Iran-US review ceasefire plan | కాల్పుల విరమణ ప్రణాళికను సమీక్షిస్తున్న అమెరికా-ఇరాన్.. యుద్ధం ముగిసేనా..?
Iran-US review ceasefire plan | పశ్చిమాసియా సంక్షోభాన్ని(Iran War) ఆపేందుకు ఈజిప్ట్, పాకిస్థాన్, తుర్కియే దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగింపు పలికే లక్ష్యంతో ఓ కీలక ప్రతిపాదనను తెచ్చాయి.
International | Published On Apr 6, 2026, 4.09 pm IST
Iran-US review ceasefire plan | పశ్చిమాసియా సంక్షోభాన్ని(Iran War) ఆపేందుకు ఈజిప్ట్, పాకిస్థాన్, తుర్కియే దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా మధ్యప్రాచ్యంలో యుద్ధం ముగింపు పలికే లక్ష్యంతో ఓ కీలక ప్రతిపాదనను తెచ్చాయి. ఈ ముసాయిదా ప్లాన్‌ను అమెరికా, ఇరాన్‌కు అందించినట్లు సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది.
ఈ ప్రతిపాదనలో 45 రోజులపాటూ తక్షణ కాల్పుల విరమణ, హర్మూజ్‌ను తెరవడం వంటి ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ప్రణాళికను రెండు దేశాలూ పరిశీలిస్తున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. ఈ సీజ్‌ఫైర్ ప్లాన్‌పై చర్చించేందుకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగాచి, పశ్చిమాసియా దౌత్యవేత్త స్టీవ్ విట్‌కాఫ్‌తో పాకిస్థాన్ సైన్యాధిపతి అసిమ్ మునీర్ రాత్రంతా నిరంతరం సంప్రదింపులు జరిపినట్లు రాయిటర్స్ నివేదించింది.
ప్రస్తుత సంక్షోభాన్ని తాత్కాలికంగా ముగించి, చర్చలకు మార్గం సుగమం చేయడమే ఈ సీజ్‌ఫైర్ ప్లాన్ ముఖ్య ఉద్దేశం. అమెరికా, ఇరాన్‌లు పరస్పర దాడులు చేసుకోకుండా 45 రోజుల పాటు సంమయనం పాటించాలి. ఈ గడువులోగా ఇరు దేశాల ప్రతినిధులు వివాదాస్పద అంశాలపై ముఖాముఖి చర్చలు జరిపి శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాల్సి ఉంటుంది. అయితే తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్, అమెరికా అంగీకరిస్తాయా..? లేదా..? అన్న అంశంపై క్లారిటీ లేదు. ఈ ప్రతిపాదనపై ఇరు దేశాలూ సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇదే జరిగితే నెలరోజులకుపైగా సాగుతున్న యుద్ధానికి బ్రేక్ పడే అవకాశం ఉంది.
ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ హతం..
ఓవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనపై చర్చలు సాగుతున్నప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు. సోమవారం తెల్లవారుజామున టెహ్రాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా భీకర దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ చీఫ్ (IRGC Intelligence Chief) మజీద్ ఖాదేమీ (Majid Khademi) హతమయ్యారు. ఈ విషయాన్ని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ధృవీకరించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. కానీ, ఆయన ఎప్పుడు, ఎక్కడ మరణించారన్న వివరాలు మాత్రం ఐఆర్‌జీసీ వెల్లడించలేదు. టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లోని నివాస సముదాయాలపై జరిగిన వైమాని దాడుల్లో ఆయన మరణించి ఉంటారని అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది.
Also Read..
అయోధ్యలో మరో అద్భుత ఘట్టం.. శ్రీరామ యంత్రం ప్రతిష్ట.. దీని ప్రత్యేకతేంటంటే..?
ఇరాన్‌తో వార్.. రూ.931 కోట్ల విలువైన తమ విమానాన్ని స్వయంగా పేల్చేసిన అమెరికా.. ఎందుకంటే..?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

US Senate | ఇరాన్‌పై యుద్ధం.. ట్రంప్ దూకుడుకు అమెరికా సెనేట్ బ్రేక్
మే 20, 2026

Barakah nuclear facility | ప్రమాదకర పరిణామం.. యూఏఈలోని బరాకా అణు విద్యుత్ కేంద్రంపై దాడిని ఖండించిన భారత్
మే 18, 2026

PM Modi | ఇది 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ పాలన వైఫల్యానికి నిదర్శనం.. ప్రధాని పొదుపు సూచనలపై విపక్షాలు ఫైర్
మే 11, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



