Cyber Crime | ప్రభుత్వ పథకం పేరుతో.. ఏకంగా ఎమ్మెల్యేకే బురిడీ
Cyber Crime | ఆయన ఉన్నత విద్యావంతుడు. ఎన్నో విద్యాసంస్థలకు అధిపతి. ఆయనకు ఓ యూనివర్సిటీ కూడా ఉన్నది. అంతేకాదు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా చేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే (MLA) కూడా. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోయారు.
Cyber Crime | త్రినేత్ర.న్యూస్: ఆయన ఉన్నత విద్యావంతుడు. ఎన్నో విద్యాసంస్థలకు అధిపతి. ఆయనకు ఓ యూనివర్సిటీ కూడా ఉన్నది. అంతేకాదు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా చేసిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే (MLA) కూడా. అయినప్పటికీ సైబర్ నేరగాళ్ల చేతులో మోసపోయారు. అందులోనూ ప్రభుత్వ పథకాల (Cyber Crime) పేరు చెప్పడంతో ఈజీగా కేటుగాళ్ల బుట్టలో పడిపోయారు. ఆయనే జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి (Palla Rajeshwar Reddy). బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారంటే సామాన్యులు ఇంకెంత అప్రమత్తంగా ఉండాలో ఆలోచించాలి.
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఫోన్ చేసిన ఓ గుర్తు తెలియని వ్యక్తి.. తెలంగాణ ఆర్థిక శాఖలో అదపను కార్యదర్శి నంటూ పరిచయం చేసుకున్నారు. తన పేరు అనంతరామిరెడ్డి అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా 'వికసిత్ భారత్' పథకం ప్రవేశపెట్టిందని, ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.10 లక్షల వరకు రుణాలు ఇస్తున్నామని నమ్మించాడు. నియోజకవర్గంలో 40 మంది అర్హులైన లబ్ధిదారుల జాబితాను పంపాలని, దరఖాస్తుకు ఈరోజే చివరి రోజని ఎమ్మెల్యేపై ఒత్తిడి పెంచాడు. స్కీమ్ ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ.2500 ఖర్చు అవుతుందని, తక్షణమే రూ.లక్ష ఫోన్ పే చేయాలని కోరాడు. దీంతో ప్రజలకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గంట వ్యవధిలోనే ఆ మొత్తాన్ని నిందితుడు చెప్పిన నంబర్‌కు బదిలీ చేశారు. తర్వాత ఆ నంబర్‌కి మళ్లీ ఫోన్స్ చేస్తే సమాధానం రాకపోవడంతో.. మోసపోయానని గ్రహించిన ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్ 319 (2), 318 (4), ఐటీ యాక్ట్ 66c, 66d కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఓ ఎమ్మెల్యేని, అందులోనూ ప్రభుత్వం పథకం పేరుచెప్పి మోసం చేయడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై నెటిజన్లు ఒక్కోరకంగా స్పందిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించారు.. ఇదీ ట్యాలెంట్ అంటే! అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Instagram | మెటాకు కేంద్రం నోటీసులు.. ఇన్‌స్టా యాడ్స్‌పై వివరణ కోరిన ఐటీశాఖ..!
జులై 3, 2026

SIM Swapping | సిమ్ స్వాపింగ్ మోసాలతో జాగ్రత్త.. నిర్లక్ష్యం చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయి..
జూన్ 23, 2026

Supreme Court | సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు.. వారిని ఉపేక్షించొద్దు : సుప్రీంకోర్టు
జూన్ 17, 2026
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే



