త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bolivian Military Plane Crashes | క‌రెన్సీ నోట్లు త‌ర‌లిస్తుండ‌గా కూలిన విమానం.. 15 మంది మృతి

Bolivian Military Plane Crashes | బొలీవియా (Bolivia)లో ఘోర విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. సెంట్ర‌ల్ బ్యాంక్ నుంచి క‌రెన్సీ నోట్ల‌ను త‌ర‌లిస్తున్న ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్ కూలిపోయింది (Bolivian Military Plane Crashes).

D

International | Published On Feb 28, 2026, 9.57 am IST

Bolivian Military Plane Crashes | క‌రెన్సీ నోట్లు త‌ర‌లిస్తుండ‌గా కూలిన విమానం.. 15 మంది మృతి
Advertisement

Bolivian Military Plane Crashes | బొలీవియా (Bolivia)లో ఘోర విమాన ప్ర‌మాదం చోటు చేసుకుంది. సెంట్ర‌ల్ బ్యాంక్ నుంచి క‌రెన్సీ నోట్ల‌ను త‌ర‌లిస్తున్న ఎయిర్‌ఫోర్స్ ఫ్లైట్ కూలిపోయింది (Bolivian Military Plane Crashes). ఈ ఘ‌ట‌న‌లో సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. బొలీవియా రాజ‌ధాని లా పాజ్ (La Paz) స‌మీపంలోని ఎల్ ఆల్టో న‌గ‌రంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

బొలీవియన్ వైమానిక దళానికి చెందిన హెర్క్యులస్ C-130 విమానం (Hercules C-130 plane) శాంటాక్రూజ్ నుంచి కొత్తగా ముద్రించిన కరెన్సీ నోట్లను (Plane Carrying Banknotes) తీసుకుని.. ఎల్ ఆల్టో (El Alto) విమానాశ్రయానికి బయల్దేరింది. అయితే, ఆ స‌మ‌యంలో ప్ర‌తికూల వాతావ‌ర‌ణ ప‌రిస్థితుల కార‌ణంగా ల్యాండింగ్ స‌మ‌యంలో విమానం ర‌న్‌వేపై జారీ సమీపంలోని పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ క్ర‌మంలో రోడ్డుపై ఉన్న ప‌లు వాహ‌నాల‌ను ఢీ కొట్టింది. అనంత‌రం విమానం నుంచి మంట‌లు చెల‌రేగాయి. ఈ ఘ‌ట‌న‌లో 15 మంది మ‌ర‌ణించ‌గా.. సుమారు 30 మంది గాయ‌ప‌డ్డారు.

బొలీవియన్ వైమానిక దళం జనరల్ సెర్గియో లోరా ప్ర‌కారం.. ప్ర‌మాద స‌మ‌యంలో విమానంలో ఆరుగురు సిబ్బంది ఉన్నారు. మృతుల్లో విమానంలో ఉన్నవారితో పాటు రోడ్డుపై వెళ్తున్న సాధారణ ప్రజలు కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకొని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘ‌ట‌న‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రోవైపు ఈ ఘ‌ట‌న‌పై బొలీవియ‌న్ అధికారులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Also Read..

Holi Health Tips | హోలీ వేడుక‌ల్లో నీటితో జాగ్ర‌త్త‌.. వ్యాధులు ప్ర‌బ‌లే అవ‌కాశం.. వైద్యుల సూచ‌న‌లు..

ChatGPT Health | ఆరోగ్య సూచ‌న‌ల కోసం ఏఐని వాడొద్దు.. వైద్య నిపుణుల హెచ్చ‌రిక‌..

Inter Student | ఇంట‌ర్ ప‌రీక్ష‌కు వెళ్లి.. మృత శిశువుకు జ‌న్మ‌నిచ్చిన విద్యార్థిని

Advertisement
Advertisement