Mrunal Thakur | రణ్‌వీర్ నా లక్కీ చార్మ్.. మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Mrunal Thakur | బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రణ్‌వీర్ నటించిన తాజా చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. రూ.1000కోట్లు వసూళ్లు దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మృణాల్ హర్షం వ్యక్తం చేసింది.
Entertainment | Published On Apr 8, 2026, 10.25 am IST
Mrunal Thakur | బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రణ్‌వీర్ నటించిన తాజా చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. రూ.1000కోట్లు వసూళ్లు దాటిన తొలి బాలీవుడ్ చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో మృణాల్ హర్షం వ్యక్తం చేసింది.
ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘రణ్‌వీర్ నా లక్కీ చార్మ్. ఈ ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోవడానికి ప్రధాన కారణం ఆయనే. మోడల్‌గా ఉన్న సమయంలో ఒక హెయిర్ బ్రాండ్ ప్రకటనలో ఆయనతో కలిసి పనిచేశాను. ఆ ప్రకటన ప్రసారమైన తర్వాతే దర్శకులు నన్ను గుర్తించారు. ఆ క్రెడిట్ అంతా రణ్‌వీర్ సింగ్‌కే చెందుతుంది. ఆయన చాలా పాజిటివ్ వ్యక్తి. ఆయన మరిన్ని సక్సెస్‌లు సాధించాలి’ అని వ్యాఖ్యనించింది. ‘ధురంధర్’ సినిమాలో రణ్‌వీర్ నటనపై ప్రశంసలు కురిపించిన మృణాల్.. ఆయన నటన బాగుంటుందని, తాను మూవలో రణ్‌వీర్ ను కాకుండా ‘హమ్‌జా’ అనే పాత్రనే చూశానని తెలిపింది. ఆ పాత్రలో లీనమయ్యారు. ఎంతో కష్టపడే నటుడని, ఆయన చేసే ప్రతి చిత్రం బ్లాక్‌బస్టర్ కావాలని కోరుకుంటున్నానని తెలిపింది.
మార్చి 19న విడుదలైన ‘ధురంధర్ 2’ చిత్రం హిందీతో పాటు ఇతర తెలుగు సహా పలు భారతీయ భాషల్లో విడుదలైంది. విడుదలకు ఒక రోజు ముందే పేడ్ ప్రీమియర్స్ నిర్వహించారు. తొలి భాగంలో రణ్‌వీర్ సింగ్ భారత గూఢచారి పాత్రలో లియారి ప్రాంతంలో గ్యాంగ్‌లలో చొరబడి ఉగ్రవాద నెట్వర్క్‌ను ఛేదించే కథను చూపించారు. కాంధహార్ విమాన హైజాక్, 2001 పార్లమెంట్ దాడి, 26/11 ముంబై దాడుల నేపథ్యంలో కథ నడిచింది. సీక్వెల్‌లో ఆయన ‘హమ్‌జా అలీ మజారి’గా ఎలా మారాడో చూపించారు. భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద నెట్వర్క్‌ను ధ్వంసం చేసే కథను ముందుకు తీసుకెళ్లారు. ఈ చిత్రంలో రణ్‌వీర్ సింగ్, అర్జున్ రాంపాల్ మధ్య ఉత్కంఠభరిత పోరు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆర్ మాధవన్, రాకేశ్ బేది, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇక మృణాల్ సినిమాల విషయానికి వస్తే.. డెకాయిట్ మూవీ విడుదలకు సిద్ధమైంది. అడవి శేష్, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే, హిందీలో రెండు చిత్రాలతో పాటు అల్లు అర్జున్-అట్లీ కాంబోలో వస్తున్న మూవీలోనూ కీలకపాత్రలో నటించనుంది.
తాజావార్తలు
- ●DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ
- ●Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?

DA Arrears | దసరాకు ఒకేసారి రెండు డీఏలు విడుదల.. పది రోజుల్లో పీఆర్సీ నివేదిక.. ఉద్యోగులకు సీఎస్ హామీ

Horoscope | సెప్టెంబర్ 24 రాశిఫలాలు.. ఈ రాశివారి వ్యక్తిత్వం అందరినీ ఆకట్టుకుంటుంది!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం



