త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | 50 కోట్ల బ‌డ్జెట్ – 9 కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ

మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ డిజాస్ట‌ర్ మూవీ దో దీవానే షెహ‌ర్ మే ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. సిద్ధాంత్ చ‌తుర్వేది హీరోగా న‌టించిన ఈ సినిమాకు టాప్ డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మించారు.

N

News | Published On Apr 11, 2026, 11.08 am IST

Mrunal Thakur |  50 కోట్ల బ‌డ్జెట్ – 9 కోట్ల క‌లెక్ష‌న్స్ – ఓటీటీలోకి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ
Advertisement

Mrunal Thakur | బాలీవుడ్‌లో మృణాల్ ఠాకూర్ బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. ఆమె హీరోయిన్‌గా న‌టించిన సినిమాలు వ‌రుస‌గా బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొడుతున్నాయి. హిందీలో మృణాల్‌ హిట్టు అందుకొని ఐదారేళ్లు దాటిపోయింది. గ‌త సినిమా దో దీవానే షెహ‌ర్ మే సినిమాపైనే బోలెడు ఆశ‌లు పెట్టుకుంది. అగ్ర ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ నిర్మించిన ఈ సినిమాతో బాలీవుడ్‌లో మృణాల్ క‌మ్‌బ్యాక్ ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని అభిమానుల‌తో పాటు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు భావించాయి. రొమాంటిక్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాకు శ్రీదేవి మామ్ ఫేమ్ ర‌వి ఉద్య‌వార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. భారీ అంచ‌నాల న‌డుమ ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఈ మూవీ డిజాస్ట‌ర్‌గా నిలిచింది.

నెట్‌ఫ్లిక్స్‌లో...

తాజాగా దో దీవానే షెహ‌ర్ మే ఓటీటీలోకి రాబోతుంది. ఏప్రిల్ 17 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌ను అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించిన నెట్‌ఫ్లిక్స్ ఓ పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది.
దో దీవానే షెహ‌ర్ మే సినిమాలో సిద్ధాంత్ చ‌తుర్వేది హీరోగా న‌టించాడు.

యాభై కోట్ల బ‌డ్జెట్‌...

దాదాపు యాభై కోట్ల బ‌డ్జెట్‌తో డైరెక్ట‌ర్ సంజ‌య్ లీలా భ‌న్సాలీ దో దీవానే షెహ‌ర్ మే సినిమాను నిర్మించారు. థియేట‌ర్ల‌లో 9 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఈ మూవీ ఈ ఏడాది బాలీవుడ్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. కాన్సెప్ట్ తో పాటు సిద్ధాంత్ చ‌తుర్వేది, మృణాల్ ఠాకూర్ కెమిస్ట్రీ, డైలాగ్స్‌పై దారుణంగా విమ‌ర్శ‌లొచ్చాయి. త‌మ‌లోని చిన్న చిన్న లోపాల‌ను చూసి భ‌య‌ప‌డే ఓ జంట ప్రేమ‌క‌థ‌తో ర‌వి ఉద్య‌వార్ ఈ సినిమాను రూపొందించారు. కాన్సెప్ట్‌ను నేటి ట్రెండ్‌కు త‌గిన‌ట్లుగా చెప్ప‌లేక‌పోయారు.

యువ జంట ప్రేమ‌క‌థ‌...

శ‌శాంక్ శ‌ర్మ ఓ మార్కెటింగ్ కంపెనీలో ప‌నిచేస్తుంటాడు. స్టేజ్ ఫియ‌ర్‌తో బాధ‌ప‌డుతుంటాడు. అంద‌రి ముందు మాట్లాడ‌లేక‌పోతాడు. రోష్నీ శ్రీ వాత్స‌వ తాను అందంగా లేన‌నే, న‌ల్ల‌గా ఉన్నాన‌ని త‌న‌లో తానే కుమిలిపోతుంది. వ‌చ్చిన పెళ్లి సంబంధాల‌న్నీ రిజెక్ట్ చేస్తుంది. రోష్నీ రిజెక్ట్ చేసిన వారిలో శ‌శాంక్ కూడా ఉంటాడు. అనుకోకుండా ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుస్తారు. ప్రేమ‌లో ప‌డ‌తారు. శ‌శాంక్‌కు రోష్నీ ఎందుకు అపార్థం చేసుకుంది? పెళ్లి చేసుకోవాల‌ని అనుకున్న వారు ఎలా విడిపోయారు అనే అంశాల‌తో ద‌ర్శ‌కుడు ర‌వి ఉద్య‌వార్ ఈ సినిమాను తెర‌కెక్కించారు.

 

Advertisement
Advertisement