Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ – సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
విశ్వనాథ్ అండ్ సన్స్ కంటే ముందు సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. అచలుడు పేరుతో తెరకెక్కాల్సిన ఈ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నర్ బాలా దర్శకత్వం వహించారు. నలభై రోజుల పాటు షూటింగ్ జరిగిన తర్వాత ఈ మూవీ ఆగిపోయింది. అందుకు కారణమేమిటంటే...
Entertainment | Published On Aug 20, 2026, 11.18 am IST
Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో రూపొందిన విశ్వనాథ్ అండ్ సన్స్ బ్టాక్‌బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఏడు రోజుల్లోనే 200 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. సూర్య, మమితా బైజు యాక్టింగ్‌తో పాటు ఎలాంటి అశ్లీలత, అసభ్యత లేకుండా క్లీన్ ఫ్యామిలీ మూవీగా దర్శకుడు ఈ సినిమాను రూపొందించిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నలభై ఏళ్ల వ్యక్తితో ఇరవై ఏళ్ల యువతి ప్రేమలో పడటం అనే కాన్సెప్ట్‌తో దర్శకుడు వెంకీ అట్లూరి ఈ సినిమాను రూపొందించారు. ఏజ్ గ్యాప్ ఇష్యూను ఫన్నీగా సినిమాలో చూపించాడు.
నేషనల్ అవార్డ్ విన్నర్....
విశ్వనాథ్ అండ్ సన్స్ కంటే ముందు సూర్య, మమితా బైజు కాంబినేషన్‌లో ఓ సినిమా రావాల్సింది. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నర్ డైరెక్టర్‌గా వ్యవహరించారు. సూర్య స్వయంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. నలభై రోజుల పాటు షూటింగ్ జరిగిన తర్వాత అవుట్‌పుట్ విషయంలో సూర్య అసంతృప్తిని వ్యక్తం చేస్తూ సినిమా నుంచి తప్పుకున్నారు.
మమితా బైజు హీరోయిన్...
ఆ సినిమానే వనంగాన్. ఈ మూవీకి నేషనల్ అవార్డ్ విన్నర్ బాలా దర్శకత్వం వహించారు. సూర్య హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో ఈ మూవీని అనౌన్స్ చేశారు. మమితా బైజు, కృతిశెట్టిలను హీరోయిన్లుగా తీసుకున్నారు. తెలుగులోనూ అచలుడు పేరుతో ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. కొద్ది రోజులు ఈ సినిమా షూటింగ్‌లో మమితా బైజు పాల్గొన్నది. షూటింగ్‌లో దర్శకుడు తనను కొట్టాడంటూ ఆరోపణలు చేస్తూ మమితా బైజు ఈ సినిమా నుంచి తప్పుకుంది. షూటింగ్‌లో సరిగ్గా డ్యాన్స్ చేయలేదని అందరి ముందు తనను తిట్టాడని మమితా బైజు చేసిన కామెంట్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. సూర్యకు ఈ విషయం తెలిసినా తనను సపోర్ట్ చేయలేదని మమితా బైజు ఆరోపణలు చేయడం చర్చనీయాంశమయ్యాయి.
మరో హీరోతో...
మమితా బైజు వనంగాన్ నుంచి తప్పుకున్న కొద్ది రోజులకే సూర్య కూడా ఈ సినిమాను ఆపేస్తున్నట్లు ప్రకటించాడు. సూర్య నిర్ణయంతో హర్ట్ అయిన డైరెక్టర్ బాలా అప్పటివరకు తీసిన నలభై రోజుల ఫుటేజ్‌ను పక్కనపెట్టి మరో హీరో అరుణ్ విజయ్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు. తానే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించాడు. కానీ కమర్షియల్‌గా ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది.
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..
- ●Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?
- ●‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..
- ●Helicopter Crash | కెన్యాలో హెలికాప్టర్ ప్రమాదం.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్ సహా ఏడుగురు దుర్మరణం
- ●Harish Rao | మంత్రి పొంగులేటిని వెంటనే బర్తరఫ్ చేయండి.. రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.43వేలు పెరిగిన పసిడి ధర.. పెట్టుబడిదారుల్లో కొనుగోళ్ల ఉత్సాహం..

Knowledge Corner | ఉద్యోగార్థుల కోసం హైదరాబాద్‌లో ఫ్రీ నాలెడ్జ్ కార్నర్.. ఎక్కడ ఉందంటే?

‘సురేఖ’ సైలెంట్.. సుష్మిత యాక్టివ్: కాంగ్రెస్‌లో క్లైమాక్స్ చేరిన పరకాల పంచాయితీ!

Stock Markets | స్టాక్ మార్కెట్లలో మళ్లీ జోష్.. 7 రోజుల నష్టాలకు బ్రేక్..






