BCCI AGM | ఐపీఎల్ కొత్త చైర్మన్ ఎవరూ..? త్వరలో బీసీసీఐ కీలక భేటీ..!
BCCI AGM | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సెప్టెంబర్ 18న ముంబయిలో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సమావేశానికి సంబంధించి 38 రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిపారు.
BCCI AGM | భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) సెప్టెంబర్ 18న ముంబయిలో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. సమావేశానికి సంబంధించి 38 రాష్ట్ర క్రికెట్ సంఘాలకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలిపారు. ఏజీఎం అజెండాలో అండమాన్, నికోబార్ దీవుల క్రికెట్ సంఘానికి బీసీసీఐ అసోసియేట్ సభ్యత్వం కల్పించే ప్రతిపాదన ఉందని పేర్కొన్నారు. ఈ అంశంపై జూన్‌లో జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ చర్చ జరిగింది. అసోసియేట్ సభ్యులకు బీసీసీఐలో ఓటింగ్ హక్కు ఉండదు. ఏజీఎంలో ఈ ప్రతిపాదనపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది.
ఐపీఎల్ పాలక మండలి పదవులకు ఎన్నికలు
ఏజీఎంలో ఐపీఎల్ పాలక మండలిలోని రెండు ఎన్నికైన స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందులో పాలక మండలి ఛైర్మన్ పదవి కూడా ఉంది. ప్రస్తుతం అరుణ్ ధుమాల్ ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. బీసీసీఐ ఎన్నికల అధికారి ఏకే జ్యోతి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. ఎన్నికల ఓటర్ల జాబితాలో తమ ప్రతినిధుల పేర్లను చేర్చేందుకు బీసీసీఐ పూర్తి సభ్యత్వం కలిగిన రాష్ట్ర సంఘాల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. ఎన్నికల కోసం ప్రతినిధుల పేర్లను నామినేట్ చేసేందుకు ఆగస్టు 31 వరకు గడువు ఉంది. చెల్లుబాటయ్యే నామినేషన్లతో తుది జాబితాను సెప్టెంబర్ 11న విడుదల చేయనున్నారు. రెండు పదవులకు ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
ఐసీఏ ప్రతినిధికి చోటు
ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) ప్రతినిధిని ఐపీఎల్ పాలక మండలిలో చేర్చే ప్రతిపాదన కూడా ఏజీఎం అజెండాలో ఉంది. దీంతో పాటు బీసీసీఐ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ నియామకంపైనా సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఐపీఎల్ పాలక మండలి ఎన్నికలు, అండమాన్ క్రికెట్ సంఘానికి సభ్యత్వం, ఐసీఏ ప్రతినిధి నియామకం, అంబుడ్స్‌మన్, ఎథిక్స్ ఆఫీసర్ ఎంపిక వంటి అంశాలు ఈసారి ఏజీఎంలో కీలకంగా మారనున్నాయి.
సంబంధిత వార్తలు

Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!
ఆగస్టు 26, 2026

Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా
ఆగస్టు 26, 2026

RBI | ఎన్ఆర్ఐల నుంచి భారీగా విదేశీ నిధులు.. ఆర్బీఐ స్వాప్తో 73 బిలియన్ డాలర్లు..
ఆగస్టు 26, 2026
తాజావార్తలు
- ●Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!
- ●Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా
- ●RBI | ఎన్ఆర్ఐల నుంచి భారీగా విదేశీ నిధులు.. ఆర్బీఐ స్వాప్తో 73 బిలియన్ డాలర్లు..
- ●Instagram Engagement | జెన్జీ నిరసనల తర్వాత.. ఇన్స్టాగ్రామ్లో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఎంగేజ్మెంట్.. 289.9% వృద్ధి
- ●Apple Foldable | ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ వచ్చేస్తోంది.. టచ్ఐడీతో సరికొత్తగా..!
- ●Harish Rao | భూములను రాత్రికి రాత్రే 22ఎ జాబితాలో పెట్టినోళ్లు.. రాత్రికి రాత్రే తీసేయలేరా?

Maharashtra Cliff Death | మహారాష్ట్ర విషాదం: ఐఫోన్ కాదు.. ఆ కుటుంబం కొండపైనుంచి పడిపోవడానికి అసలు కారణం ఇదే!

Madhavaram Krishna Rao | నా మీద పగుంటే సంపేయండి.. అవసరమైతే ప్రజల కోసం ఉరేసుకొని సస్తా

RBI | ఎన్ఆర్ఐల నుంచి భారీగా విదేశీ నిధులు.. ఆర్బీఐ స్వాప్తో 73 బిలియన్ డాలర్లు..

Instagram Engagement | జెన్జీ నిరసనల తర్వాత.. ఇన్స్టాగ్రామ్లో భారీగా పెరిగిన ప్రధాని మోదీ ఎంగేజ్మెంట్.. 289.9% వృద్ధి



