Forbes Billionaires List 2026 | ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాలు ఇవే.. మూడో స్థానంలో భారత్.. టాప్-10 లిస్ట్ చూడండి!
ఫోర్బ్స్ 2026 బిలియనీర్ల జాబితా విడుదలైంది. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో రికార్డు స్థాయిలో 3,428 మంది కుబేరులు ఉండగా, అందులో సగానికి పైగా కేవలం మూడు దేశాల్లోనే నివసిస్తున్నారు. ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో నిలవగా, చైనా రెండు, మన దేశం మూడో స్థానంలో నిలిచాయి. అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్ 10 దేశాల పూర్తి వివరాలు ఇవే.
International | Published On Mar 16, 2026, 12.22 pm IST
సంక్షిప్త సారాంశం
తాజాగా విడుదలైన ఫోర్బ్స్ 2026 జాబితా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉన్న 3,428 మంది బిలియనీర్లలో 51 శాతం మంది కేవలం మూడు దేశాల్లోనే స్థిరపడటం విశేషం. ఏకంగా 989 మంది కుబేరులతో (ఎలాన్ మస్క్ సహా) అమెరికా అగ్రస్థానంలో నిలవగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగం వృద్ధితో 539 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానాన్ని దక్కించుకుంది. ఇక మన దేశీయ కుబేరుల సంఖ్య 229కి (ముకేశ్ అంబానీ టాప్) చేరడంతో భారత్ ప్రపంచంలోనే సగర్వంగా మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో జర్మనీ (212), రష్యా (147) కుబేరులతో టాప్-5లో చోటు దక్కించుకున్నాయి.
Forbes Billionaires List 2026 | ప్రపంచంలోని అత్యంత ధనవంతులు ఏ దేశంలో నివసిస్తున్నారు? వారి సంపద ఎంత? ఇలాంటి ఆసక్తికరమైన వివరాలతో ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ మ్యాగజైన్ '2026 బిలియనీర్ల జాబితా' (Forbes Billionaires List 2026) ను విడుదల చేసింది. ఈ ఏడాది ఏకంగా 80 దేశాలకు చెందిన 3428 మందితో ఈ జాబితా సరికొత్త రికార్డు సృష్టించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోని మొత్తం బిలియనీర్లలో 51 శాతం మంది కేవలం మూడు దేశాల్లోనే కేంద్రీకృతమై ఉన్నారు. ఆ దేశాలు ఏమిటి? మన భారత్ స్థానం ఎక్కడ ఉందో తెలుసుకుందాం రండి.
అమెరికాదే అగ్రస్థానం
అత్యధిక బిలియనీర్లు ఉన్న దేశాల జాబితాలో అగ్రరాజ్యం అమెరికా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఏకంగా 989 మంది బిలియనీర్లతో అమెరికా నంబర్ వన్ స్థానంలో నిలిచింది. వీరి మొత్తం సంపద విలువ అక్షరాలా 8.4 ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలోని టాప్ 20 కుబేరుల్లో 15 మంది ఇక్కడి వారే కావడం విశేషం. అంతేకాకుండా, 839 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ ఏడాది కొత్తగా 106 మంది ఈ లిస్ట్‌లో చేరగా.. అందులో డాక్టర్ డ్రే, బియోన్సే, టేలర్ స్విఫ్ట్ వంటి ప్రముఖులు ఉన్నారు.
డ్రాగన్ కంట్రీ చైనా.. ఏఐతో అదుర్స్
539 మంది బిలియనీర్లతో (2.2 ట్రిలియన్ డాలర్ల సంపద) చైనా రెండో స్థానంలో నిలిచింది. గతేడాది 495 మంది ఉండగా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), కన్స్యూమర్ గూడ్స్ రంగాల వృద్ధి కారణంగా ఈ ఏడాది ఆ సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ప్రముఖ వీడియో యాప్ టిక్‌టాక్ మాతృసంస్థ బైట్‌డాన్స్ (ByteDance) సహ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ 69.3 బిలియన్ డాలర్ల సంపదతో చైనాలో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.

మూడో స్థానంలో సత్తా చాటిన భారత్
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన మన భారతదేశం ఈ జాబితాలో సగర్వంగా మూడో స్థానంలో నిలిచింది. దేశీయ కుబేరుల సంఖ్య ఏకంగా 229కి చేరుకుంది. వీరి మొత్తం సంపద ఒక ట్రిలియన్ డాలర్లు (గతేడాది ఇది 941 బిలియన్ డాలర్లు). రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ (99.7 బిలియన్ డాలర్లు) భారత్‌లో అత్యంత ధనవంతుడిగా కొనసాగుతున్నారు.
ఇతర దేశాల పరిస్థితి ఎలా ఉందంటే..
జర్మనీ (212 మంది), రష్యా (147 మంది) వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. గతేడాది టాప్-10లో ఉన్న బ్రిటన్ ఈసారి 12వ స్థానానికి పడిపోగా, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగం అండతో తైవాన్ 10వ స్థానంలోకి ఎగబాకింది. ఆసక్తికరంగా, ఏఐ కోడింగ్ టూల్ 'కర్సర్' (Cursor) వ్యవస్థాపకుడు సులేహ్ ఆసిఫ్ (1.3 బిలియన్ డాలర్లు) ఎంట్రీతో పాకిస్థాన్ 2010 తర్వాత మళ్లీ ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. అలాగే, దుబాయ్ బేస్డ్ రియల్ ఎస్టేట్ డెవలపర్ మీర్వాయిస్ అజీజీ (1.4 బిలియన్ డాలర్లు) పుణ్యమా అని ఆఫ్ఘనిస్తాన్ కూడా బిలియనీర్ల ఖాతా తెరిచింది.
అత్యధిక బిలియనీర్లు ఉన్న టాప్-10 దేశాలు (మార్చి 1, 2026 నాటికి)
- అమెరికా (USA): 989 మంది (8.4 ట్రిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: ఎలాన్ మస్క్ (839 బిలియన్ డాలర్లు)
- చైనా (China): 539 మంది (2.2 ట్రిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: ఝాంగ్ యిమింగ్ (69.3 బిలియన్ డాలర్లు)
- భారత్ (India): 229 మంది (1 ట్రిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: ముకేశ్ అంబానీ (99.7 బిలియన్ డాలర్లు)
- జర్మనీ (Germany): 212 మంది (1 ట్రిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: డైటర్ స్క్వార్జ్ (67.2 బిలియన్ డాలర్లు)
- రష్యా (Russia): 147 మంది (649 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: అలెక్సీ మోర్దాషోవ్ అండ్ ఫ్యామిలీ (37 బిలియన్ డాలర్లు)
- ఇటలీ (Italy): 89 మంది (483 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: జియాంకార్లో దేవాసిని (89.3 బిలియన్ డాలర్లు)
- కెనడా (Canada): 82 మంది (457 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: చాంగ్‌పెంగ్ జావో (110 బిలియన్ డాలర్లు)
- హాంకాంగ్ (Hong Kong): 71 మంది (420 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: రాబిన్ జెంగ్ (53.2 బిలియన్ డాలర్లు)
- బ్రెజిల్ (Brazil): 70 మంది (265 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: ఎడ్వర్డో సావెరిన్ (35.9 బిలియన్ డాలర్లు)
- తైవాన్ (Taiwan): 66 మంది (245 బిలియన్ డాలర్లు) - అత్యంత ధనికుడు: టెర్రీ గౌ (15.3 బిలియన్ డాలర్లు)
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు



