Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా … నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది – చంద్రబోస్ కామెంట్స్
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు పాటలు రాయడానికి 19 నెలల సమయం పట్టిందని గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. . ‘నాటు నాటు’ పాట కంటే ఎన్నో మంచి పాటలు రాశనని, కానీ ఆస్కార్ మాత్రం దానికే వచ్చిందని చెప్పారు. భోగి కోసం అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాసే అవకాశం వచ్చిందని చంద్రబోస్ పేర్కొన్నారు. .
Entertainment | Published On Nov 21, 2026, 6.52 pm IST
Chandrabose | భోగి సినిమా కోసం సహజమైన తెలంగాణ మాండలికంలో పాటలు రాయడం సంతృప్తినిచ్చిందని గేయ రచయిత చంద్రబోస్ అన్నారు. శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతోన్న భోగి నవంబర్ 27న రిలీజ్ అవుతోంది. భోగి సినిమాలోని అన్ని పాటలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఇటీవల రిలీజ్ చేసిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. భోగి రిలీజ్ సందర్భంగా ఈ సినిమాలోని పాటలతో పాటు గేయ రచయితగా తన సినీ ప్రయాణంపై చంద్రబోస్ ఆసక్తికర కామెంట్లు చేశారు.
తెలంగాణ మాండలికంలో...
‘మల్లేశం’, ‘ఛాంపియన్’ సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాశాను. కాకపోతే ‘భోగి’లో అచ్చ తెలంగాణ మాండలికంలో రాసే అవకాశం దక్కింది. నేను చిన్నప్పుడు విన్నవి, మాట్లాడుకున్నవి, పరిశీలించిన మాటలను ఇందులో పాటలుగా రాశాను. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది.
రంగస్థలం...
సినిమా కవి ప్రతి మాండలికంలోనూ ఒదిగిపోవాలి. ‘రంగస్థలం’ సినిమా కోసం గోదావరి మాండలికంలో పాటలు రాశాను. అలాగే ‘పుష్ప’లో చిత్తూరు యాస పరిశీలించి రాయడం జరిగింది. ‘భోగి’ సినిమాకు వచ్చేసరికి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు, నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. ఒక్కసారి కళ్ళు మూసుకుంటే నా మూలాల్లోకి వెళ్లిపోతా. ఆ మూలాల్లో తడి ఇంకా ఉంది. నా వయసు 13 ఏళ్లు దాటిన తర్వాత బతుకుతెరువు కోసం మా ఊరి నుంచి హైదరాబాద్ వచ్చేశాను. కాకపోతే ఆ 13 ఏళ్లలో నేను నేర్చుకున్న భాష, ఆ పరిసరాలు, మాండలికం.. అవన్నీ ఇంకా నా మనసు లోపల ఉన్నాయి. కళ్ళు మూసుకుంటే అదంతా పైకి వచ్చేస్తుంది. ఆ భావాలన్నీ భోగి పాటల్లో ఆవిష్కరించా.
ఎగిలివారంగ...
‘ఎగిలివారంగ’ పాటలో తెలంగాణ పల్లెటూళ్లలో పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు ఆ దినచర్య ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేశాం. ప్రతి పాట కూడా ఒక కథలాగా ఉండాలి. ఇది నేను పాటించే నియమం. ప్రతి పాటకు ఒక అందమైన ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఉండాలి. ఆ రోజుల్లో తెలంగాణ ప్రజల జీవితాలు ఎలా ఉండేవి? వాళ్లు ఎవరి ఏలుబడిలో ఉండేవారు? వాళ్లను ఎవరు కట్టడి చేసేవారు? అవన్నీ కూడా కళ్లకు కట్టినట్టుగా సాహిత్యంతో చెప్పడం జరిగింది. అందుకే చాలామంది పర్సనల్‌గా కనెక్ట్ అవుతున్నారు. తమ ఊరిలో ఉన్నట్టుగా ఉందని భావిస్తున్నారు. భోగి సినిమాలో ఐదు పాటలు ఉన్నాయి. రెండు బిట్ సాంగ్స్, మూడు ఫుల్ సాంగ్స్. అన్నీ కూడా సిట్యూవేషనల్ సాంగ్సే. ప్రతి పాట సందర్భానికి అనుగుణంగా ఉంటుంది. ముందు సాహిత్యం రాసి, ఆ పాటను స్వరపరిస్తే ఎక్కువ కాలం నిలుస్తుందని నా వ్యక్తిగత అభిప్రాయం.
సింగిల్ కార్డ్....
గతంలో రంగస్థలం, ‘పుష్ప’, ‘నేనొక్కడినే’ సినిమాలకు సింగిల్ కార్డు రాశాను. సింగిల్ కార్డుతో రాయడం వల్ల ఒక పాట తర్వాత వచ్చే పాట ఎలా ఉండాలి, ఎలాంటి వైవిధ్యం చూపించాలి అనే విషయంలో క్లారిటీ ఉంటుంది. కథకు సంబంధించి ఎలాంటి విషయాలు చెప్పాలనే దానిపై పూర్తి అవగాహన ఉంటుంది.
19 నెలలు...
‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు పాటలు రాయడానికి 19 నెలల సమయం తీసుకున్నాను. రాయడం త్వరగానే రాశాను. కానీ ఆ పాటకు కంపోజ్ చేయడం, మార్పులు చేర్పులు.. మధ్యలో కోవిడ్.. ఇవన్నీ కలిసి 19 నెలలు పట్టింది. ‘నాటు నాటు’ పాట కంటే చాలా మంచి సాంగ్స్ రాశాను. కాకపోతే ఈ పాటకే ఎందుకు ఆస్కార్ వచ్చిందనే దానికి ఒక చిన్న విశ్లేషణ ఉంది. ఇది ప్రేమ గీతం కాదు, బంధాల మధ్య ఉండే గీతం కాదు, తాత్విక గీతం కాదు. అది ఒక ఆడి పాడే పాట. మిగతా పాటల కంటే ఈ పాట వందకి వంద మార్కులు కొట్టింది. ఆ సంవత్సరం ఈ పాటకు మించి ఉర్రూతలూగించిన పాట ఏదీ లేదు. బహుశా నా సహనానికి అవార్డు వచ్చిందేమో అనిపించింది. (నవ్వుతూ) 31ఏళ్లుగా సాహితీ యజ్ఞం చేస్తున్నాను. భగవంతుడు ఈ రకంగా నన్ను కరుణించాడేమో అనిపించింది.
ఐటెం సాంగ్స్‌లో
ఇప్పుడు ప్రతి పాటకీ ఒక స్పెషాలిటీ ఉంటుంది. అలాగే ఐటెం సాంగ్స్‌లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆ పాటల్లోకూడా చాలా తాత్వికత, లోతైన భావాలు ఉంటున్నాయి. నేను రాసిన ‘రింగా రింగా’ నుంచి మొన్నటి ‘పుష్ప’లోని ‘దెబ్బలు పడతాయి’ పాట వరకు చూసుకుంటే, ఆ పాటల్లో కూడా సమాజంలోని అంశాలను ప్రతిబింబిస్తూనే చక్కని తాత్వికత ఉంటుంది.
గ్రామ్‌పోన్ రికార్డులు...
క్యాసెట్లు, సీడీలు, మెమొరీ కార్డులు.. ఇవన్నీ చూస్తూ వచ్చాను. గ్రామఫోన్ రికార్డులు కూడా చూశాను. ఇప్పటికీ ‘బొంబాయి ప్రియుడు’ క్యాసెట్ నా దగ్గర ఉంది. ఇప్పుడు పాటలు ఎంత హిట్టయ్యాయనే దానికి కొలమానంగా యూట్యూబ్ వరకు వచ్చాము. పాట ప్రజల దగ్గరకు చేరే మార్గం మారింది, పాటను చేరవేసే సాధనం మారింది. పాట మారలేదు. పాటకు భావం ముఖ్యం. ఆ భావం ప్రజల భాషల్లో ఉండాలి. ప్రజల్లో చైతన్యం రగిలించాలంటే ప్రజల్లో ఒకరిగా ఉండాలి. వారి వాడుక భాషను మనం మాట్లాడాలి. భోగి తర్వాత రౌడీ జనార్ధన’, ‘విశ్వంభర’, రామ్ పోతినేని సినిమా, హిందీలో షారుక్ ఖాన్‌తో పాటు మరికొన్ని సినిమాలకు పాటలు రాస్తున్నా
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Allu Arjun | శ్రీలంకలో అల్లు అర్హ బర్త్‌డే సెలబ్రేషన్స్ – కూతురి కోసం రాకా షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన బన్నీ
నవంబర్ 21, 2026

Priyanka Chopra | “వారణాసి”కి తెలుగులో ప్రియాంక చోప్రా సొంత డబ్బింగ్ – కండీషన్ పెట్టిన రాజమౌళి
నవంబర్ 21, 2026

Ramayana | రామాయణంలోని మరో కోణం – లక్ష్మణుడి కథతో సినిమా – షూటింగ్ మొత్తం ఏఐతోనే…
నవంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Jagadeesh Reddy | తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?
- ●HYDRAA | సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ.. 4 ఎకరాల మేర ఆక్రమణలు తొలగింపు
- ●Maternity Leave For Third Child | మూడో బిడ్డకూ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే!
- ●Lok Adalat | 3 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..
- ●ACB Rides | లంచం తీసుకురా.. లేదంటే లక్ష జరిమానా పడ్తది.. విద్యుత్ సబ్ ఇంజినీర్ ఏసీబీకి ఎలా చిక్కాడంటే!
- ●Shooting in Canada | కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

Jagadeesh Reddy | తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?

HYDRAA | సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ.. 4 ఎకరాల మేర ఆక్రమణలు తొలగింపు

Maternity Leave For Third Child | మూడో బిడ్డకూ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే!

Lok Adalat | 3 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..



