KTR | బయటకు వస్తున్న సింహం.. గుంట నక్కల గుండెల్లో పరుగెడుతున్న రైళ్లు : కేటీఆర్
KTR | సింహం బయటకు వస్తుందంటే.. గుంట నక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. తిరిగి జగిత్యాల నుంచే పూర్వ వైభవం సాధించడానికి కేసీఆర్ సీఎం కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుదాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
KTR | త్రినేత్ర.న్యూస్ : సింహం బయటకు వస్తుందంటే.. గుంట నక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. తిరిగి జగిత్యాల నుంచే పూర్వ వైభవం సాధించడానికి కేసీఆర్ సీఎం కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుదాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ నెల 20న జగిత్యాలలో నిర్వహించే బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్లను హరీశ్‌రావుతో కలిసి కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు.
జగిత్యాలలో పండుగ వాతావరణం ఉంది. కేసీఆర్ నాయకత్వంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. వాస్తవం ఏంటంటే రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతుంది. సింహం బయటకు వస్తుందంటే గుంట నక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కేసీఆర్ ఏడాది తర్వాత బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాల జైత్రయాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. సీఎం, మంత్రులు కలిసి సిల్లీ పాలిటిక్స్ చేస్తున్నారు.
హైటే తక్కువ అనుకున్నా.. బుర్ర కూడా తక్కువే..
కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారంటే.. సీఎం మేడిగడ్డకు పోతారట. రెండున్నరేండ్లలో సమయం దొరకలేదా మేడిగడ్డ సందర్శనకు. కేసీఆర్ బహిరంగ సభ ఇక్కడ ఉంటే ఆయన అక్కడ పయనమయ్యారు. ఇది చిల్లర ప్రయత్నం. కుసంస్కారమైన చిన్న మెదడు ఉన్న సీఎం బహుషా ఈ దేశంలో రేవంత్ తప్ప ఎవరూ లేరు. ఆయనకు హైటే తక్కువ అనుకున్నా.. బుర్ర కూడా తక్కువే. ఇంత చిల్లరగా రాజకీయం ఉండకూడదు. తమ గురించి పేపర్లో ఏం రాస్తారో అనే దానిపై కేసీఆర్‌కు అవసరం ఉండదు. కేసీఆర్ జనాలను కలవడం.. లక్షలాది మందితో సంభాషించడం మాత్రమే కేసీఆర్‌కు తెలుసు. ఆయన ప్రస్థానమే అది అని కేటీఆర్ తెలిపారు.
క్రాస్ బీడ్ అనల్నా.. హైబ్రిడ్ అనల్నా..
కోరుట్ల ప్రజలను ఇక్కడకు రానివ్వకుండా రోడ్ తవ్వుతున్నారు.. మూడేండ్ల నుంచి రోడ్ యాదికి రాలేదు.. ఇప్పుడే యాదికి వచ్చిందంట. ఇంత చీప్ పాలిటిక్స్. ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాల జన ప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి, ఇక్కడున్న హైబ్రిడ్ ఎమ్మెల్యే అంటున్నారు. ఆయన ఏ పార్టీనో ఆయనకే తెలియదు. ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ పార్టీ అంటడు.. కానీ కాంగ్రెస్ ఆఫీసులో మంత్రుల పక్కన కూర్చుంటాడు. క్రాస్ బీడ్ అనల్నా.. హైబ్రిడ్ అనల్నా.. ఏ బ్రీడ్ అనాల్లో ఆయనే చెప్పుకోవాలి అని కేటీఆర్ విమర్శించారు.
జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర, దండయాత్ర..
రేవంత్ రెడ్డి భయం ఏందంటే.. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర, దండయాత్ర మొదలైతది.. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు రంగం సిద్ధం చేశారని ఒక వాతావరణం వస్తదని ఆయనకు భయం పట్టుకుంది. ఆయనది అట్టర్ ప్లాఫ్ పాలన.. అన్ని వర్గాలకు చేసిన మోసం బయటపడుతదని భయం పట్టుకుంది. ఇదే జగిత్యాలలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కేసీఆర్. ప్రభుత్వం ఎన్ని చిల్లర కుట్రలు చేసినా మా పార్టీ నాయకత్వం కష్టపడుతోంది.. సభను విజయవంతం చేసి తీరుతాం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
సంయమనం, సమన్వయం, ఓపికతో ఉందాం..
ప్రజలు, కార్యకర్తలు సంయమనం పాటించి విజయవంతం చేసుకుందాం. కేసీఆర్ చాలా కాలం తర్వాత జగిత్యాల నుంచి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. రైతులు, ఆడబిడ్డలు, యువకులు, పెద్దలు ఎదురుచూస్తున్నారు. సంయమనం, సమన్వయం, ఓపికతో ఉందాం. ఇది మీ సభ.. మీరు అతిథ్యం ఇస్తున్నారు.. విజయవంతం చేసే దిశగా ముందుకు పోవాలి. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుంది. తిరిగి జగిత్యాల నుంచే పూర్వ వైభవం సాధించడానికి కేసీఆర్ సీఎం కావడానికి జగిత్యాల ప్రజలు ఆశీర్వాదంతోనే కదం తొక్కుదాం అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
సా. 5.30 గంటలకు సభాస్థలికి కేసీఆర్
ఎల్లుండి జరిగే సభకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. 3 లక్షల మంచినీళ్ల బాటిల్స్, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లు తెప్పిస్తాం. సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్ చేరుకుంటారు. చేరుకున్న తర్వాత సభా గంటన్నర పాటు జరుగుతుంది అని కేటీఆర్ తెలిపారు.
సంబంధిత వార్తలు

Harish Rao New Jersey | ‘ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు’ : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
మే 21, 2026

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



