త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Manvitha Reddy | ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లి.. క్యాన్స‌ర్‌తో న‌ల్ల‌గొండ యువ‌తి మృతి

Manvitha Reddy | త్రినేత్ర న్యూస్‌: ఉన్న‌త చ‌దువు కోసం అమెరికా (USA) వెళ్లిన న‌ల్ల‌గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌లానికి చెందిన యువ‌తి (Manvitha Reddy) మృతిచెందింది. గొంతు నొప్పితో హాస్పిట‌ల్‌లో చేరిన ఆమెకు వైద్యులు క్యాన్స‌ర్‌గా (Cancer) నిర్ధారించారు.

G

Telangana | Published On Oct 3, 2026, 9.49 am IST

Manvitha Reddy | ఉన్న‌త చ‌దువుల కోసం అమెరికా వెళ్లి.. క్యాన్స‌ర్‌తో న‌ల్ల‌గొండ యువ‌తి మృతి
Advertisement

Manvitha Reddy | త్రినేత్ర న్యూస్‌: ఉన్న‌త చ‌దువు కోసం అమెరికా (USA) వెళ్లిన న‌ల్ల‌గొండ జిల్లా వేముల‌ప‌ల్లి మండ‌లానికి చెందిన యువ‌తి (Manvitha Reddy) మృతిచెందింది. గొంతు నొప్పితో హాస్పిట‌ల్‌లో చేరిన ఆమెకు వైద్యులు క్యాన్స‌ర్‌గా (Cancer) నిర్ధారించారు. దీంతో నెల‌ రోజుల పాటు క్యాన్స‌ర్‌తో పోరాడిన ఆమె గురువారం మ‌ర‌ణించారు.

మేముల‌ప‌ల్లి (Vemulapally) మండ‌లం మొల్క‌ప‌ట్నం గ్రామానికి చెందిన కందిమ‌ల్ల‌ ల‌క్ష్మారెడ్డి, ప‌ద్మ దంప‌తుల‌కు ఇద్ద‌రు కుమార్తెలు. పిల్ల‌ల చ‌దువుల కోసం ప‌దేండ్ల క్రిత‌మే హైద‌రాబాద్ వ‌చ్చిన వారు.. ఇక్క‌డే స్థిర‌ప‌డ్డారు. పెద్ద కూతురు మాల‌తి వివాహం చేశారు. బీటెక్ పూర్తి చేసిన ఆమె ప్ర‌స్తుతం ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న కుమార్తె మాన్వితరెడ్డి (26) 2023లో బీఫార్మసీ పూర్తి చేసింది. అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లింది. అక్కడ ఎంఎస్‌ పూర్తిచేసిన ఆమెకు హెచ్‌1–బీ వీసా కూడా వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది.

ఈ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 4న గొంతు నొప్పితో బాధ‌ప‌డుతుండ‌టంతో స్నేహితులు ఆమెను ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు క్యాన్సర్‌ స్టేజ్‌–4గా నిర్ధారించారు. హాస్పిట‌ల్‌లో చికిత్స పొందుతూ గురువారం (అక్టోబ‌ర్ 1) మృతిచెందింది. దీంతో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అమెరికా తెలుగు సంఘం ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఆదివారం నాటికి మృతదేహం హైదరాబాద్‌కు చేరుకుంటుందని బంధువులు తెలిపారు.

 

Advertisement
Advertisement