త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన

Heavy Rains | ఉత్తర తెలంగాణలోని 13 జిల్లాల్లో హఠాత్తుగా వరదలు ( Flash Floods ) సంభవిస్తాయి. బుధవారం రాత్రి మొదలుకొని గురువారం ఉదయం వరకు ఆయా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గోదావరి( Godavari ) నదీ పరివాహక ప్రాంతంలో ఒక్కసారిగా కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది... ఈ వివరాలను తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ ప్రకటించారు.

S

Telangana | Published On Jul 29, 2026, 6.55 pm IST

Heavy Rains | 13 జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్.. ఉత్తర తెలంగాణకు అతి భారీ వర్ష సూచన
Advertisement

30 నుంచి 40 సెంటీమీటర్ల వర్షం పడే అవకాశం
మరో 7 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
దక్షిణ తెలంగాణలో ముసురుతో కూడిన మోస్తరు వానలు
గోదావరి తీరంలో వరదలొచ్చే ప్రమాదం
తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చ‌రిక‌

Heavy Rains | త్రినేత్ర.న్యూస్ : ఉత్తర తెలంగాణలోని 13 జిల్లాల్లో హఠాత్తుగా వరదలు ( Flash Floods ) సంభవిస్తాయి. బుధవారం రాత్రి మొదలుకొని గురువారం ఉదయం వరకు ఆయా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు( Heavy Rains ) కురిసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గోదావరి( Godavari ) నదీ పరివాహక ప్రాంతంలో ఒక్కసారిగా కుంభవృష్టి కురిసే అవకాశం ఉంది... ఈ వివరాలను తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ ప్రకటించారు. ఆగస్టు 1 నుంచి పెద్దగా వర్షాలు ఉండకపోవచ్చని వెల్లడించారు.

30 నుంచి 40 సెంటిమీటర్లు

ఉత్తర తెలంగాణకు చెందిన ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కొమురం భీం, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో బుధవారం రాత్రి మొదలుకొని గురువారం ఉదయం వరకు.. ఆయా ప్రాంతాల్లో 30 నుంచి 40 సెంటిమీటర్ల మేర అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని బాలాజీ వెల్లడించారు. దీంతో గోదావరి తీరంలో ఉన్న గ్రామాల్లో మెరుపు వరదలు సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇక సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్త గూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన తెలంగాణ జిల్లాల్లో ముసురు నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెద‌ర్ మ్యాన్ బాలాజీ హెచ్చ‌రించారు.

సమ్మక్క బ్యారేజీలోకి 1,36,000 క్యూసెక్కులు

నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ఇప్పటికే గోదావరి నదిలోకి ఇన్ ఫ్లో పెరుగుతున్నది. ఎగువన కురుస్తున్న వానలతో ప్రాణహిత కూడా నిండుగా ప్రవహిస్తున్నది. ఈ నేపథ్యంలోనే బుధవారం కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయంత్రి పంప్ హౌస్‌ల‌లోని 2 మోటర్ల ద్వారా 6300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. శ్రీ పాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌లోకి బుధవారం సాయంత్రం 6 గంటలకు 66,126 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. 20 టీఎంసీలకు గాను ప్రస్తుతం ఇక్కడ 11 టీఎంసీలు నిల్వ ఉన్నది. చనాకా కొరాట బ్యారేజీలోకి 19 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. సీతమ్మ సాగర్‌లోకి లక్ష క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నది. సమ్మక్క బ్యారేజీలోకి లక్షా 36 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది. కడెం ప్రాజెక్టులోకి 11వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ప్రవహిస్తున్నది. కాగా ఈ రాత్రి కురిసే వర్షాలతో గోదావరికి అనుసంధానమై ఉన్న ఉప నదులు, వాగుల్లోకి పెద్ద ఎత్తున వ‌ర‌ద నీరు వచ్చి చేరే అవకాశం ఉన్నది.

Advertisement
Advertisement