HYDRAA | సందపల్లి చెరువుకు హైడ్రా రక్షణ.. 4 ఎకరాల మేర ఆక్రమణలు తొలగింపు
HYDRAA | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండిపల్లి విలేజ్‌లోని సందపల్లి చెరువును హైడ్రా శనివారం కాపాడింది. చెరువులోకి జరిగి ప్రహరీ నిర్మించి.. పచ్చిక బయళ్లతో సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకునే వారికి హైడ్రా చెక్ పెట్టింది.
HYDRAA | త్రినేత్ర న్యూస్ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం తొండిపల్లి విలేజ్‌లోని సందపల్లి చెరువును హైడ్రా శనివారం కాపాడింది. చెరువులోకి జరిగి ప్రహరీ నిర్మించి.. పచ్చిక బయళ్లతో సామ్రాజ్యాన్ని సృష్టించాలనుకునే వారికి హైడ్రా చెక్ పెట్టింది. 4 ఎకరాల వరకూ చెరువులోకి జరిగి ప్రహరీ నిర్మించి ఆక్రమణలకు పాల్పడితే వాటిని హైడ్రా తొలగించింది.

మొత్తం చెరువు విస్తీర్ణం 76 ఎకరాలు కాగా.. ఈ మేరకు చెరువు లోపల వైపు కబ్జాలకు ఆస్కారం లేకుండా హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే 100 గజాల విస్తీర్ణంలో నిర్మించిన ఇంటిని, ఆ పక్కనే తాత్కాలికంగా ఏర్పాటు చేసిన షెడ్డును కూడా నేలమట్టం చేసింది. చెరువు లోపల భాగం నుంచి కబ్జాలు జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న హైడ్రా క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారులతో పరిశీలించింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్నట్టు నిర్ధారించుకుని చర్యలు చేపట్టింది. స్థానిక ఇరిగేషన్ అధికారుల సమక్షంలో హైడ్రా అధికారులు 1600ల మీటర్ల మేర ఫెన్సింగ్ వేశారు. చెరువుకు చెందిన భూమిగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు.
తాజావార్తలు
- ●Jagadeesh Reddy | తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?
- ●Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా ... నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది - చంద్రబోస్ కామెంట్స్
- ●Maternity Leave For Third Child | మూడో బిడ్డకూ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే!
- ●Lok Adalat | 3 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..
- ●ACB Rides | లంచం తీసుకురా.. లేదంటే లక్ష జరిమానా పడ్తది.. విద్యుత్ సబ్ ఇంజినీర్ ఏసీబీకి ఎలా చిక్కాడంటే!
- ●Shooting in Canada | కెనడాలో కాల్పుల కలకలం.. ఇద్దరు భారతీయుల దుర్మరణం

Jagadeesh Reddy | తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?

Chandrabose | అచ్చ తెలంగాణ మాండలికంలో పాటలు రాశా ... నాటునాటుకు అందుకే ఆస్కార్ వచ్చింది - చంద్రబోస్ కామెంట్స్

Maternity Leave For Third Child | మూడో బిడ్డకూ మెటర్నిటీ లీవ్ ఇవ్వాల్సిందే!

Lok Adalat | 3 వేలకు పైగా చెక్ బౌన్స్ కేసులు పరిష్కారం..




