Iran-US | మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు
Iran-US | అమెరికా-ఇరాన్ (Iran-US) దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా భగ్గుమంటోంది. ఇరాన్‌లోని ఖ్వేష్ ద్వీపం (Qeshm Island)పై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది (Iran attacks US bases).
International | Published On Jun 3, 2026, 10.26 am IST
Iran-US | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఓవైపు సంక్షోభానికి ముగింపు పలికేందుకు దోహా వేదికగా కీలక చర్చలు జరుగుతుండగానే.. ఇరాన్-అమెరికా దాడులు, ప్రతిదాడులు చేసుకుంటున్నాయి. ఇరాన్‌లోని ఖ్వేష్ ద్వీపం (Qeshm Island)పై అమెరికా దాడులు చేసింది. ఈ దాడులకు ప్రతిస్పందనగా ఇరాన్ సైతం ప్రతిదాడులకు దిగింది.
బుధవారం ఉదయం కువైట్ (Kuwait), బహ్రెయిన్ (Bahrain)లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. కువైట్‌లోని అలీ అల్ సలేం, బహ్రెయిన్‌లోని ఈసా వైమానిక స్థావాలపై ఇరాన్ దాడులు చేసింది. ఈ దాడులతో కువైట్‌లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ఆ దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. టెహ్రాన్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ రక్షణ వ్యవస్థ అడ్డుకుందని కువైట్ ఆర్మీ ప్రకటించింది.
బహ్రెయిన్‌లో సైరన్‌ల మోత..
మరోవైపు ఇరాన్ దాడులతో బహ్రెయిన్‌లోనూ పెద్ద ఎత్తున సైరన్‌లు మోగాయి. తాజా దాడుల నేపథ్యంలో ఆ దేశ సైన్యం అప్రమత్తమైంది. పౌరులు, నివాసితులు ఎవరూ ఆందోళన చెందొద్దని సూచించింది. అధికారులు చెప్పే భద్రతా సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని తెలిపింది.
ఆత్మరక్షణ కోసమే..
ఇక అమెరికా వైమానిక స్థావరాలపై విజయవంతంగా దాడి చేసినట్లు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించింది. అయితే ఐఆర్‌జీసీ ప్రకటనను అమెరికా తోసిపుచ్చింది. ఇరాన్ క్షిపణులు తమ నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. తమ MQ-1 డ్రోన్‌ను కూల్చివేసిన నేపథ్యంలో ఆత్మరక్షణ కోసమే ఖ్వేష్ ద్వీపం దాడులు చేసినట్లు వెల్లడించింది.
Also Read..
ఒకదానికొకటి ఢీకొన్న మూడు డీసీఏంలు.. గొర్రెల కాపరి మృతి
విశాఖలో రోడ్డు ప్రమాదం.. తీవ్రగా గాయపడిన కొరియోగ్రాఫర్ పండు మాస్టర్
అపజయం కూడా అగ్నిజ్వాలై మండుతుందో.. అదే నా రస్తా: పవన్ కల్యాణ్
సంబంధిత వార్తలు

Kuwait Airport Attack | కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ భీకర దాడి.. భారతీయుడు మృతి, నిలిచిన విమాన సేవలు
జూన్ 3, 2026

Iran War | 20కిపైగా సైనిక స్థావరాలు ధ్వంసం.. ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం
జూన్ 1, 2026

US Strikes | మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ స్థావరాలపై అమెరికా ఆత్మరక్షణ దాడులు
జూన్ 1, 2026
తాజావార్తలు
- ●Harish Rao | యూకేలో హరీశ్‌రావు జన్మదిన వేడుకలు
- ●Excellence Awards | నేర దర్యాప్తులో ప్రతిభకు గుర్తింపు.. తొలిసారిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డులు
- ●Pavan Kalyan | కేటీఆర్ నాకు బ్రదరే.. ఆయన తప్పుగా మాట్లాడరు : పవన్ కళ్యాణ్
- ●Telangana-Germany Partnership | తెలంగాణ-జర్మనీ మధ్య కీలక ఒప్పందం.. పెట్టుబడులకు ముందుకువచ్చిన తురింగియా..!
- ●Tummala Nageshwar Rao | తెలంగాణ - టరాబా రాష్ట్రాల మధ్య "సిస్టర్ స్టేట్" భాగస్వామ్యం : మంత్రి తుమ్మల
- ●Tadoba Tiger Reserve | 3 నెలల పాటు తడోబా టైగర్ రిజర్వ్ మూసివేత

Harish Rao | యూకేలో హరీశ్‌రావు జన్మదిన వేడుకలు

Excellence Awards | నేర దర్యాప్తులో ప్రతిభకు గుర్తింపు.. తొలిసారిగా హైదరాబాద్ సిటీ పోలీస్ ఎక్సలెన్స్ అవార్డులు

Pavan Kalyan | కేటీఆర్ నాకు బ్రదరే.. ఆయన తప్పుగా మాట్లాడరు : పవన్ కళ్యాణ్

Telangana-Germany Partnership | తెలంగాణ-జర్మనీ మధ్య కీలక ఒప్పందం.. పెట్టుబడులకు ముందుకువచ్చిన తురింగియా..!



