త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IIT Madras | ఐఐటీ మ‌ద్రాస్‌లో మెడిసిన్‌.. ఇంజినీర్ల‌తోపాటు వైద్యులు కూడా..

IIT Madras | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలో ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యా సంస్థల్లో ఒక‌టైన‌ ఐఐటీ మ‌ద్రాస్ (IIT Madras) నిపుణులైన డాక్ట‌ర్ల‌ను త‌యారుచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఇంజినీరింగ్ (Engineering) కోర్సుల‌కు ప్ర‌సిద్ధి చెందిన ఈ విద్యా సంస్థ.. త‌న‌ 70 ఏండ్ల చ‌రిత్ర‌లో తొలిసారిగా వైద్య విద్యలో కోర్సుల‌ను (Medical Sciences) ప్రారంభించ‌నుంది.

G

National | Published On Aug 20, 2026, 11.22 am IST

IIT Madras | ఐఐటీ మ‌ద్రాస్‌లో మెడిసిన్‌.. ఇంజినీర్ల‌తోపాటు వైద్యులు కూడా..
Advertisement

IIT Madras | త్రినేత్ర‌.న్యూస్‌: దేశంలోనే అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌క విద్యా సంస్థల్లో ఒక‌టైన‌ ఐఐటీ మ‌ద్రాస్ (IIT Madras) నిపుణులైన డాక్ట‌ర్ల‌ను త‌యారుచేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ది. ఇప్ప‌టివ‌ర‌కు ఇంజినీరింగ్ (Engineering) కోర్సుల‌కు ప్ర‌సిద్ధి చెందిన ఈ విద్యా సంస్థ.. త‌న‌ 70 ఏండ్ల చ‌రిత్ర‌లో తొలిసారిగా పూర్తిస్థాయిలో వైద్య విద్యలో కోర్సుల‌ను (Medical Sciences) ప్రారంభించ‌నుంది. ఇప్ప‌టికే వైద్యం, ఇంజినీరింగ్‌ల‌ను జోడించి ఎక్స‌లెన్స్ అండ్ ఇంట‌ర్ డిసిప్లిన‌రీ విధానంలో నాలుగేండ్ల బీఎస్ (BS) ఇన్ మెడిక‌ల్ సైన్సెస్ అండ్ ఇంజినీరింగ్ కోర్సును అందిస్తున్న‌ది. తాజాగా వైద్య శాస్త్రాల విభాగాన్ని ప్రారంభించి, వైద్య డిగ్రీల‌ను ప్ర‌దానం చేయ‌నుంది. ఇందులో భాగంగా మెడిక‌ల్ స్కూల్‌ను (School of Medical Sciences) ప్రారంభించ‌నుంది. ఈ మేర‌కు ఐఐటీ మ‌ద్రాస్ డైరెక్ట‌ర్ ప్రొఫెసర్‌ వీ. కామకోటి (Prof. V. Kamakoti) వెల్ల‌డించారు. వైద్య‌శాస్త్రంలో అండ‌ర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ (MBBS), పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎండీ, డాక్టోర‌ల్ పీహెచ్‌డీ వంటి డిగ్రీలు ఇవ్వ‌నున్నామ‌ని చెప్పారు.

2023లో దేశంలోనే మొద‌టిసారిగా వైద్య శాస్త్రాల కోర్సుల్లో సాంకేతిక విభాగాన్ని ఐఐటీ మ‌ద్రాస్ ప్రారంభించిన విష‌యం తెలిసిందే. ఈ కోర్సు పూర్తి చేస్తే సగం డాక్టర్‌ అయిపోయినట్టే. వైద్య రంగంలో రోబోలు, ఇతర సాంకేతిక వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ కోర్సుకు రూపకల్పన చేసింది. భ‌విష్య‌త్తులో భార‌త్‌ నుంచి ఒక నోబెల్‌ గ్రహీతను తయారుచేయడమే లక్ష్యంగా ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నాలుగేండ్ల అండ‌ర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ద్వారా హైబ్రీడ్ శిక్ష‌ణ ఇస్తున్న‌ది. ఈ కోర్సులో చేరిన వారు కొంత ఇంజినీర్ (Engineer), కొంత జీవ‌శాస్త్ర‌వేత్త (Biologist). రోగుల‌కు చికిత్స చేయ‌డానికి కాకుండా స్కాన‌ర్లు, ఇంప్లాంట్లు, సాఫ్ట్‌వేర్‌ల‌ను రూపించాడానికి వీరిని త‌యారు చేస్తున్నారు. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా డాక్ట‌ర్ల‌ను కూడా త‌యారు చేయ‌డానికి ఐఐటీ మ‌ద్రాస్ సిద్ద‌మైంది.

Advertisement
Advertisement