలు సాధారణ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తో పోలిస్తే తక్కువగా ఉంటాయి. పూర్తి స్థాయి ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ను తీసుకోలేని యూజర్లకు ఈ లైట్ ప్లాన్ ఉపయోగపడుతుందని యూట్యూబ్ భావిస్తోంది.

ఒక్కో దేశంలో ఒక్కో రకంగా..
ప్రపంచ వ్యాప్తంగా యూట్యూబ్ ప్రీమియం సేవల నెలవారీ ఛార్జీలు ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉన్నాయి. అమెరికాలో ఉన్న ఛార్జీల ప్రకారం చూసుకుంటే భారత్‌లో నెలకు ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వ్యక్తిగత ప్లాన్ ఛార్జీలు 13.99 డాలర్లు అంటే దాదాపుగా రూ.1300 అవుతుంది. కానీ భారత్‌లో చాలా తక్కువగా నెలకు కేవలం రూ.149 కే యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ వ్యక్తిగత ప్లాన్‌ను పొందవచ్చు. అదే ఫ్యామిలీ ప్లాన్ అయితే నెలకు రూ.299 మాత్రమే అవుతుంది. అదే అమెరికాలో ఇదే ఛార్జీ నెలకు 22.99 డాలర్లు అంటే దాదాపుగా రూ.2,140 అవుతుంది. ఈ లెక్కన చూస్తే భారత వినియోగదారులకే చాలా తక్కువ ఛార్జీలకు యూట్యూబ్ ప్రీమియం సేవలు లభిస్తున్నాయి. అలాగే ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఈ ఛార్జీలు ఉన్నాయి. భారత్ వంటి దేశాల్లో తక్కువ ధరలకే ప్లాన్‌లు అందుబాటులో ఉండగా, అమెరికా, యూరప్ లాంటి దేశాల్లో ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయి.
ప్రీమియం ప్లాన్లలోనూ యాడ్స్ పట్ల అసహనం..
భారత్‌లో ప్రస్తుతం యూట్యూబ్ ప్రీమియం నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లు తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నప్పటికీ, 2024లో వ్యక్తిగత, స్టూడెంట్, ఫ్యామిలీ ప్లాన్‌ల ఛార్జీలను పెంచింది. అయితే ఇప్పుడు అమెరికాలో సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను పెంచిన నేపథ్యంలో భారత్‌లోనూ పెంపు ఉంటుందని భావిస్తున్నారు. కానీ దీనిపై యూట్యూబ్ ఇంకా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. కాగా ఇటీవలి కాలంలో వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ ఛార్జీలను గణనీయంగా పెంచాయి. నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్, జియో హాట్ స్టార్ వంటి ప్లాట్‌ఫామ్‌లు ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖర్చులను తగ్గించేందుకు సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను కూడా పెంచుతూ వస్తున్నాయి. కానీ గతంలో ప్రీమియం ప్లాన్‌లలో సిరీస్‌లు లేదా సినిమాల మధ్యలో యాడ్స్ వచ్చేవి కావు. గతంలో ఉన్న ప్రీమియం ప్లాన్లు ఇప్పుడు సాధారణ ప్లాన్లు అయ్యాయి. ఈ క్రమంలో పాత ప్రీమియం ప్లాన్లతో సబ్‌స్క్రిప్షన్ ను తీసుకున్నా యాడ్స్ దర్శనమిస్తున్నాయి. దీంతో వీక్షకుల్లో అసహనం పెరిగిపోతోంది. ఇప్పుడు యాడ్స్ లేకుండా సినిమాలను వీక్షించాలంటే గతంలో ఉన్న ప్రీమియం ప్లాన్ కన్నా మరింత ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు.
అయితే ఓటీటీ లేదా వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లు ధరల పెంపుపై కాకుండా వినియోగదారులకు నాణ్యమైన వీక్షణ అనుభవాన్ని అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని, చాలా వరకు ప్లాట్‌ఫామ్‌లలో వీడియోలను చూస్తున్న సమయంలో స్ట్రీమింగ్ విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని చాలా మంది వినియోగదారులు పేర్కొంటున్నారు. దీనిపై ఆయా ప్లాట్‌ఫామ్‌లు దృష్టి సారించాలని అంటున్నారు.
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






