త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Boiler Blast | హెల్త్‌కేర్‌ పరిశ్రమలో పేలిన బాయిలర్‌.. న‌లుగురు దుర్మ‌ర‌ణం

Boiler Blast | ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడులోని శ్రీసిటీలో (Sri City) ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మాత్ర‌లు త‌యారు చేసే టిల్‌ హెల్త్‌కేర్ (Til Healthcare) ప‌రిశ్ర‌మ‌లో శ‌నివారం ఉద‌యం బాయిల‌ర్ (Boiler Blast ) పేలింది. దీంతో న‌లుగురు మ‌ర‌ణించారు.

G

Andhra pradesh | Published On Oct 3, 2026, 10.25 am IST

Boiler Blast | హెల్త్‌కేర్‌ పరిశ్రమలో పేలిన బాయిలర్‌.. న‌లుగురు దుర్మ‌ర‌ణం
Advertisement

Boiler Blast | త్రినేత్ర న్యూస్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని తిరుప‌తి జిల్లా స‌త్య‌వేడులోని శ్రీసిటీలో (Sri City) ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. మాత్ర‌లు త‌యారు చేసే టిల్‌ హెల్త్‌కేర్ (Til Healthcare) ప‌రిశ్ర‌మ‌లో శ‌నివారం ఉద‌యం బాయిల‌ర్ (Boiler Blast ) పేలింది. దీంతో న‌లుగురు మ‌ర‌ణించారు. మరో 12 మందికిపైగా తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ఈ ప్ర‌మాదంతో ప‌రిశ్ర‌మ‌లో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం సృష్టించింది.

బాధితులంతా నైట్ షిఫ్ట్ నుంచి విధుల్లో ఉన్న కార్మికుల‌ని తెలుస్తున్న‌ది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు, సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు తెలియాల్సి ఉంది. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఎంతమంది ఉన్నారు? మరెవరైనా గాయపడ్డారా? అనే వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

Advertisement
Advertisement