Emmanuel Macron | హోటల్ వద్ద వరుస పేలుళ్లు.. ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఫ్రాన్స్ అధ్యక్షుడు
Emmanuel Macron | ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు (French President Emmanuel Macron) తృటిలో పెను ప్రమాదం తప్పింది. మాక్రాన్ ప్రస్తుతం సిరియా (Syria) పర్యటనలో ఉండగా... ఆ దేశ రాజధాని డమాస్కస్ (Damascus)లో వరుస బాంబు పేలుళ్లు (two explosions) సంభవించాయి.
International | Published On Jul 7, 2026, 3.50 pm IST
Emmanuel Macron | త్రినేత్ర.న్యూస్ : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు (French President Emmanuel Macron) తృటిలో పెను ప్రమాదం తప్పింది. మాక్రాన్ ప్రస్తుతం సిరియా (Syria) పర్యటనలో ఉండగా... ఆ దేశ రాజధాని డమాస్కస్ (Damascus)లో వరుస బాంబు పేలుళ్లు (two explosions) సంభవించాయి. రాజధానిలో ఫ్రాన్స్ అధ్యక్షుడు బస చేస్తున్న ఫోర్ సీజన్స్ హోటల్ సమీపంలోనే ఈ పేలుళ్లు చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది.
ఈ ప్రమాదం నుంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు తృటిలో తప్పించుకున్నారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ ఘటనకు కొద్దిసేపటికి ముందే మాక్రాన్ సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్ షరాతో సమావేశం కోసం అధ్యక్ష భవనంలోకి వెళ్లారు. ఆ కాసేపటికే పేలుడు శబ్దాలు వినిపించాయి. అధ్యక్షుడు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని, ఆయన పర్యటన యథావిధిగా కొనసాగుతుందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.
ఇక ఈ పేలుడు ఘటనలో 18 మందికిపైగా గాయపడినట్లు అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది. ఈ పేలుళ్లతో రాజధాని డమాస్కస్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొన్ని కార్లు మంటల్లో కాలిపోయాయి. రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇక ఈ పేలుళ్ల ఘటనకు ఏ ఉగ్రసంస్థా బాధ్యత వహించలేదు.
2024లో తిరుగుబాటు ద్వారా బషర్ అస్సాద్‌ను గద్దె దించి అల్ షరా అధికారంలోకి వచ్చారు. ఆయన అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి సిరియాలో పర్యటించిన పాశ్చాత్య దేశాధినేత మాక్రానే. అయితే, తాజా ఘటనతో ఆ దేశంలో భద్రతా సవాళ్లపై మరోసారి చర్చ మొదలైంది. ఈ ఘటన నేపథ్యంలో రాజధాని వ్యాప్తంగా అధికారులు భద్రతను పెంచారు.
🚨UPDATE
Smoke continues to rise from the site of the explosion in Damascus. It has been reported that multiple explosions occurred, and a large number of ambulances have been dispatched to the area. https://t.co/7Q7rhal63i pic.twitter.com/9d0XgvVjWs
— أبو رياح (@_3buR1ah) July 7, 2026
Also Read..
కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతాపై బ్యాన్ ఎత్తివేయాలంటూ కోర్టు ఆదేశం
సంబంధిత వార్తలు

G7 Hot Mic Moments | స్మోకింగ్ వదిలేసిన మెలోనీ, వాచ్ మర్చిపోయిన మాక్రాన్.. G7 సదస్సులో దేశాధినేతల సరదా సంభాషణ
జూన్ 17, 2026

PM Modi France Visit | భారత్ ‘ఇన్నోవేషన్’ మంత్రం: ఏఐ రేసులో మనదే ఆధిపత్యం.. ఫ్రాన్స్ గడ్డపై ప్రధాని మోదీ సగర్వ ప్రకటన!
జూన్ 14, 2026

Rafale Fighter Jets | భారత వాయుసేన అమ్ములపొదిలోకి మరో 114 రఫేల్ అస్త్రాలు.. లెటర్ ఆఫ్ రిక్వెస్ట్‌ను సిద్ధం చేసిన రక్షణ శాఖ
మే 25, 2026
తాజావార్తలు
- ●Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!

Software Engineer | ప్రియురాలిని చంపి.. రైలుకి ఎదురెళ్లిన సాఫ్ట్వేర్ ఇంజినీర్..

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం



