LPG Price | ఎల్‌పీజీ ధరలు తగ్గుతాయా..?
LPG Price | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ఎట్టకేలకు కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచినట్లుగా అధికారికంగా ప్రకటించింది. దాంతో చమురు, గ్యాస్ సరఫరాలో ఆటంకాలు తొలగిపోనున్నాయి.
LPG Price | మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ ఎట్టకేలకు కీలక ప్రకటన చేసింది. హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచినట్లుగా అధికారికంగా ప్రకటించింది. దాంతో చమురు, గ్యాస్ సరఫరాలో ఆటంకాలు తొలగిపోనున్నాయి. ఈ క్రమంలో అందరూ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలు తగ్గుతాయా? అంటూ ఆరా తీస్తున్నారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్-యూఎస్ దాడులకు ముందు గృహ వినియోగ సిలిండర్ ధర ఢిల్లీ ఎన్‌సీఆర్ పరిధిలో రూ.850 వరకు ఉండేది. ప్రస్తుతం ఈ ధర రూ.913కి చేరింది. తాజాగా హార్ముజ్ జలసంధిని తిరిగి తెరిచిన నేపథ్యంలో గ్యాస్ ధరలు తగ్గుతాయా అంటే.. ఇందుకు అవకాశం లేదని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
\హార్ముజ్ జలసంధి తెరుచుకున్నపపటికీ ఎల్‌పీజీ సరఫరా తిరిగి సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ధర తగ్గే సూచనలు మాత్రం కనిపించడం లేదు. గ్యాస్ బుకింగ్ కోసం ప్రభుత్వం మళ్లీ పాత నిబంధనలు అమలు చేస్తుందా? అంటే అలా జరిగే సూచనలు మాత్రం కనిపించడం లేదు. హార్ముజ్ జలసంధి తెరుచుకున్నప్పటికీ దేశంలో ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థ తిరిగి సాధారణ స్థితికి రావడానికి చాలా సమయం పట్టేందుకు అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. నగరాల్లో 25 రోజుల గడువు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల గడువు నిబంధనలు యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. అలాగే, గ్యాస్ సిలిండర్ డెలివరీ సమయంలో తప్పనిసరిగా ఓటీపీ వెరిఫికేషన్ తప్పనిసరి కానుంది.
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






