త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Strait of Hormuz | హ‌ర్మూజ్‌ను పూర్తిగా మూసేసిన ఇరాన్‌.. ఇంధ‌న ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగే ఛాన్స్‌..?

Strait of Hormuz | ప‌శ్చిమాసియాలో (Middle East) యుద్ధం మ‌రింత తీవ్ర‌రూపం దాల్చింది. ఈ నేప‌థ్యంలో ఇరాన్ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌పంచ ఇంధ‌న ర‌వాణాకు కీల‌క‌మైన హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని (Strait of Hormuz) పూర్తిగా మూసివేసిన‌ట్లు ప్ర‌క‌టించింది.

D

International | Published On Jun 11, 2026, 11.16 am IST

Strait of Hormuz | హ‌ర్మూజ్‌ను పూర్తిగా మూసేసిన ఇరాన్‌.. ఇంధ‌న ధ‌ర‌లు మ‌ళ్లీ పెరిగే ఛాన్స్‌..?
Advertisement

Strait of Hormuz | ప‌శ్చిమాసియాలో (Middle East) యుద్ధం మ‌రింత తీవ్ర‌రూపం దాల్చింది. ఇరాన్‌పై అమెరికా ద‌ళాలు భీక‌ర దాడులు చేస్తున్నాయి. అదే స‌మ‌యంలో టెహ్రాన్ సైతం గ‌ల్ఫ్‌లోని అమెరికా స్థావ‌రాల‌ను టార్గెట్ చేసింది. ఈ దాడుల నేప‌థ్యంలో ఇరాన్ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌పంచ ఇంధ‌న ర‌వాణాకు కీల‌క‌మైన హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని (Strait of Hormuz) పూర్తిగా మూసివేసిన‌ట్లు ప్ర‌క‌టించింది. త‌మ హెచ్చ‌రిక‌ల‌కు బేఖాత‌రు చేస్తే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలోనే హర్మూజ్‌ను దాటేందుకు ప్రయత్నించిన రెండు నౌకలపై టెహ్రాన్ దాడి కూడా చేసింది.

ఈ మేర‌కు ఇరాన్ ఇస్లామిక్ రివ‌ల్యూష‌న‌రీ గార్డ్ కార్ప్స్ (IRGC) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ ప్రాంతంలో భ‌ద్ర‌తా ప‌రిస్థితులు దెబ్బ‌తిన్న నేప‌థ్యంలో హ‌ర్మూజ్‌ను పూర్తిగా మూసివేసిన‌ట్లు తెలిపింది. చమురు ట్యాంకర్లు, వాణిజ్య నౌకలు సహా ఏ నౌకైనా ఈ మార్గంలో ప్రయాణించేందుకు ప్రయత్నిస్తే లక్ష్యంగా చేసుకుంటామ‌ని స్ప‌ష్టం చేసింది. ఇరాన్ తాజా చ‌ర్య‌తో అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఇరాన్ ప్ర‌క‌ట‌న భార‌త్‌పై ప‌డే ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌నుంది. మ‌న దేశం త‌న ముడి చ‌మురు అవ‌స‌రాల్లో దాదాపు 90 శాతం దిగుమ‌తి చేసుకుంటుంది. ఇందులో స‌గానికి పైగా హ‌ర్మూజ్ గుండానే స‌ర‌ఫ‌రా అవుతుంది. భార‌త్ త‌న LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) అవసరాల్లో దాదాపు 60 శాతం దిగుమ‌తుల‌పైనే ఆధార‌ప‌డుతోంది. అందులో ఎక్కువ భాగం ఈ జ‌లసంధి గుండానే ర‌వాణా అవుతోంది. అంతేకాదు, పెట్రోల్‌, డీజిల్‌, స‌హ‌జ వాయువు ఈ మార్గం గుండానే స‌ర‌ఫ‌రా అవుతోంది. దీంతో భార‌త్‌పై ఆ ప్ర‌భావం తీవ్రంగా ప‌డే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఫ‌లితంగా మ‌రోసారి ఇంధ‌న ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

Also Read..

కొన‌సాగుతున్న ప‌శ్చిమాసియా యుద్ధ ఉద్రిక్త‌త‌లు.. బంగారం ధ‌ర మ‌ళ్లీ భారీగా ప‌త‌నం..

ప‌శ్చిమాసియాలో యుద్ధం తీవ్ర‌రూపం.. ఇరాన్‌పై అమెరికా భీక‌ర దాడులు

మిడిల్ ఈస్ట్ మంటలు.. స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం..

Advertisement
Advertisement