Donlad Trump | నేను జోక్యం చేసుకోవచ్చు.. కానీ : పాక్-ఆఫ్ఘాన్ యుద్ధంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
Donlad Trump | పాకిస్థాన్-ఆఫ్ఘానిస్థాన్ మధ్య బహిరంగ యుద్ధంపై (Pakistan- Afghanistans Open War) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆఫ్ఘాన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన పాక్‌పై (Pakistan- Afghanistans Open War) ప్రశంసలు కురిపించారు.
International | Published On Feb 28, 2026, 10.21 am IST
Donlad Trump | వివాదాస్పద డ్యురాండ్ సరిహద్దు వివాదం నేపథ్యంలో తాలిబన్ పాలిత ఆఫ్ఘానిస్థాన్‌పై పాకిస్థాన్ బహిరంగ యుద్ధం (Open War) ప్రకటించిన విషయం తెలిసిందే. కాబూల్ సహా పలు నగరాలపై విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donlad Trump) తాజాగా స్పందించారు. ఈ మేరకు ఆఫ్ఘాన్‌పై యుద్ధాన్ని ప్రకటించిన పాక్‌పై (Pakistan- Afghanistans Open War) ప్రశంసలు కురిపించారు. ఆ దేశ ప్రధాని, ఆర్మీ జనరల్ గొప్ప నాయకులు అంటూ అభివర్ణించారు.
అదేసమయంలో పాక్-ఆఫ్ఘాన్ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ట్రంప్ నిరాకరించారు. "రెండు దేశాల మధ్య నెలకొన్న వివాదంలో నేను జోక్యం చేసుకోవచ్చు. ఆ అవకాశం నాకు ఉన్నప్పటికీ అలా చేయను. ఎందుకంటే అక్కడ గొప్ప ప్రధాని ఉన్నారు. గొప్ప ఆర్మీ జనరల్ ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని నేను చాలా గౌరవిస్తాను. పాకిస్థాన్ అద్భుతంగా పనిచేస్తోందని నేను భావిస్తున్నాను" అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
పాక్ బహిరంగ యుద్ధం
ఇటీవల తమపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్‌లపై ఆఫ్ఘాన్ సైనిక చర్యను ప్రారంభించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్ మిలిటరీ పదేపదే పాల్పడే కవ్వింపు చర్యలు, ఉల్లంఘనలకు సమాధానంగా వివాదాస్పద డ్యురాండ్ రేఖ వెంబడి పెద్దఎత్తున ప్రతీకార దాడులు చేపట్టింది. ఈ దాడులకు ప్రతీకారంగా పాక్ తాజాగా ఆఫ్ఘాన్‌పై యుద్ధం మొదలు పెట్టింది. ఆపరేషన్ గజబ్ లిల్ హక్ (Operation Ghazab Lil Haq) పేరుతో దాడులను ప్రారంభించింది.
ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్ (Kabul)పై పాక్ దళాలు విరుచుపడుతున్నాయి. కాందహార్, పాక్టియాలోని మిలిటరీ బేస్‌లపై పాక్ సేన విరుచుకుపడుతోంది. ఇప్పటికే అనేక ఆర్మీ పోర్టులను ధ్వంసం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ దాడుల్లో 297 మంది ఆఫ్ఘాన్ తాలిబన్ మిలిటెంట్లు హతమైనట్లు పాక్ ప్రభుత్వం ప్రకటించింది.
Also Read..
Bolivian Military Plane Crashes | కరెన్సీ నోట్లు తరలిస్తుండగా కూలిన విమానం.. 15 మంది మృతి
ChatGPT Health | ఆరోగ్య సూచనల కోసం ఏఐని వాడొద్దు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
సంబంధిత వార్తలు

UNSC | మీరా మా గురించి మాట్లాడేది..? పాక్ నరమేధాన్ని తీవ్రంగా ఎండగట్టిన భారత్
మే 21, 2026

Upendra Dwivedi | ప్రపంచ పటంలో ఉండాలో లేదో వారే నిర్ణయించుకోవాలి.. పాక్‌కు ఆర్మీచీఫ్ వార్నింగ్
మే 16, 2026

KTR | లోక్‌సభలో బీఆర్ఎస్ సభ్యులుంటే తేజస్వి సూర్యతో క్షమాపణ చెప్పించేవాళ్లం : కేటీఆర్
ఏప్రిల్ 27, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



