త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nayanthara | ఆ రూమ‌ర్లు నిజ‌మ‌నుకున్నా – న‌య‌న్ గ‌తంపై విఘ్నేష్ శివ‌న్ సంచ‌ల‌న కామెంట్స్‌

న‌య‌న‌తార‌తో ప్రేమాయ‌ణం, పెళ్లిపై ఆమె భ‌ర్త విఘ్నేష్ శివ‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. న‌య‌న‌తార ప‌రిచ‌యం కాక‌ముందే ఆమె పాస్ట్ ల‌వ్‌స్టోరీస్ అన్ని నిజ‌మేన‌ని తాను అనుకున్న‌ట్లు చెప్పాడు. వాట్స‌ప్ డీపీతో త‌మ ల‌వ్‌స్టోరీ లీక‌య్యింద‌ని విఘ్నేష్ శివ‌న్ అన్నాడు.

N

Entertainment | Published On Apr 7, 2026, 11.27 am IST

Nayanthara | ఆ రూమ‌ర్లు నిజ‌మ‌నుకున్నా – న‌య‌న్ గ‌తంపై విఘ్నేష్ శివ‌న్ సంచ‌ల‌న కామెంట్స్‌
Advertisement

Nayanthara |  కోలీవుడ్‌లో క్యూట్ క‌పుల్‌గా న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్ జంట పేరు తెచ్చుకుంది. డైరెక్ట‌ర్‌గా న‌య‌న‌తార‌కు ప‌రిచ‌య‌మైన విఘ్నేష్ శివ‌న్ భ‌ర్త‌గా ఆమె జీవితంలోకి ఎంట‌ర‌య్యారు. 2022లో న‌య‌న్‌, విఘ్నేష్ శివన్ పెళ్లి జ‌రిగింది. అప్‌క‌మింగ్ డైరెక్ట‌ర్‌తో స్టార్ హీరోయిన్ అయిన న‌య‌న్ ఏడ‌డుగులు వేయ‌డం అప్పట్లో ద‌క్షిణాది చిత్ర‌సీమ‌లో హాట్‌టాపిక్‌గా మారింది. న‌య‌న‌తార‌తో ప్రేమాయ‌ణం, పెళ్లిపై ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ప్ర‌మోష‌న్స్‌లో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు విఘ్నేష్ శివ‌న్‌. పెళ్లికి ముందు న‌య‌న‌తార బ్రేక‌ప్ స్టోరీల‌పై కూడా రియాక్ట్ అయ్యాడు. వాట్స‌ప్ డీపీతో త‌మ ల‌వ్‌స్టోరీ గురించి జ‌నాల‌కు తెలిసిపోయింద‌ని చెప్పాడు...

మొదటిసారి కలిశా....

"నానుమ్ రౌడీథాన్ మూవీ కోసం హీరోయిన్‌గా న‌య‌న‌తార‌ను అప్రోచ్ అయ్యాను. క‌థ చెప్ప‌డానికి వెళ్లిన‌ప్పుడు మొద‌టిసారి న‌య‌న్‌ను క‌లిశా. న‌య‌న‌తార గురించి అప్ప‌ట్లో ఇండ‌స్ట్రీలో చాలా రూమ‌ర్లు వినిపించేవి. కామ‌న్ ఆడియెన్స్ లాగే నేను కూడా ఆమె ల‌వ్‌స్టోరీస్‌, రిలేష‌న్‌షిప్స్ నిజ‌మేన‌ని అనుకున్నా న‌య‌న్ వ్య‌క్తిత్వాన్ని త‌ప్పుగా అంచ‌నా వేశా. ఆమెతో ప‌రిచ‌యం ఏర్ప‌డిన కొద్ది రోజుల్లోనే నా ఊహలు తప్పని అర్థమైంది. నయన్ గురించి తెలియకుండానే ఆమెపై స‌మాజం త‌ప్పుడు ముద్ర‌లు వేసింది. తీర్పులు ఇచ్చింద‌ని తెలుసుకున్నా. మ‌న‌ల్ని ఇష్ట‌ప‌డే వారికి వివరణ ఇవ్వాల్సిన ప‌నిలేదు. మనల్ని ద్వేషించేవారు నిజాల‌ను చెప్పిన‌ నమ్మరు. నిరూప‌ణ‌ల‌తో ప‌నిలేకుండా న‌చ్చిన‌ట్లుగా జీవితాన్ని గ‌డిపేస్తే చాల‌ని న‌య‌న్ నుంచే నేర్చుకున్నా"  అని విఘ్నేష్ శివ‌న్ అన్నారు.

వాట్సాప్ డీపీతో...

"నానుమ్ రౌడీథాన్ షూటింగ్‌లోనే న‌య‌న్‌తో ప్రేమ‌లో ప‌డ్డా. కొద్ది రోజుల్లోనే ఒక‌రినొక‌రం బాగా అర్థం చేసుకున్నాం. న‌య‌న్ తన వాట్సాప్ డీపీగా మా ఇద్దరి ఫోటో పెట్టుకుంది. అప్పుడే ఫ‌స్ట్ టైమ్ మా ల‌వ్‌స్టోరీ లీక్ అయ్యింది. న‌య‌న్‌తో ప్రేమ విష‌యంలో న‌న్ను చాలా ట్రోల్ చేశారు, సంతోషకరమైన విష‌యాల‌ను పంచుకున్నా విమ‌ర్శించేవారు. అవ‌న్నీ చూసి మొద‌ట్లో చాలా బాధ‌ప‌డ్డా. ఇప్పుడు మాత్రం మేము ఇద్దరం ఆ ట్రోల్స్ చూసి నవ్వుకుంటాం" అని విఘ్నేష్ శివ‌న్ అన్నాడు.

విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ల‌వ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్‌, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టించిన ఈ సినిమాను రౌడీ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌య‌న‌తార స్వ‌యంగా నిర్మించింది.

 

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement