ChatGPT Health | ఆరోగ్య సూచనల కోసం ఏఐని వాడొద్దు.. వైద్య నిపుణుల హెచ్చరిక..
ChatGPT Health | యూజర్లకు ఆరోగ్యంపై సమాచారం అందించేందుకు ఓపెన్ఏఐ అందుబాటులోకి తెచ్చిన చాట్ జీపీటీ హెల్త్ పట్ల వైద్య నిపుణుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నేచర్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చాలా వరకు అత్యవసర కేసులను కూడా చాట్ జీపీటీ హెల్త్ అత్యవసరం కానివిగా పేర్కొంది.
ChatGPT Health | యూజర్లకు ఆరోగ్యంపై సమాచారం అందించేందుకు ఓపెన్ఏఐ అందుబాటులోకి తెచ్చిన చాట్ జీపీటీ హెల్త్ పట్ల వైద్య నిపుణుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నేచర్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం చాలా వరకు అత్యవసర కేసులను కూడా చాట్ జీపీటీ హెల్త్ అత్యవసరం కానివిగా పేర్కొంది. ఈ మేరకు మౌంట్ సినాయ్‌లోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన డాక్టర్ అశ్విన్ రామస్వామి నేతృత్వంలోని వైద్య నిపుణుల బృందం చాట్ జీపీటీ హెల్త్‌పై అధ్యయనం నిర్వహించింది. చాట్ జీపీటీ హెల్త్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఎ స్ట్రక్చర్డ్ టెస్ట్ ఆఫ్ ఎ ట్రయాజ్ రికమండేషన్స్ పేరిట ఈ బృందం అధ్యయనం నిర్వహించగా దీన్ని ఆన్‌లైన్‌లోనూ తాజాగా ప్రచురించారు. ఈ క్రమంలోనే చాట్ జీపీటీ అందిస్తున్న వైద్య సమాచారంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు.
అత్యవసర కేసుల్లో ఏఐ తప్పు సూచనలు..
ఈ అధ్యయనంలో భాగంగా వైద్య నిపుణులు మొత్తం 21 వైద్య విభాగాల నుంచి 60 క్లినికల్ విగ్నెట్స్‌ను ఎంపిక చేశారు. వీటిని 16 రకాలుగా వేర్వేరు పరిస్థితుల్లో పరీక్షించి మొత్తం 960 రెస్పాన్స్‌లను విశ్లేషించారు. చాట్ జీపీటీ హెల్త్ ఆయా అత్యవసర స్థితుల్లో ఎంత సమర్థవంతంగా సమాచారం అందిస్తుందో వారు ఆ రెస్పాన్స్‌ల ద్వారా తెలుసుకున్నారు. ఈ క్రమంలో చాట్ జీపీటీ హెల్త్ ఇన్వర్టెడ్ U-షేప్ రీతిలో పనితీరును కనబరిచిందని అధ్యయనంలో తేల్చారు. మోస్తరు తీవ్రత కలిగిన కేసుల్లో సరైన సూచనలు ఇచ్చినప్పటికీ, అత్యంత తీవ్రత లేదా అత్యల్ప తీవ్రత కలిగిన కేసుల్లో మాత్రం ఏఐ చాలా తప్పుగా సూచనలు ఇచ్చిందని నిర్దారించారు. స్ట్రోక్, అలర్జీ వంటి సంప్రదాయ అత్యవసర పరిస్థితులను ఏఐ సరిగ్గా గుర్తించిందని, కానీ గోల్డ్ స్టాండర్డ్ అత్యవసర కేసుల్లో 52 శాతం సందర్భాల్లో మాత్రం పొరపాటు చేసిందని, వాటిని తక్కువ అత్యవసర కేసులుగా చెప్పిందని వైద్య నిపుణులు వెల్లడించారు.
ఏఐతో జాగ్రత్త..
డయాబెటిక్ కీటోఅసిడోసిస్ (ప్రాణాపాయ పరిస్థితి), శ్వాసకోశ వైఫల్యం ప్రారంభ దశ వంటి అత్యవసర పరిస్థితులను చాట్ జీపీటీ హెల్త్ అత్యవసరమైనవిగా గుర్తించలేదని వారు తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా హాస్పిటల్‌లో ఐసీయూలో చికిత్స అందిస్తారని, కానీ ఏఐ మాత్రం 24-48 గంటల్లోగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించిందని తెలిపారు. ఇక ఆత్మహత్య ఆలోచనలు ఉన్న 988 క్లినికల్ విగ్నెట్‌లలోనూ ఏఐ సరిగ్గా రెస్పాన్స్‌లను ఇవ్వలేదని అన్నారు.
ఈ అధ్యయనం వల్ల తేలిందేమిటంటే ప్రజలు అత్యవసర వైద్య పరిస్థితి ఉందని భావించినా లేదా సాధారణ చికిత్స, ఆరోగ్య సలహాలు, డైట్ ప్లాన్ కోసం అయినా సరే హాస్పిటల్‌కు వెళ్లాలి. కానీ ఏఐని ఉపయోగించకూడదు. అది అన్ని సందర్భాల్లోనూ కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వడం లేదు. కనుక ఏఐ ద్వారా ఆరోగ్య సూచనలు తీసుకుంటే ఇబ్బందులు కలుగుతాయని, ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






