త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

US-Iran War | ప‌శ్చిమాసియాలో యుద్ధం తీవ్ర‌రూపం.. ఇరాన్‌పై అమెరికా భీక‌ర దాడులు

US-Iran War | మ‌శ్చిమాసియాలో (Middle East) యుద్ధం మ‌ళ్లీ తీవ్ర‌రూపం దాల్చింది. ఇరాన్‌పై యూఎస్ ద‌ళాలు భీక‌ర దాడుల‌కు దిగారు. ఇరాన్ సైతం దీటుగా బ‌దులిస్తోంది. దీంతో దాడులు, ప్ర‌తిదాడుల‌తో గ‌ల్ఫ్‌లో మిస్సైళ్ల వ‌ర్షం కురుస్తోంది.

D

International | Published On Jun 11, 2026, 10.39 am IST

US-Iran War | ప‌శ్చిమాసియాలో యుద్ధం తీవ్ర‌రూపం.. ఇరాన్‌పై అమెరికా భీక‌ర దాడులు
Advertisement

US-Iran War | మ‌శ్చిమాసియాలో (Middle East) యుద్ధం మ‌ళ్లీ తీవ్ర‌రూపం దాల్చింది. శాంతి ఒప్పందం కుదుర్చుకోవడంలో తీవ్ర జాప్యం చేస్తున్న టెహ్రాన్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ (Donald Trump) హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. అన్న‌ట్లుగానే ఇరాన్‌పై యూఎస్ ద‌ళాలు భీక‌ర దాడుల‌కు దిగారు. ఇరాన్ సైతం దీటుగా బ‌దులిస్తోంది. దీంతో దాడులు, ప్ర‌తిదాడుల‌తో గ‌ల్ఫ్‌లో మిస్సైళ్ల వ‌ర్షం కురుస్తోంది.

ఇరాన్‌లో భారీ పేలుళ్లు..

ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కాసేప‌టికే ఇరాన్‌లోని ప‌లు ల‌క్ష్యాల‌పై దాడులు చేసిన‌ట్లు అమెరికా సెంట‌ల్ర్ క‌మాండ్ (US Central Command) ప్ర‌క‌టించింది. అధ్య‌క్షుడి ఆదేశాల మేర‌కు ఆత్మరక్షణ కోసం ఈ దాడులు చేసిన‌ట్లు తెలిపింది. స్థానిక మీడియా నివేదిక‌ల ప్ర‌కారం.. అమెరికా దాడుల‌తో ఇరాన్‌లోని దక్షిణ ప్రాంతంలో భారీగా పేలుళ్లు జరిగాయి. మినాబ్‌, బందర్‌ అబ్బాస్‌, సిరిక్‌, టెహ్రాన్‌, ఫార్స్ ప్రావిన్స్, కేష్మ్ ద్వీపం, మధ్య ఇస్ఫహాన్‌లోని ప‌లు ప్రాంతాల్లో పేలుళ్ల శ‌బ్దాలు వినిపించాయి.

అమెరికా స్థావ‌రాల‌పై ఇరాన్ ప్ర‌తీకార దాడులు

ఇక అమెరికా దాడుల‌కు ఇరాన్ సైతం దీటుగా బ‌దులిచ్చింది. కువైట్‌, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావ‌రాల‌ను టార్గెట్‌ చేసింది. బహ్రెయిన్‌లోని షేక్‌ ఇసా ఎయిర్‌బేస్‌, కువైట్‌లోని అలీఅల్‌సలీమ్‌ ఎయిర్‌బేస్‌లపై డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) తెలిపింది. బ‌హ్రెయిన్‌లోని యూఎస్ ఫిఫ్త్ ఫ్లీట్‌పై ఇరాన్ దాడి చేసిన‌ట్లు ఇరానియ‌న్ మీడియా నివేదించింది. అంతేకాదు, ప్ర‌పంచ ఇంధ‌న ర‌వాణాకు కీల‌క‌మైన హ‌ర్మూజ్ జ‌ల‌సంధిని (Strait of Hormuz) పూర్తిగా మూసివేసిన‌ట్లు ఐఆర్‌జీసీ ప్ర‌క‌టించింది.

కువైట్‌, బ‌హ్రెయిన్‌లో సైరన్ల మోత‌..

ఇరాన్ దాడుల‌తో బ‌హ్రెయిన్‌లోని ప‌లు ప్రాంతాల్లో సైర‌న్లు మోగాయి. అప్ర‌మ‌త్త‌మైన ఆ దేశ అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ ప్ర‌జ‌ల‌కు కీల‌క హెచ్చ‌ర‌క‌లు జారీ చేసింది. ప్ర‌శాంతంగా ఉండాల‌ని.. సుర‌క్షిత ప్రాంతాల్లోనే ఉండాల‌ని సూచించింది. అటు కువైట్ కూడా ప్ర‌జ‌ల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. అధికారిక వ‌ర్గాలు జారీ చేసే సూచ‌న‌లను పాటించాల‌ని సూచించింది.

Also Read..

మిడిల్ ఈస్ట్ మంటలు.. స్టాక్ మార్కెట్లు భారీగా ప‌త‌నం..

రాజ్య‌స‌భ నామినేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌.. సుప్రీంకోర్టులో మీనాక్షి న‌ట‌రాజ్ పిటిష‌న్‌

బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సెల‌బ్రేష‌న్స్ - స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా మోక్ష‌జ్ఞ‌

Advertisement
Advertisement