త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Assembly | గంట పాటు కొన‌సాగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం.. స‌భ రేప‌టికి వాయిదా

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌సంగించారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ను, అభివృద్ధిని, సంక్షేమ ప‌థ‌కాల‌ను గ‌వ‌ర్న‌ర్ సుదీర్ఘంగా వివ‌రించారు. మొత్తంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉద‌యం 11.50 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.50 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది.

S

Telangana | Published On Mar 16, 2026, 12.59 pm IST

Telangana Assembly | గంట పాటు కొన‌సాగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం.. స‌భ రేప‌టికి వాయిదా
Advertisement

Telangana Assembly | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో ఉభ‌య‌స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ శివ ప్ర‌తాప్ శుక్లా ప్ర‌సంగించారు. ప్ర‌భుత్వ ల‌క్ష్యాల‌ను, అభివృద్ధిని, సంక్షేమ ప‌థ‌కాల‌ను గ‌వ‌ర్న‌ర్ సుదీర్ఘంగా వివ‌రించారు. మొత్తంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం ఉద‌యం 11.50 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12.50 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగింది. గంట పాటు కొన‌సాగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగానికి.. మ‌ధ్య మ‌ధ్య‌లో బీఆర్ఎస్ స‌భ్యులు అడ్డు త‌గిలారు. గ‌వ‌ర్న‌ర్‌తో ప్ర‌భుత్వం అబ‌ద్ధాలు చెప్పిస్తుంద‌ని బీఆర్ఎస్ స‌భ్యులు నిర‌స‌న వ్య‌క్తం చేశారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం కొన‌సాగినంత సేపు బీఆర్ఎస్ స‌భ్యులు స‌భ‌లోనే నిల్చోనే త‌మ నిర‌స‌న వ్య‌క్తం చేశారు.

గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం అనంత‌రం స‌భ రేప‌టికి వాయిదా ప‌డింది. రేపు స‌భ‌లో గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగంపై ధ‌న్య‌వాద తీర్మానం ప్ర‌వేశ‌పెట్టి చ‌ర్చించ‌నున్నారు. మంగళ, బుధవారాల్లో చర్చ అనంతరం తీర్మానాన్ని ఆమోదించనున్నారు. ఈనెల 20న ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అనంత‌రం బ‌డ్జెట్‌పై చ‌ర్చించ‌నున్నారు.

కాగా, ఈ నెల 19న ఉగాది పండుగ కావ‌డంతో స‌భ జ‌రుగ‌దు. మ‌ళ్లీ 20న ఉభయ సభలు సమావేశం కానుండగా, అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్‌ భట్టి విక్రమార్క, మండలిలో శాసనసభా వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఆ తర్వాతి రోజు (మార్చి 21న‌) రంజాన్‌ కావడంతో మళ్లీ 23న సభ ప్రారంభమై వారం రోజుల పాటు జరిగే అవకాశాలున్నాయి. మార్చి 30 లేదా 31న ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు అసెంబ్లీ ఆమోదం తెలుపనున్న‌ట్లు స‌మాచారం.

Advertisement
Advertisement