Anchor Charmilla | బిగ్‌బాస్ 10లోకి ఛర్మిల – రూమర్లపై తెలుగు యాంకర్ క్లారిటీ
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10లో ఎంట్రీ ఇవ్వనున్న సెలిబ్రిటీలు ఎవరన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. పలువురు టీవీ, సినిమా సెలిబ్రిటీల పేర్లు ప్రచారం జరుగుతోంది. ఈ లిస్ట్‌లో యాంకర్ ఛర్మిల కూడా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ రూమర్లపై యాంకర్ ఛర్మిల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.
Entertainment | Published On Aug 20, 2026, 11.56 am IST
Anchor Charmilla | బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ సెకండ్ వీక్ నుంచి మొదలుకాబోతుంది. ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొనే సెలిబ్రిటీలు ఎవరన్నది అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. పలువురు యాంకర్లు, టీవీ, సినిమా యాక్టర్ల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అందులో తెలుగు యాంకర్ ఛర్మిల కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హయ్యెస్ట్ రెమ్యూనరేషన్‌తో ఈ యాంకర్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టనున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్...
ఈ బిగ్‌బాస్ రూమర్లపై యాంకర్ ఛర్మిల ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఈ వార్తల్లో నిజం లేదని చెప్పింది. నేను బిగ్‌బాస్ 10లో పార్టిసిపేట్ చేయనున్నట్లు, హౌజ్‌లోకి అడుగుపెట్టబోతున్నట్లు వస్తోన్న వార్తలన్నీ ఫేక్. అవన్నీ పుకార్లే. నేను బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. ఛర్మిల బిగ్‌బాస్‌లో పాల్గొనబోతున్నట్లు ఓ మీడియా సంస్థ రాసిన ఆర్టికల్‌ను ఈ పోస్ట్‌కు జోడించింది. ఫేక్ న్యూస్ అంటూ వెల్లడించింది. ఆమె ఇన్‌స్టా స్టోరీ వైరల్ అవుతోంది.
అల్లు అరవింద్..ఎంఎస్ రాజు...
గత కొద్ది రోజులుగా ప్రతి సినిమా ఈవెంట్‌కు చర్మిలానే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. గ్లామర్‌లో హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. అల్లు అరవింద్, ఎం.ఎస్ రాజు లాంటి సీనియర్ ప్రొడ్యూసర్లు సినిమా ఈవెంట్‌లలో ఛర్మిలకు హీరోయిన్‌గా ఆఫర్లు ఇస్తామంటూ అనౌన్స్‌చేయడం ఆసక్తికరంగా మారింది. వీరి ప్రకటనలతో ఛర్మిల ఫాలోయింగ్ భారీగా పెరిగింది. త్వరలోనే హీరోయిన్‌గా ఆ బ్యూటీ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
బిగ్‌బాస్ అగ్ని పరీక్ష...
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షోకు మరోసారి హోస్ట్‌గా హీరో నాగార్జున వ్యవహరించబోతున్నారు. ఈ సారి కూడా కామన్ మ్యాన్స్‌తో పాటు కొందరు సెలిబ్రిటీలు హౌజ్‌లో అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం కామన్ మ్యాన్స్ కోసం బిగ్‌బాస్ అగ్ని పరీక్ష జరుగుతోంది. ఇందులో నుంచి ఐదుగురు బిగ్‌బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తారు.

ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం
- ●US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..
- ●Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు
- ●IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..
- ●Mamitha Baiju | సూర్య, మమితా బైజు కాంబోలో అచలుడు మూవీ - సగం షూటింగ్ తర్వాత ఎందుకు ఆగిపోయిందంటే?
- ●Pak High Commission | దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వెలుపల కూల్చివేతలు

Konda Susmitha | సీఎం కాలిగోటికి కూడా సరిపోవు.. కొండా సుస్మితపై వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆగ్రహం

US Debt | పీకల్లోతు అప్పుల్లో అమెరికా.. 40 ట్రిలియన్ డాలర్లకు చేరిన ప్రభుత్వ రుణం..

Rajiv Gandhi | రాజీవ్ గాంధీకి నేతల నివాళులు

IIT Madras | ఐఐటీ మద్రాస్‌లో మెడిసిన్.. ఇంజినీర్లతోపాటు వైద్యులు కూడా..





