త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dancing Missile | యుద్ధంలో తొలిసారి డ్యాన్సింగ్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన ఇరాన్‌.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..

Dancing Missile | గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావ‌రాలు, ఎంబ‌సీలే ల‌క్ష్యంగా ఇరాన్ దాడుల‌ను పెంచింది. డ్రోన్లు, క్షిప‌ణుల‌తో విరుచుకుప‌డుతోంది. ఆదివారం కూడా యూఎస్ స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఇరాన్ త‌న‌ అధునాత‌న క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించింది. ఇందులో సెజ్జిల్-2 క్షిప‌ణి కూడా ఉంది.

D

International | Published On Mar 16, 2026, 1.11 pm IST

Dancing Missile | యుద్ధంలో తొలిసారి డ్యాన్సింగ్ మిస్సైల్‌ను ప్ర‌యోగించిన ఇరాన్‌.. దీని ప్ర‌త్యేక‌త‌లు ఇవే..
Advertisement

Dancing Missile | ప‌శ్చిమాసియాలో యుద్ధం 16వ రోజుకు చేరింది. ఇరాన్ (Iran)పై ఇజ్రాయెల్‌-అమెరికా దాడుల‌ను కొన‌సాగిస్తోంది. అదే స‌మ‌యంలో గ‌ల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావ‌రాలు, ఎంబ‌సీలే ల‌క్ష్యంగా ఇరాన్ సైతం దాడుల‌ను పెంచింది. డ్రోన్లు, క్షిప‌ణుల‌తో విరుచుకుప‌డుతోంది. ఆదివారం కూడా యూఎస్ స్థావ‌రాలే ల‌క్ష్యంగా ఇరాన్ త‌న‌ అధునాత‌న క్షిప‌ణుల‌ను ప్ర‌యోగించింది. ఇందులో సెజ్జిల్-2 క్షిప‌ణి కూడా ఉంది. యుద్ధం ప్రారంభ‌మైన‌ప్ప‌టి నుంచి ఇరాన్ ఈ క్షిప‌ణిని (Sejjil missile) ప్ర‌యోగించ‌డం ఇదే తొలిసారి. దీంతో ఈ మిస్సైల్ గురించి ప్ర‌స్తుతం తీవ్రంగా చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఈ మిస్సైల్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ప‌లు నివేదిక‌ల ప్ర‌కారం.. ఇరాన్ పూర్తి స్వ‌దేశీ సాంకేతిక‌త‌తో అభివృద్ధి చేసిన టూ స్టేజ్ బాలిస్టిక్ క్షిప‌ణి. దీనిని సజ్జిల్ (Sajjil), ఆషౌరా (Ashoura), ఆషురా (Ashura) అని కూడా పిలుస్తారు. సుదూరప్రాంతాల్లోని లక్ష్యాలను ఇది సమర్థంగా ధ్వంసం చేయగలదు. సెజ్జిల్-2 క్షిపణి సుమారు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఏకంగా 700 కిలోల వార్‌ హెడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. గ‌గ‌న‌త‌లంలో అత్యంత ఎత్తున ప్ర‌యాణిస్తూ కూడా ఇది స‌మ‌ర్థంగా తిరుగుతూ ల‌క్ష్యాన్ని ఢీ కొట్ట‌గ‌ల‌దు. అందుకే దీన్ని డ్యాన్సింగ్‌ మిసైల్ (Dancing Missile) అని పిలుస్తారు. ఇజ్రాయెల్ ఐరన్‌ డోమ్‌ వంటి క్షిపణి రక్షణ వ్యవస్థలను తప్పించుకునేలా ఈ క్షిపణిని రూపొందించారు.

సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్ (CSIS) ప్రకారం.. ఈ క్షిపణి సుమారు 18 మీటర్ల పొడ‌వు, 1.23 మీట‌ర్ల వ్యాసం కలిగి ఉంటుంది. దీని బ‌రువు సుమారు 23,600 కిలోగ్రాములు. ఈ క్షిప‌ణిని త‌యారీని ఇరాన్ 1990లోనే ప్రారంభించింది. ఈ క్షిప‌ణిని 2008లో మొద‌టిసారి ప్ర‌యోగించారు. అప్పట్లో ఇది సుమారు 800 కిలోమీట‌ర్ల ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఆ త‌ర్వాత గైడెన్స్‌, నావిగేష‌న్ వ్య‌వ‌స్థ‌ల‌ను ప‌రీక్షించేందుకు 2009 మేలో రెండోసారి ఈ క్షిప‌ణిని ప్ర‌యోగించింది. ఆ త‌ర్వాత కూడా ప‌లు ప‌ర‌క్షీలు నిర్వ‌హించారు. ఒకానొక స‌మ‌యంలో ఈ క్షిప‌ణి హిందూ మహాసముద్రంలోకి దాదాపు 1,900 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిసింది.

Also Read..

గంట పాటు కొన‌సాగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం.. స‌భ రేప‌టికి వాయిదా

ప్రపంచ కుబేరులకు అడ్డా ఏ దేశమో తెలుసా? అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్-10 దేశాలు ఇవే!

13 ఏళ్ల న‌ర‌కం నుంచి హ‌రీశ్ రాణాకు విముక్తి.. క‌న్నీళ్లు పెట్టిస్తున్న చివ‌రి వీడియో

Advertisement
Advertisement